తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి  కార్మికులకు భారీగా వరాలు ప్రకటించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాల్లో కార్మికులకు 27 శాతం వాటా ఇవ్వడానికి తెలంగాణ సర్కారు ముందుకొస్తుందని ఆయన అన్నారు. సింగరేణి అధికారులకు చెల్లించాల్సిన ఎనిమిదేళ్ల పీఆర్సీ బకాయిలను కూడా వెంటనే చెల్లిస్తున్నామని ఆయన అన్నారు. సింగరేణి ఉద్యోగులకు భాగ్యనగరంలో ఇళ్లు నిర్మించుకోవడానికి భూమి కూడా కేటాయిస్తామని కేసీఆర్ ప్రామిస్ చేశారు. ముఖ్యంగా బయ్యారం గనుల్లో తవ్వకాల బాధ్యతను కూడా సింగరేణికి అప్పగించే ప్రపోజల్‌ను ప్రభుత్వం పరిశీలిస్తుందని కేసీఆర్ తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎలాంటి వాతావరణంలోనైనా పని చేసే నేర్పుగల కార్మికులు సింగరేణి కార్మికులని కేసీఆర్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 1212 కోట్ల రూపాయల నికర లాభాన్ని సింగరేణి ఆర్జించిన క్రమంలో.. ఆ లాభంలో కార్మికులకు కూడా వాటా ఇవ్వాలని తాము నిర్ణయంచుకున్నామని.. కార్మికులు, ఉద్యోగుల అభ్యున్నతే తెలంగాణ సర్కారు ఎప్పడూ కోరుకుంటుందని కేసీఆర్ అన్నారు. 


సింగరేణి కాలరీస్‌లో ఉద్యోగులు, కార్మికులు వేరు వేరు కాదని.. అందరూ ఉద్యోగులేనని కేసీఆర్ తెలిపారు. అందరూ ఓ కుటుంబంలా పాటుపడి సంస్థను ఇంత మంచి స్థితికి తీసుకొచ్చారన్నారు. తెలంగాణాలో సిరుల మాగాణి సింగరేణి అని సీఎం తెలిపారు. సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన విషయాన్ని తెలంగాణ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. తాజాగా సింగరేణికి సంబంధించి తాము తీసుకుంటున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశంలో తెలియజేశారు. ఆ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, ఈటల రాజేందర్, ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొదలైన వారు పాల్గొన్నారు.


[[{"fid":"173165","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]