హైదరాబాద్: రైతులకు కనీస మద్దతు ధరపై చర్చించేందుకు  మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతుకు మద్దతు ధర  కల్పించే ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశాలు  జారీ చేశారు. ప్రతి గింజకు మద్దతు ధర లభించేలా ప్రణాళిక వ్యూహాన్ని సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వ్యవసాయాన్ని లాభా సాటిగా తీర్చిదిద్దేందుకు వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్‌, పౌరసరఫరాలు తదితర శాఖలన్నీ సమన్వయంతో వ్యవహరించాలని సూచన చేశారు. దీని కోసం తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల ఆహార అవసరాలేమిటి ? ఏ పదార్ధాన్ని ఎంత తింటున్నారు ? వాటిని ఎంత పండిస్తున్నారు ? ఎంత దిగుబడి చేసుకుంటున్నారు ? ఎంత ఎగుమతి చేస్తున్నారు ? తదితర అంశా ల్లో ఖచ్చితమైన గణాంకాలు రూపొందించాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారుఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ


రాష్ట్రంలో కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి పరుస్తున్నామన్నారు. లాభసాటి సాగు లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు . రాష్ట్రం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాబోయే రోజుల్లో పంటల దిగుబడులు భారీగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.