టీఆర్ఎస్ విజయం సందర్భంగా కేసీఆర్ ప్రెస్ మీట్ : ప్రజలకు హామీల వర్షం
టీఆర్ఎస్ మరో మారు గెలుపు సాధించిన నేపథ్యంలో కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ విజయానికి సహరించిన కార్యకర్తలుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రజలను పలుహామీలు ఇచ్చారు. తర్వలో ఉగ్యోగ ఖాళీలన భర్తీ చేస్తామన్నారు. ప్రైవేటు రంగంలోని ఉద్యోగ అవకాశాలు పెంచుతామన్నారు. దళితలు,గిరిజనులు పడుతున్న భూమి బాధను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెడ్డి వైఖ్య కార్పోరేషన్లు ఏర్పాట్లు చేస్తామన్నారు. అలాగే ఆరోగ్య భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఇది టీఆర్ఎస్ పార్టీ విజయం కాదని..తెలంగాణ ప్రజలు విజయమన్నారు . ఈ విజయం తమపై బాధ్యతను పెంచిందన్నారు..బంగారు తెలంగాణ సాధన కోసం నిరంతరం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం కావాలంటే టీఆర్ఎస్ ను గెలిపించాలని ..శనీశ్వరం కావాలంటే మహాకూటమికి ఓటెయ్యాలని ఎన్నికల సందర్భంగా తాను ప్రజలకు పిలుపునిచ్చానని .. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రజలు .. టీఆర్ఎస్ ను ఆశీర్వదించి కాళేశ్వరాన్ని కోరుకున్నారని పేర్కొన్నారు. ఇదే సమయంలో మహాకూటమికి పాతాళంలోకి నెట్టేశరని ఈ సందర్భంగా కేసీఆర్ విమర్శించారు.