టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండోస్సారీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. అందుకు ముహుర్తం కూడా ఖరారైంది. రేపు మధ్యాహ్నం 1:30కి రాజ్ భవన్ లో  కేసీఆర్ సీఎంగా ప్రయాణస్వీకారం చేస్తారు. సంప్రాదాయాన్ని అనుసరించిన ఆయన రాష్ట్ర గవర్నర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గాను టీఆర్ఎస్ పార్టీ 88 స్థానాలు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. పూర్తి స్థాయి మెజార్టీ సాధించిన పార్టీగా టీఆర్ఎస్ అవతరించింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ కు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ కోరారు. ఈ మేరకు కేసీఆర్ మరో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుల్లి కేబినెట్ వైపు కేసీఆర్ మొగ్గు ?
ఈ సారి కేసీఆర్ తో పాటు అతి కొద్ది మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. ఆయనతో పాటు ఆరుగురు నుంచి 8 మంది వరకు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేస్తున్నట్లు టాక్. పంచాయితీ ఎన్నికల తర్వాత మంత్రివర్గం విస్తరణ చేపట్టి.. ఎన్నికల్లో  పనితీరు ఆధారం చేసుకొని మంత్రివర్గంలో తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం కేసీఆర్ తన కేబినెట్ లో 18 మంది వరకు తీసుకునే వెసలుబాటు ఉంది . నలుగురు మంత్రులు ఓటమి పాలుకావడంతో కేసీఆర్ కేబినెట్ లో మరో నాలుగు కొత్త ముఖాలకు చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రమాణ స్వీకారం రెండు దశలుగా ఉంటుందని టీఆర్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ పేర్కొన్నారు. దీన్ని బట్టి ప్రస్తానికి అతి కొద్ది మందితో ప్రమాణ స్వీకారం చేసింది.. రెండో దశలో మంత్రి వర్గ విస్తరణ చేసి మరికొందరిని తీసుకునే అవకాశం ఉంది.


మహిళకు చోటు దక్కేనా ?
గతంలో కేసీఆర్ మంత్రి వర్గంలో మహిళకు చోటు లేదు. ఈ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి పక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ క్రమంలో కేసీఆర్ ను మహిళా వ్యతిరేకి ముద్ర వేసి ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి. ఈ నేపథ్యంలో ఈ సారి అలాంటి విమర్శలకు తావు లేకుండా గెలిచిన మహిళా అభ్యర్ధుల్లో ఒకరికి చోటు  కల్పించాలని కేసీఆర్ బావిస్తున్నట్లు సమాచారం.


డిప్యూటీ ఫార్మలా ఉండేనా ?
గత కేబినెట్ లో ఉపముఖ్యమంత్రులుగా ఒక దళిత నేత, మరోకరు మస్లిం సామాజికవర్గానికి చెందిన నేతను నియమించారు. దళితుడి కోటాలో కడియం శ్రీహరి , మైనార్టీలో కోటాలో మహమూద్ అలీలు డిప్యూటీ సీఎంగా కొనసాగారు. ఈ సారి కూడా కేసీఆర్ ఇలాంటి ఫార్మాల అనుసరిస్తారా లేదా అన్న రేపటి ప్రమాణస్వీకారోత్సవంతో తేలిపోనుంది. ఇదిలా ఉండగా కేసీఆర్ ప్రమాణస్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లు చక చక జరిగిపోతున్నాయి. కాగా ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ లో గెలిచిన అభ్యర్ధులతో పాటు పార్టీకి చెందిన ముఖ్య నేతలు పాల్గొంటున్నారు.