CM KCR UP Tour: ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ ఉత్తరప్రదేశ్​కు వెళ్లనున్నారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ అంత్యక్రియల్లో (Mulayam Singh Yadav Funeral) పాల్గొనేందుకు కేసీఆర్ యూపీ వెళ్తున్నారు. ఇటావా జిల్లాలోని ములాయం స్వగ్రామం సైఫయకు ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చేరుకుంటారు. అక్కడ దివంగత ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పిస్తారు. అనంతరం అంత్యక్రియల్లో కేసీఆర్ పాల్గొంటారు. సీఎం వెంట తలసాని యాదవ్ కూడా వెళ్తున్నట్లు సమాచారం. నైట్ కేసీఆర్ ఢిల్లీలో బస చేయనున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌(82) సోమవారం కన్నుమూశారు. హర్యానా గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో నిన్న తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ములాయం మృతికి రాష్ట్రపతి, ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల సీఎంలు సంతాపం వ్యక్తం చేశారు.  


ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లా సైఫయి గ్రామంలో 1939 నవంబరు 22న ములాయం జన్మించారు. 1967లో  తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు ములాయం. 1992లో సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. ములాయం తన పొలిటికల్ కెరీర్ లో 10 సార్లు ఎమ్మెల్యేగా, 7సార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. 1989లో తొలిసారి సీఎం అయిన ములాయం.. మూడు సార్లు యూపీ ముఖ్యమంత్రిగా వ్యవహారించారు. రక్షణ మంత్రిగా కూడా సేవలందించారు. ములాయం మృతికి యూపీ రాష్ట్రప్రభుత్వం మూడు రోజులు సంతాపం దినాలను ప్రకటించింది. 


Also Read: Mulayam Singh Yadav: 60 ఏళ్ల రాజకీయం.. 18 ఎన్నికలు.. ప్రధాని పదవిని చేజార్చుకున్న యోధుడు! ములాయం అందరికి ఆదర్శం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook