రెవెన్యూ చట్టంలో మార్పులు తప్పవంటున్న కేసీఆర్
తెలంగాణలో పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు
రెవెన్యూ శాఖలో కీలక మార్పులని చేయాలని భావిస్తున్న తెలంగాణ కేసీఆర్..ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థ రద్దుకు సంబంధించి సీనియర్ నేతలు, మేధావుల అభిప్రాయాలను కేసీఆర్ సేకరించినట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యవస్థలో చాలా లోపాలున్నాయని... వాటి స్థానంలో కొత్త చట్టం తీసుకురావడం మంచిదని పలువురు సూచించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు తప్పవని సీఎం కేసీఆర్ పేర్కొనడం గమనార్హం. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఈ మార్పులు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి