Khairatabad bada ganesh imax road stampede: హైదరాబాద్ ఖైరాతాబాద్ గణపయ్యను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున పొటెత్తారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్యూలైన్ లలో ఉన్నవారు.. ఊపిరాడక ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. ఒకవైపు ఆదివారం, మరోవైపు ఈరోజు ఖైరతాబాద్ దర్శనానికి చివరి రోజున అని చెప్పడంతో.. పెద్ద ఎత్తున భక్తులు గణపయ్య దర్శనం కోసం బారులు తీరారు. ఈ క్రమంలో.. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌ నుంచి పరిసర ప్రాంతాలు జనంతో కిక్కిరిసి పోయి కనిపిస్తున్నాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయిన కూడా భక్తులను కంట్రోల్ చేయలేకపోయారని చెప్పుకొవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



బడా గణేష్ దర్శనానికి ఇవాళే చివరి రోజు కావడంతో భక్తులు తాకిడి ఎక్కువగా ఉందని నిర్వాహకులు వెల్లడించారు. భక్తులు భారీ ఎత్తున రావడంతో... అన్నివైపుల మార్గాలు, క్యూలైన్ లు కూడా చాలా బిజీగా మారిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఐమాక్స్ ప్రాంతంలో.. ఖైరతాబాద్ క్యూ లైన్ లలో ఒకర్నిమరోకరు తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.


ఖైరతాబాద్ గణపయ్యను దగ్గర చాలా రష్ ఉందని కూడా .. భక్తులు వెళ్లిపోవాలని కూడా ఉత్సవసమితి వారు ప్రకటిస్తున్నారు.మరోవైపు.. సోమవారం భక్తుల దర్శనాలను నిలిపివేసి,  నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తారని ఇప్పటికే ఉత్సవ కమిటీ ప్రకటించింది.   ఖైరతాబాద్ వినాయకుడి వద్ద మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. అదే విధంగా బండారు దత్తాత్రేయ సైతం పూజలు చేశారు. మరోవైపు ఖైరతాబాద్ గణేషుడు 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఈసారి సప్తముఖ మహాగణపతికి ఏర్పాటు చేశారు.  


Read more: Ganesh Visarjan: వినాయకుడి నిమజ్జనం ఎందుకు చేయాలి.. దీని వెనుక ఉన్న ఈ రహాస్యం ఏంటో మీకు తెలుసా..?


గణేష్ సన్నిధిలో శ్రీనివాస కళ్యాణం వైభవంగా నిర్వహించారు. సెప్టెంబర్ 17న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరగనుంది. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తవుతుందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఉదయం 6.30 గంటలకు పూజలు ముగించుకుని నిమజ్జనానికి గణనాథుడు బయలుదేరనున్నారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనాన్ని అన్ని ఏర్పాటు చేశారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.