Khairatabad Ganesh: బ్రేకింగ్.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటి చైర్మెన్ మృతి
Khairatabad Ganesh: హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మెన్ అకాల మరణం చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న సుదర్శన్ ముదిరాజ్ శనివారం తెల్లవారుజామున చనిపోయారు.
Khairatabad Ganesh: హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మెన్ అకాల మరణం చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న సుదర్శన్ ముదిరాజ్ శనివారం తెల్లవారుజామున చనిపోయారు.కొన్నాళ్లుగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు సుదర్శన్ నేతృత్వంలోనే జరుగుతున్నాయి. వినాయక ఉత్సవ కమిటి చైర్మెన్ గా కూడా దశాబ్దానికి పైగా ఆయనే పని చేస్తున్నారు. సుదర్శన్ ముదిరాజ్ మృతితో ఖైరతాబాద్ లో తీవ్ర విషాదం నెలకొంది. సుదర్శన్ ముదిరాజ్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. శనివారమే సుదర్శన్ అంత్యక్రియలు జరుపుతామని కుటుంబ సభ్యులు తెలిపారు.