MLA Danam Nagender Comments in Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. శుక్రవారం అసెంబ్లీలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌ నగరంలో అభివృధ్ధి కార్యక్రమాలపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చను ప్రారంభించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి పరుషపద జాలం ఉపయోగించారు. దానం మాట్లాడడం మొదలు పెట్టగానే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నారో చెప్పాలన్నారు. దీంతో వాగ్వాదం మొదలైంది. తోలు తీస్తా.. బయట తిరిగివ్వనంటూ దానం బెదిరించారు. ఒక్కొక్కరికి అంటూ బండబూతులు తిట్టారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలుపుతూ.. స్పీకర్ పోడియం వైపు దూసుకొచ్చి నినదాలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Mukesh Ambani House Pics: మైండ్ బ్లాక్‌ అయ్యేలా ముఖేష్ అంబానీ ఇల్లు.. ఆ ఫ్లోర్‌లోనే ఎందుకు ఉంటున్నారో తెలుసా..!  


దానం నాగేందర్ కూడా పోడియం వైపు రాగా.. కాంగ్రెస్ సభ్యులు వెనక్కి తీసుకువెళ్లారు. దానం నాగేందర్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వడానికి నిరసనగా ఎమ్మెల్యే కేటీఆర్‌, ఇతర బీఆర్ఎస్ సభ్యులు సభను వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. దానం నాగేందర్ కామెంట్స్‌లో అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలు ఉంటే.. వాటిని రికార్డుల నుంచి తీసేస్తామని స్పీకర్ ప్రసాద్ కుమార్ వెల్లడించారు. సభ నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. జాబ్ కేలండర్‌లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసినందు ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్ పార్క్ తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన చేపట్టారు. 


మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు శాసన సభలో దానం నాగేందర్ మాట్లాడిన భాష సభ్య సమాజం తల దించుకునే విధంగా ఉందన్నారు. హైదరాబాద్ సిటీ మీద చర్చ జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక ఏంటి అని తాము అడుగుదాం అనుకున్నామన్నారు. స్పీకర్ నిన్న తమకు చాలా నీతులు చెప్పారని.. ఈరోజు దానం నాగేందర్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తామన్నారు. దానం నాగేందర్‌పై యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు.


మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. "తెలంగాణ శాసన సభ దుశ్శాసన సభగా మారింది. ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలకు దక్కే గౌరవం ఇదేనా..? నిన్న మహిళ ఎమ్మెల్యేలను అవమానపరిచారు. సభ నాయకుడే మా ఎమ్మెల్యేలను తిట్టేపించే ప్రయత్నం చేస్తున్నాడు. దానం నాగేందర్ మాట్లాడే భాష.. రౌడీ షీటర్ మాట్లాడే భాషలా ఉన్నదీ. కన్న తల్లులను అవమానపరిచే విధంగా దానం నాగేందర్ వ్యాఖ్యలు ఉన్నాయి. మాతృత్వం విలువ తెలియని వారు మాత్రమే ఇలా మాట్లాడుతారు. దానం నాగేందర్ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలి.


మా హయంలో మేము ఎన్నడూ చేయలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో దానం నాగేందర్ ఇలానే మాట్లాడాడు. జాబ్ క్యాలెండర్ కాస్త జోక్ క్యాలెండర్ అయిపోయింది. వృద్దులకు, మహిళలకు 2500 ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ మాట్లాడాడు. జాబ్ క్యాలెండర్‌పై చర్చకు బయపడింది.. చర్చ చేయామంటే చెయ్యకుండా పారిపోయారు. దానం నాగేందర్ వెంటనే క్షమాపణ చెప్పాలని అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీకీ ధన్యవాదాలు. హైదరాబాద్ ఏమైనా దానం నాగేందర్ జాగీరా..? ఈ విధంగా మాట్లాడితే హైదరాబాద్‌కు పెట్టుబడులు ఎలా వస్తాయి. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ.. పరిపాలన చేతకాదంటే దేశానికి ఒక దిక్సూచి చూపించాడు కేసీఆర్. శాసన సభ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే.." అని అన్నారు.


Also Read: Telangana Electricity: వర్షాకాలంలో కరెంట్ సమస్యలా..వెంటనే ఇలా ఫిర్యాదు చేయండి..!!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.