King Cobra in Vemulawada Temple: వేములవాడ రాజన్న ఆలయంలో నాగుపాము కలకలంవేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నాగుసాము ప్రత్యక్షమైంది. ఆయల ప్రధాన ద్వారం దగ్గర పాము కనిపించడంతో భయంతో భక్తులు పరుగులు తీశారు. నేలపై వేగంగా కదులుతున్న పాములు చూసి హడలిపోయి కొందరు కేకలు వేశారు. దాంతో కొద్ది సేపు ఆలయంలో గందరగోళ పరిస్థితి తలెత్తింది. అప్రమత్తమైన ఆలయ అధికారులు పాములు పట్టే వారిని పిలిపించారు. చాలా సేపు ప్రయత్నించిన తర్వాత వారు పామును పట్టుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బయట ఎండలు మండిపోవడంతో.. నీడలో సేద తీరేందుకు పాము ఆలయంలోకి వచ్చి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అయితే పాము ఎవరికీ ఎలాంటి అపాయం చేయకపోవడంతో భక్తులు, అధికారులు ఊపరిపీల్చుకున్నారు. కొందరు మాత్రం నాగాభరణుడైన శివుడి సన్నిధిలో పాము ప్రత్యక్షం కావడం దైవలీల అని భావిస్తున్నారు.


మరోవైపు ఆలయంలో పట్టుకున్న పామును జనసంచారం లేని చోట సురక్షితమైన ప్రాంతంలో విడిచిపెట్టినట్లు ఆలయ సిబ్బంది చెబుతున్నారు.


Also Read: adipurush: ఆదిపురుష్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు


Also Read: TS Police Age Limit: పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ.. కానిస్టేబుల్, ఎస్సై వయో పరిమితి వివరాలు ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.