తెలంగాణ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి గరం గరం..
ఫిబ్రవరి 7న తెలంగాణ సీఎం కేసీఆర్ చివరి దశ మెట్రో రైలు ప్రాజెక్టు జేబిఎస్-ఎంజిబిఎస్ కారిడార్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రారంభోత్సవానికి హాజరు కాలేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి శనివారం విచారం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: ఫిబ్రవరి 7న తెలంగాణ సీఎం కేసీఆర్ చివరి దశ మెట్రో రైలు ప్రాజెక్టు జేబిఎస్-ఎంజిబిఎస్ కారిడార్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రారంభోత్సవానికి హాజరు కాలేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి శనివారం విచారం వ్యక్తం చేశారు.
ఈ మెట్రో ప్రాజెక్టులో కేంద్ర నిధుల వినియోగాన్ని మెట్రో అధికారులతో శనివారం సమీక్షించిన కిషన్ రెడ్డి, ఈ కార్యక్రమానికి కేవలం ఒక రోజు ముందు సమాచారం ఇచ్చారని అధికారులకు తెలియజేశారు. పార్లమెంటు సమావేశాల్లో ఉన్నందున హాజరుకావడానికి తనకు వీలు కాలేదని అని తెలిపారు. ఈ సమావేశంలో ఎల్ అండ్ టి మెట్రో రైల్ (హైదరాబాద్) ఎండి, సిఇఒ కె.వి.బి. రెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.పి. నాయుడు, సిఓఓ అనిల్ కుమార్ సైని, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆనంద్ మోహన్ హాజరయ్యారు.
ఇప్పటికే కేటాయించిన వాటిలో మొత్తం 1,458 కోట్లలో 1,200 కోట్లను కేంద్రం విడుదల చేసిందని, డీపీఆర్లో సూచించిన విధంగా కారిడార్‌ను ఫలక్ నుమా వరకు విస్తరించాలని అధికారులను కోరారు. ఈ కారిడార్ కొనసాగింపు ఫలక్ నుమా మాత్రమే కాకుండా ఇతర పర్యాటక ప్రదేశాలను అనుసంధానించేలా ఉండాలని అధికారులను ఆదేశించారు. సమావేశ అనంతరం సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్, పార్టీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు జేబీఎస్ నుండి ఎంజిబీఎస్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు.
మరోవైపు, తెలంగాణ పశుసంవర్ధక శాఖా మాత్యులు శ్రీనివాస్ యాదవ్ ఇదే అంశంపై ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, తాము మెట్రో అధికారుల నుండి ఈ కార్యక్రమం గురించి తెలుసుకున్న తరువాత కిషన్ రెడ్డిని ఆహ్వానించామని చెప్పారు. కానీ ప్రోటోకాల్ ఉల్లంఘన వంటివి ఎక్కడ జరగలేదని వివరణిచ్చారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..