మోడీ మంత్రివర్గంలో కిషన్ రెడ్డికి చోటు !! శాఖ కేటాయింపుపై సస్పెన్స్
నరేంద్ర మంత్రివర్గంలోకి తెలంగాణకు బెర్తు ఖరారైంది
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డికి మోడీ కేబినెట్ లో చోటు ఖాయమైంది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం పీఎంవో కార్యాలయం నుంచి ఆయనకు ఫోన్ చేసి ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్ ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై రాత్రి 7 గంటలకు ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం పలువురు నేతలు కూడా కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు . ఈ సందర్భంలో కిషన్ రెడ్డి కూడా ప్రమాణస్వీకారం చేస్తారని తెలిసింది.
కిషన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు ఖాయమడంతో ఇప్పుడు ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై జోరుగా చర్చ నడుస్తుంది. కేబినెట్ మంత్రిగా తీసుకుంటారా లేదా సహాయ మంత్రిగా తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. దీంతో కిషన్ రెడ్డికి కేటాయించే శాఖ విషయంలో ఉత్కంఠత నెలకొంది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డికి కేంద్రం హోంశాఖ సహాయ మంత్రిగా అవకాశమిస్తారని ఊహాగానాలు వెలువుడుతున్నాయి.
గతంలో అంబర్‌పేట ఎమ్మెల్యేగా కిషన్ రెడ్డి సేవలందించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి బాట పట్టడం.. లోక్ సభ ఎన్నికల్లో ఆయనకు సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసే అవాశం ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిటీఆర్ఎస్ అభ్యర్థి సాయికిరణ్ యాదవ్‌పై కిషన్‌రెడ్డి ఘన విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి ఏళ్ల తరబడి పార్టీకి సేవలందించిందుకు గాను కిషన్ రెడ్డికి ఈ అవకాశవచ్చింది.