గత కొంత  కాలం నుంచి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరుబాట పట్టిన కోందండరాం రాజకీయాల్లో అడుపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన సొంతంగా పార్టీ పెడతారని కొందరు అంటుంటే.. ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.  రాజకీయ పార్టీ పెట్టినా..పెట్టిక పోయినా ఆయన పోటీ చేయడం ఖాయమని రాజకీయవర్గాల నుంచి సమాచారం. దీంతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం కూడా ఇప్పుడు చర్చనీయంగా మారింది.


కోదండరాం తన స్వస్థలం మంచిర్యాల నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారనే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన తరుచూ మంచిర్యాల జిల్లాలో పర్యటించడం కూడా దీనికి బలం చేకూర్చుతోంది. దీంతో కోదండరామ్ ను ఢీకొట్టే సరైన నేత కోసం కేసీఆర్ ఇప్పటి నుంచే అన్వేషణ మొదలెట్టారు. వాస్తవానికి మంచిర్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావు కోదండరాంకు గట్టి పోటీ ఇవ్వలేరని టీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తోంది. దీంతో ఆయన స్థానంలో ఎవరికి రంగంలో దించాలనే దానిపై  టీఆర్ఎస్ పార్టీ తర్జన భర్జన పడుతున్నట్లు తెలిసింది.