నల్గొండ: కేటీఆర్ సవాల్ ను  టి .కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంటక్ రెడ్డి  స్వీకరించారు. మహాకూటమి ఓడితే తాను తప్పకుండా రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. అయితే సవాల్ కేసీఆర్ దా.. కేటీఆర్ దో స్పష్టం చేయాలని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని..దమ్ముంటే ఎవరైనా తన సవాల్ స్వీకరించాలని ఓ ప్రముఖ మీడియా ఇంటర్యూలో బుధవారం కేటీఆర్ సవాల్ విసిరారు. కేటీఆర్ విసిరిన సవాల్ ను ఈ మేరకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వీకరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీసీలకు న్యాయం చేశాం 


ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఎన్ని కుయక్తులకు పాల్పడిన కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోలేరన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించామని..బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినన్ని సీట్లు.. ఏ పార్టీ కూడా కేటాయించలేదన్నారు.


తెలంగాణలో సోనియా, రాహుల్ పర్యటన


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమకారుల గొంతు కోశారని.. టీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో ఉద్యమకారులకు ఎలాంటి గుర్తింపు లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే రాహుల్, సోనియా తెలంగాణలో పర్యటిస్తారని.. వారి పర్యటనతో తెలంగాణ వాతావరణం ఒక్కసారి మారిపోతుంది. మహాకూమికి ప్రభంజనానికి టీఆర్ఎస్ గల్లంతుకావడం ఖామని ఈ సందర్భంగా కోమిరెడ్డి పేర్కొన్నారు.