Konda Surekha, Konda Murali love marriage: కొండా సురేఖ, కొండా మురళి... కుటుంబంలో ప్రేమానురాగాలు పంచుకోవడంలోనే కాదు.. పగలు, ప్రతీకారాలు పంచుకోవడంలోనూ వీళ్లది అన్యోణ్యమైన దాంపత్యం. ఏ పార్టీలో ఉన్నా.. ఏ పరిస్థితుల్లో ఉన్నా.. ఒకే మాటపై సాగిపోయే వీళ్ల అన్యోణ్యమైన దాంపత్యాన్ని చూసి ముచ్చటపడిన వాళ్లు చాలా మందే. అయితే, లవ్ మ్యారేజ్ నాటి నుంచే తమ మధ్య ఆ సమన్వయం ఉందంటున్నారు కొండా సురేఖ. తాజాగా జీ తెలుగు న్యూస్‌ స్టూడియోలో ఇచ్చిన ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ బిగ్ డిబేట్ విత్ భరత్ షోలో తన రాజకీయ ప్రస్థానాన్ని, వ్యక్తిగత జీవితానుభవాలను పంచుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ... కొండా మురళితో తన పరిచయాన్ని, ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసిన వైనాన్ని గుర్తుచేసుకున్నారు. ఒకవేళ బీకాం చదువుకోవడానికి తాను ఎల్బీ కాలేజీకి వెళ్లకపోయుంటే తన జీవితం మరోలా ఉండేదేమో అని అన్నారు. తన తండ్రి చూపించిన ఉద్యోగస్తుడి సంబంధం పెళ్లి చేసుకుని అలా వంటింటికి పరిమితమై ఉండేదానినేమో అని అభిప్రాయపడ్డారు. మూడేళ్లపాటు ప్రేమించుకున్న తర్వాత 1987లో తాము లవ్ మ్యారేజ్ చేసుకున్నామన్నారు. తన భర్త కొండా మురళి వాళ్ల అన్నయ్య, వదిన చనిపోవడంతో వారి బాబుకు అండగా నిలవాలనే ఉద్దేశంతో పెళ్లి చేసుకుందామని కొండా మురళినే మా ఇంట్లో మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చారు. 

అయితే, అప్పటికే మా అక్కకు ఇంకా పెళ్లి కావాల్సి ఉండటంతో అప్పటివరకు మా పెళ్లిని వాయిదా వేసుకోవాల్సిందిగా అమ్మానాన్న చెప్పారు. కానీ అందుకు కొండా మురళి సిద్ధంగా లేకపోవడంతో తిరుపతికి వెళ్లి అక్కడే పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లికి మురళి వాళ్ల అన్నయ్య, స్నేహితుడు మాత్రమే హాజరయ్యారు అని కొండా సురేఖ గుర్తుచేసుకున్నారు. పెళ్లి చేసుకున్న మరుసటి ఏడాదే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కొండా మురళి విజయం సాధించారు. అలా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని, ఆ తర్వాతే తాను రాజకీయాల్లోకి వచ్చానని కొండా సురేఖ గుర్తుచేసుకున్నారు. పెళ్లి చేసుకునే సమయంలో కూడా తామిలా రాజకీయాల్లోకి వస్తామని అనుకోలేదని, రాజకీయాల్లోకి వచ్చాకా ప్రజలు అందించిన ప్రోత్సాహంతోనే మా ప్రయాణం ఇక్కడి వరకు సాగిందని కొండా సురేఖ అన్నారు.


Also read : Big debate with Bharath: ఈటల రాజేందర్‌కి సీఎం కేసీఆర్‌తో అక్కడే చెడిందా ? ఈటలతో ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.