Konda Surekha KCR KTR: నీచాతి నీచమైన వ్యాఖ్యలు చేసి ఓ మహిళ జీవితాన్ని బజారున పడేసిన మంత్రి కొండా సురేఖ నోటి దూలకు అడ్డూ అదుపు ఉండడం లేదు. ఇప్పటికే అక్కినేని వంశంపై జుగుప్సకరమైన వ్యాఖ్యలు చేసిన సురేఖ మళ్లీ అదే స్థాయిలో రెచ్చిపోయారు. ఈసారి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. కేటీఆర్‌ లక్ష్యంగా చేసుకుని కేసీఆర్‌ను చంపేశారేమోనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక మహిళా నాయకురాలు.. మంత్రి అనే స్థాయి మరచి రోడ్డుపై తిరిగే చిల్లర మనుషులుగా వ్యాఖ్యలు చేయడం మరోసారి ఆమెపై అందరూ విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Konda Surekha: నోటి దూల ఎఫెక్ట్‌.. కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా?


గజ్వేల్‌ నియోజకవర్గంలో గురువారం పర్యటించిన కొండా సురేఖ ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఓ సమావేశంలో ఆమె మళ్లీ రెచ్చిపోయారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 'కేసీఆర్‌ కనిపించడం లేదు. అసలే కేటీఆర్‌కు పదవీ కాంక్ష ఎక్కువ. లోపల ఏమైనా గొంతుకు పిసిండో.. తలకాయ పగలగొట్టి సావగొట్టి లోపల పూడ్చిపెట్టిండో. మనిషి కనిపించకపోతే అనుమానపడాల్సి వస్తోంది. మనందరం కూడా పాపం కేసీఆర్‌ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆయన బాగుండాలని కోరుకోవాల్సి ఉంది' అంటూ విచక్షణ లేకుండా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు.

Also Read: Konda Surekha: క్షమాపణలు చెప్పని కొండా సురేఖ.. కానీ 'ఆ కామెంట్లు' వెనక్కి తీసుకున్న మంత్రి


 


తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన నాయకుడు.. పదేళ్లు రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక వ్యక్తి చావును కోరుకుంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ కలచివేస్తున్నాయి. ఆమె మానసికంగా ఇబ్బంది పడుతుందా.. లేదా ఏదైనా సమస్య ఉందా? అందరూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాగార్జునపై చేసిన వ్యాఖ్యలు యావత్‌ తెలుగు రాష్ట్రాలు ఖండించాయి. సినీ పరిశ్రమ ఇంకా ఆమెను వదిలి పెట్టడం లేదు. ఈ సమయంలో కేసీఆర్‌ గురించి ఈవిధంగా వ్యాఖ్యానించడం విమర్శలకు దారి తీస్తున్నాయి.


మౌనంగా వీక్షిస్తున్న గులాబీ పార్టీ
తమ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ వ్యవహారాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ మౌనంగా వీక్షిస్తోంది. ఆమె రెచ్చిపోయి మాట్లాడుతుండడాన్ని పరిశీలిస్తోంది. ఆమెను ఊరికే వదిలే ప్రసక్తే లేదు. ఇప్పటికే కేటీఆర్‌ పరువు నష్టం దావా వేయగా.. కార్పొరేటర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కేసీఆర్‌పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో భవిష్యత్‌ కార్యాచరణ భారీగా రచించేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధమవుతున్నది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.