KTR Challenge: `లంగలకు పెత్తనం ఇస్తే నెత్తి మీద పెత్తనం చేస్తారు` మోదీ, రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు
KT Rama Rao Challenge To Narendra Modi Revanth Reddy: తెలంగాణలో మరో సవాల్ వచ్చింది. మొన్న రేవంత్ రెడ్డికి సవాల్ విసరగా.. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ నరేంద్ర మోదీకి సంచలన సవాల్వ విసిరారు.
KT Rama Rao: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ రాజీనామాల అస్త్రాన్ని ఎంచుకుంది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీని ఇరకాటంలో పెట్టేలా గులాబీ పార్టీ నాయకులు రాజీనామాల సవాళ్లు కొనసాగిస్తున్నాయి. మొన్న రేవంత్ రెడ్డికి హరీశ్ రావు రాజీనామా సవాల్ విసరగా.. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నాయకులకు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో మోదీపై చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నామని, అవి తప్పని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని బీజేపీ నాయకులకు కేటీఆర్ సవాల్ విసిరారు.
Also Read: Kadiyam Kavya: కడియం కావ్యకు భారీ షాక్.. ఆమె రాకను వ్యతిరేకిస్తూ కొట్టుకున్న నాయకులు
హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవం (మే డే) నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా కేటీఆర్ మాట్లాడారు. 'బడా కార్పొరేట్లు గౌతమ్ అదానీ, అనిల్ అంబానీలకు పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణాలను మోదీ మాఫీ చేశాడని కేటీఆర్ తెలిపారు. కార్పొరేట్ల రుణాలను మాఫీ చేయలేదని బండి సంజయ్, కిషన్ రెడ్డి రుజువు చేస్తే రేపే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటించారు. హృదయం లేని మనిషి నరేంద్ర మోదీ అని అభివర్ణించారు. కార్మికులు, కర్షకులను మోదీ చావగొట్టిండు అని గుర్తు చేశారు.
Also Read: Revanth Fake Video: 'ఇప్పుడు రాలేను.. 4 వారాల టైం కావాలి' ఢిల్లీ పోలీసులకు రేవంత్
'కరోనా సమయంలో దేశం అల్లకల్లోలం అయి రవాణా సౌకర్యాలు స్తంభించగా మోదీ ప్రభుత్వం ఏనాడూ కార్మికులను పట్టించుకోలేదు. అప్పుడప్పుడు మరచిపోయి లంగలకు ఓట్లు వేస్తే మన నెత్తి మీద కూర్చుంటారు. మోదీ దేవుడు కాబట్టే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పదేండ్లలో సెస్‌ల పేరు మీద రూ.30 లక్షల కోట్లు వసూళ్లు చేశాడు' అని కేటీఆర్ తెలిపాడు. 'వాటిలో బడా కార్పొరేట్లు అదానీ, అంబానీలకు మోదీ నాలుగున్నర లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశాడు. నేను చెప్పేది తప్పు కాదు. ఆ తప్పు రుజువు చేస్తే రేపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా' అని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter