KTR Vs Revanth: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ, కాంగ్రెస్‌ మధ్య విమర్శలు, సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో మరోసారి రేవంత్‌ రెడ్డి వర్సెస్‌ కేటీఆర్‌ అనేలా విమర్శలు కొనసాగాయి. ఉచిత బస్సు పథకంపై నిర్మల్‌ సభలో రేవంత్‌ రెడ్డి చేసిన విమర్శలకు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. 'చీర నువ్వు కట్టుకుంటావా? రాహుల్‌కు కట్టిస్తావా' అని రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు. దీంతో చీర చుట్టూ తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా సాగింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Rahul Vs Modi: రిజర్వేషన్లపై నా సవాల్‌కు ప్రధాని మోదీజీ సిద్ధమా? రాహుల్‌ ప్రశ్న


లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని నిర్మల్‌లో ఆదివారం జన జాతర పేరిట కాంగ్రెస్‌ ప్రచార సభ నిర్వహించింది. రాహుల్‌ గాంధీ పాల్గొన్న ఈ సభలో రేవంత్‌ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఉచిత బస్సు పథకంపై కేటీఆర్‌ చేస్తున్న విమర్శలపై స్పందించారు. 'చీర కట్టుకుని మహిళగా తయారై ఆర్టీసీ బస్సులో ప్రయాణించు' అని కేటీఆర్‌కు రేవంత్‌ సూచన చేశారు.

Also Read: Cable Bridge: కేబుల్‌ బ్రిడ్జ్‌పై బర్త్‌ డే వేడుకలు.. పోలీసులైతే రూల్స్‌ వర్తించవా?


ఈ అంశంపై మాజీ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా ఘాటుగా స్పందించారు. రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ గాంధీకి కౌంటర్‌ ఇచ్చారు. 'రేవంత్ రెడ్డి, నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు నెలకు ₹2500 చుపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా? తెలంగాణాలో ఉన్న ఒక కోటి 67 లక్షల మంది 18 ఏండ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు. వంద రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెసుని బొంద పెట్టేది తెలంగాణ ఆడబిడ్డలే. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం అని, చేసేదేమో సోనియమ్మ జపం, కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తి వైఫల్యం.


కేసిఆర్ కిట్ ఆగింది
న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది
కల్యాణ లక్ష్మి నిలిచింది
తులం బంగారం అడ్రస్ లేదు
ఫ్రీ బస్సు అని బిల్డప్, అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్దాలు చేసే దుస్థితి 


అన్నింటినీ అటకెక్కించిన కాంగ్రెస్ పార్టీకి మహిళల ఓట్లడిగే హక్కు లేదని, చిల్లర మాటలు ఉద్దెర పనులు తప్ప నువ్వు నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమి లేదు అని అందరికీ తెలిసిపోయింది' అని కేటీఆర్‌ పోస్టు చేశారు.


ఆరు గ్యారంటీల్లో భాగంగా అమలుచేసిన ఉచిత బస్సు పథకం అస్తవ్యస్తంగా సాగుతోంది. మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో ఇదే అంశాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో అస్త్రంగా చేసుకుని విమర్శలు చేస్తోంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మొదలుకుని హరీశ్‌ రావు, కేటీఆర్‌ తదితరులు ఉచిత బస్సుపై విమర్శలు చేశారు. తాజాగా రేవంత్‌ 'చీర' వ్యాఖ్యలతో మరింత ఆసక్తిగా మారింది.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి