KT Rama Rao Vs Revanth Reddy: వడ్లకు రూ.500 బోనస్‌, వరంగల్‌ ఎంజీఎంలో కరెంట్‌ కోతలు, రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న సమస్యలపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వరంగల్-నల్గొండ-ఖమ్మం   పట్టభద్ర ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో కేటీఆర్‌ పర్యటించారు. అక్కడ జరిగిన పార్టీ సన్నాహాక సమావేశంలో కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసాలపై నిలదీశారు. కాంగ్రెస్‌కు కనువిప్పు కలగాలంటే రాకేశ్‌ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని పిలుపునిచ్చారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KT Rama Rao: సమాజానికి పట్టిన చీడపురుగు తీన్మార్‌ మల్లన్న.. కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు


 


'కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. వరంగల్‌లోని ఎంజీఎంలాంటి పెద్ద ఆస్పత్రిలో 5 గంటలు విద్యుత్‌ లేదు. విద్యుత్‌ లేకుంటే నవజాత శిశువులు, ఐసీయూలో పేషెంట్ల ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత' అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు చెప్పిన మాటకు విరుద్ధంగా సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకటి కాదు, రెండు కాదు...మోసాల పరంపర కొనసాగుతోందని వివరించారు.

Also Read: U Tax Scam: ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలనం.. రేవంత్‌ ప్రభుత్వంపై 'యూ ట్యాక్స్‌' పేరుతో మరో బాంబు


 


'కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండే. ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ వస్తే కరెంట్ పోతదని చెప్పాం. కరెంట్  కోతలు ఉన్నాయా? మార్పు బాగుందా?' అని ప్రశ్నించారు. ఎంజీఎం హాస్పిటల్ 24 అంతస్తులతో కట్టాం. కానీ ఇప్పుడు ఆ హాస్పిటల్ పని ఎక్కడికక్కడే వదిలేశారు. ఎన్నో ఐటీ కంపెనీలను తీసుకొచ్చామని.. కానీ ఇప్పుడు టెక్ మహీంద్రా వరంగల్ నుంచి వెళ్లిపోతోంది' అని కేటీఆర్‌ తెలిపారు.


ఇలాంటి ప్రభుత్వానికి పట్టభద్రులు ఎందుకు వీళ్లకు ఓటు వేయాలని కేటీఆర్‌ ప్రశ్నించారు. రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావాల్సింది పోయి.. వచ్చిన కంపెనీలను కాపాడుకునే సోయి లేదని రేవంత్‌ ప్రభుత్వంపై మండిపడ్డరాఉ. 'కాంగ్రెస్ వస్తే మోసం చేస్తారు. గోస పడాల్సి వస్తుందని అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పాం. ఇప్పుడు అదే జరుగుతోంది. రుణమాఫీ, తులం బంగారం, స్కూటీలు, మహిళలకు రూ.2,500, పెద్ద మనుషులకు రూ.4 వేల ఫించన్‌.. వీటిలో ఏ ఒక్కటైనా అమలైందా?' అని నిలదీశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా  అని రేవంత్ రెడ్డి చెప్పి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వాలేదని గుర్తుచేశారు. 


'ప్రపంచంలో ఏ మేజిషియన్‌కు  కూడా సాధ్యం కాని విధంగా 30 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు రేవంత్‌ రెడ్డి మ్యాజిక్ చేస్తున్నాడు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను సిగ్గు లేకుండా నేను ఇచ్చానని చెప్పుకుంటున్నాడు' అని కేటీఆర్‌ మండిపడ్డారు. 6 నెలల కిందటే కాంగ్రెస్ చేతిలో మోసానికి గురయ్యారని.. మళ్లీ మోసానికి గురి కావొద్దు అని సూచించారు. ఎవరుంటే బాగుంటుందో రైతులు బిడ్డలు, విద్యార్థులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.


'ఓట్ల కోసం మాత్రమే ఇచ్చిన హామీలే అవన్నీ. ఒక్కటి కూడా అమలు చేయటం వాళ్లతోని కాదు' అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 'రాకేష్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, రైతు బంధులాంటి అన్ని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారు. పట్టభద్రులు రాకేశ్‌ రెడ్డికి మొదటి ప్రాధాన్యం ఓటు వేసి గెలిపించాలి' అని కోరారు.


కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న పేరు ప్రస్తావించకుండా కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. 'కాంగ్రెస్ అభ్యర్థి మెడల పుస్తెలు గుంజుకుపోయే బ్యాచ్. గోల్డ్ కూడా ఎత్తుకుపోయే వ్యక్తి. యూట్యూబ్‌ను అడ్డం పెట్టుకొని పెద్దవాళ్లను తిడితే పెద్దోన్ని అయిపోతా అనుకునే వ్యక్తి. బ్లాక్ మెయిలర్. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అసలు పేరు అది కాదంట. అలియాస్ అని పెట్టుకున్నాడంట. అలియాస్ అనే పేర్లు దొంగలకు, లంగలకు ఉంటాయి. ఇలాంటి దొంగలను తీసుకొచ్చి మండలిలో కూర్చొబెడితే చట్టసభలకు ఉన్న గౌరవం కూడా పోతుంది. ఆడపిల్లల ఫోటోలు మార్పింగ్ చేసినందుకు కేసుల పాలైన వ్యక్తికి అవకాశం ఇద్దామా' అని ప్రశ్నించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter