KT Rama Rao: కాంగ్రెస్ అభ్యర్థిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. `పనికి రాని చెత్త`గా అభివర్ణన
KT Rama Rao Sensational Comments On Malkajigiri Candidate: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై మజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పనికి రాని చెత్తగా అభివర్ణించారు. డమ్మీ అభ్యర్థిని.. ఇక్కడ తీసుకొచ్చి పడేశారని పట్నం సునీతా రెడ్డిపై ధ్వజమెత్తారు.
KT Rama Rao: మల్కాజిగిరి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా రెడ్డిపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పనికి రాని చెత్తను తీసుకొచ్చి మల్కాజిగిరిలో పడేశారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి మరోసారి సంచలన సవాల్ వేశారు. 'ఇప్పటికీ సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరిలో పోటీ చేయ్' అని ఛాలెంజ్ చేశారు.
Also Read: Raaj Kumar Anand: ఢిల్లీ రాజకీయాల్లో భారీ కుదుపు.. మంత్రి పదవికి కీలక నాయకుడు రాజీనామా
మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశంలో మేడిపల్లిలో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 'ఉగాది పచ్చడిలో మాదిరిగా జీవితంలో అన్ని రకాల రుచులు ఉంటాయి. రాజకీయ పార్టీ అన్నప్పుడు గెలుస్తాం, ఓడిపోతాం, సంతోషాలు, బాధలు ఉంటాయి. ఓడిపోయినంతా మాత్రాన కుంగిపోయేది లేదు.. ప్రజలిచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సక్రమంగా నిర్వరిస్తాం' అని కేటీఆర్ ప్రకటించారు.
Also Read: Cantonment By Poll: కంటోన్మెంట్‌పై కేసీఆర్ సంచలన నిర్ణయం.. ఆమెకే టికెట్.. అతడికి భారీ షాక్
'చావునోట్లో తలపెట్టి చావు అంచుకు వెళ్లి తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్. పదేళ్లు ప్రజలు అవకాశం ఇస్తే తాగునీరు, విద్యుత్ సమస్యలు పరిష్కరించాం. కొత్త వైద్య కళాశాలలు, గురుకులాలు ఏర్పాటు చేశాం' అని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ 420 అబద్దాల హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కాడని విమర్శించారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి.. వంద రోజుల్లో చేస్తానన్న హామీలను 4 నెలలు గడిచిన అమలు చేస్తలేడని మండిపడ్డారు.
'రేవంత్ రెడ్డి ఐదేళ్లు అధికారంలో ఉండి ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలె. మానవ బాంబులు నీ పక్కనే ఉన్నాయి.. నల్గొండ, ఖమ్మం మానవబాంబు నీ పక్కనే ఉన్నాయి. నీ కూడా తెలుసు ఇచ్చినా హామీలను నెరవేర్చడం సాధ్యం కాదు. ఎంత సేపు కుంభకోణం అంటూ లీకులు ఇస్తూ కాలం గడుపుతున్నావు. ఫోన్ ట్యాపింగ్‌లపై పెట్టిన శ్రద్ధ.. వాటర్ ట్యాపింగ్‌లపై పెట్టు' అని కేటీఆర్ సూచించారు.
కాంగ్రెస్ అభ్యర్థులను డమ్మీ అభ్యర్థులుగా కేటీఆర్ పేర్కొన్నారు. 'కాంగ్రెస్ కచ్చితంగా డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది. బీజేపీ కోసం కాంగ్రెస్ సికింద్రాబాద్, మల్కాజ్‌గిరిలో డమ్మీ అభ్యర్థిని పెట్టింది. కరీంనగర్‌లో ఇంకా అభ్యర్థిని పెట్టాలె. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు బీఆర్ఎస్‌ను ఖతం చేయాలనే పంతంతో ఉన్నాయి' అని ఆరోపించారు. రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి పిచ్చోడిని చేస్తున్నాడు. రాహుల్ గాంధీ ఏమో మోడీని చౌకీ దార్ చోర్ అంటే మోడీ బడే భాయ్' అని రేవంత్ రెడ్డి అంటున్నాడు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొట్టమొదటిగా వ్యక్తి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ పునరుద్ఘాటించారు. మోడీ ఏం చేస్తాడోనన్న భయానికి ముందే బీజేపీలో చేరేందుకు రేవంత్ రెడ్డి ముందే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై విమర్శలు చేశారు. ఓడిపోయిన తర్వాత ఈటల మళ్లీ హుజురాబాద్‌కు పోవడం ఖాయమని జోష్యం చెప్పారు. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ఒక్క కారణం చెప్పాలని ప్రశ్నించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter