KTR Adani: గౌతమ్ అదానీతో రేవంత్ రెడ్డి దోస్తానాను రాహుల్ గాంధీ సమర్ధిస్తున్నాడా?
KT Rama Rao Questions Did Rahul Gandhi On Revanth Reddy: గౌతమ్ అదానీ అక్రమాలపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వస్తుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మద్దతు తెలుపుతున్నాడని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అదానీ, రాహుల్, రేవంత్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Gautam Adani Dispute: అదానీ బండారం మళ్లీ అంతర్జాతీయంగా బయటపడింది.. ఆఫ్రికా సహా దేశంలో ఆయన వ్యవహారంపై ప్రకంపనలు మొదలయ్యాయని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ తెలిపారు. అదానీ పై కేసు పెట్టాలని.. జేపీసీ వేయాలని ఎన్నిసార్లు కోరినా మోడీ పట్టించుకోలేదని.. అదానీ కంపెనీలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు రెండుసార్లు బయటపడిందని గుర్తుచేశారు. అదానీ ఎన్నిసార్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రయత్నించినా తాము రానివ్వలేదని గుర్తుచేశారు. అదానీ మమ్మల్ని కలిసి వ్యాపారం చేస్తామని అడిగాడని చెప్పారు.
ఇది చదవండి: Konda Surekha: కొండా సురేఖ ఇంట్లో మద్యం పార్టీ.. సంచలనంగా మారిన కుమార్తె లేఖ
గౌతమ్ అదానీ వ్యవహారంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఒకలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. 'అదానీ వస్తే మేము ఆయనకు మర్యాదపూర్వకంగా చాయ్ తాగించి పంపించేశాం. తప్ప అతడితో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు' అని స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించారు. 'రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే రేవంత్ రెడ్డి ఎర్ర తివాచీలు పరిచాడు' అని తెలిపారు.
ఇది చదవండి: Ram Charan: ముదురుతున్న రామ్ చరణ్ దర్గా వివాదం.. క్షమాపణకు అయ్యప్ప స్వాములు డిమాండ్
అదానీ విషయంలో బడే భాయ్ ఆదేశించడంతో చోటే భాయ్ అదానీకి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికాడని రేవంత్, మోదీ వ్యవహారాన్ని కేటీఆర్ వివరించారు. 'తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అదానీ సంస్థలతో రూ.12,400 కోట్లు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు డబ్బా కొట్టుకున్నారు. తెలంగాణ డిస్కమ్‌లను అదానీకి అప్పగించేందుకు పాతబస్తీ బిల్లుల వసూళ్ల డ్రామాతో ప్రైవేటీకరించేందుకు కుట్ర చేశారు' అని వివరించారు.
యాదాద్రిలోని రామన్నపేటలో సిమెంట్ పరిశ్రమ వద్దని ప్రజలు వ్యతిరేకిస్తున్నా కాంగ్రెస్ పట్టించుకోలేదని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైన బడే భాయ్ ఆదేశించడంతో కింద చోటా భాయ్ ఆచరించాడని చెప్పారు. దీంతో అదానీ గుండె ఉప్పొంగిపోయి స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం ఇచ్చాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 'రేవంత్ రెడ్డి ఇంట్లో 4 గంటల పాటు అదానీ సమావేశమయ్యారు. అదానీ వ్యాపార విస్తరణ తెలంగాణలో ఇంత జరుగుతుంటే కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలియదా?' అని కేటీఆర్ ప్రశ్నించారు. అదానీతో ఒప్పందాలకు కాంగ్రెస్ అధిష్టానం అనుమతి లేదని భావించాలా? అని నిలదీశారు. అదానీని విమర్శించే రాహుల్ గాంధీ ఈ ఒప్పందాలకు మద్దతిస్తున్నాడా? చెప్పాలి సవాల్ విసిరారు.
ఢిల్లీలో అదానీ మంచివాడు కాదు గల్లీలో మాత్రం మంచోడు అనే చందంగా కాంగ్రెస్ తీరు ఉందని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీది గల్లీలో ఒక నీతి ఢిల్లీలో ఒక నీతా? అని ప్రశ్నించారు. తెలంగాణలో అదానీతో రేవంత్ రెడ్డి దందాను రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారా? అని సూటిగా ప్రశ్నించారు. రేవంత్ అదానీతో దోస్తీ చేస్తే ఎందుకు ఊరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. ఇలాంటి వ్యవహారం సరికాదని.. వెంటనే ఈ వ్యవహారంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter