KT Rama Rao vs Revanth: అధికారంలోకి కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీల విషయంలో కొర్రీలు పెడుతూ లబ్ధిదారుల సంఖ్య తగ్గిస్తుండడంపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డుల పేరిట ఇప్పటికే చాలా పథకాల్లో కోతలు పెట్టిన రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. చీఫ్‌ మినిస్టర్‌ పేరును కటింగ్‌ మాస్టర్‌గా అభివర్ణించారు. అన్నింటికీ కటింగ్‌లేనా అంటూ ప్రశ్నించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Revanth Reddy: రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుతో పోటీపడుతున్నా


రైతుల పంట రుణమాఫీపై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అనేక కొర్రీలు పెట్టడంపై 'ఎక్స్‌' వేదికగా ఆదివారం కేటీఆర్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తన ట్వీట్‌తో రేవంత్‌ రెడ్డిని నిలదీశారు. ప్రతి పథకంలో లబ్దిదారుల సంఖ్యకు కోత పెట్టడమే లక్ష్యమా? అని ప్రశ్నించారు. సీఎం అనే పదానికి కటింగ్‌ మాస్టర్‌ అని సరికొత్త నిర్వచనమా? అని అడిగారు. 'నాడు.. పరుగుపరుగున వెళ్లి రైతులను లోన్ తెచ్చుకోమన్నారు. నేడు… రూ.2 లక్షల రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు' అని దుయ్యబట్టారు.

Also Read: Coal Mine Auction: బొగ్గు వేలంలో పాల్గొనే వారికి కేటీఆర్ హెచ్చరిక.. తస్మాత్ జాగ్రత్త


'మొదలు రూ.39 వేల కోట్లు అని ఇప్పుడు రూ.31 వేల కోట్లకు కటింగ్ పెట్టి కుదించారు' అని కేటీఆర్‌ ఆరోపణలు చేశారు. 'పాసు పుస్తకాలు లేవనే నెపంతో.. లక్షల మందికి శఠగోపం పెట్టే కుటిల ప్రయత్నం చేస్తే సహించం' అని హెచ్చరించారు. రేషన్ కార్డు సాకు చూపి లక్షల మందికి మొండిచెయ్యిచ్చే కుతంత్రం చేస్తే భరించమని స్పష్టం చేశారు. 'ఆదాయపు పన్ను.. చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇలా చాలా మందికి ప్రభుత్వ పథకాలు దూరం చేస్తున్నారని మండిపడ్డారు.


శూన్యహస్తం చూపే చీకటి పన్నాగాన్ని చూస్తూ ఊరుకోమని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 'మొన్న లక్షలాది మందిని రూ.500 సిలిండర్ పథకానికి దూరం చేశారు. నిన్న 200 యూనిట్ల పథకానికి ఆంక్షలు పెట్టి ఆగమాగం చేశారు. నేడు రూ.2 లక్షల రుణమాఫీని కూడా ఎగ్గొట్టి లక్షలాది మంది రైతులకు ఎగనామం పెడతామంటే కుదరదు' అంటూ హెచ్చరించారు. నాట్ల నాడు ఇవ్వాల్సిన రైతుబంధుకు ఇప్పటికీ దిక్కులేదని గుర్తుచేశారు. ఓట్ల పండగ ముగిసినా ఎకరానికి రూ.7,500 రైతు భరోసాకు అడ్రస్సే లేదు మండిపడ్డారు.


'కాంగ్రెస్ ప్రచారంలో “అందరికీ అన్నీ” అన్నారు. అధికారంలోకి రాగానే “కొందరికే కొన్ని” అని కోతపెడుతున్నారు' అని కేటీఆర్‌ ఎత్తిచూపారు. రుణమాఫీపై మాట తప్పినా.. మడమ తిప్పినా లక్షలాది రైతు కుటుంబాల తరపున ప్రశ్నిస్తాం, పోరాడుతామని కేటీఆర్‌ హెచ్చరించారు. రైతుల పక్షాన బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter