KT Rama Rao: రైతు రుణమాఫీపై రేవంత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన సవాల్‌ చేశారు. రేవంత్‌ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి లేదా అతడి నియోజకవర్గం కొడంగల్‌లో చర్చకు సిద్ధమా? అని ఛాలెంజ్‌ చేశారు. రేవంత్‌ వంద శాతమైందని చెబితే.. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం 70 శాతం  80 శాతం రుణమాఫీ అయ్యిందని చెబుతున్నారని గుర్తుచేశారు. రుణమాఫీపై తాను ఎక్కడైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KTR ED Case: కేటీఆర్‌కు షాక్‌ మీద షాక్‌.. ఫార్ములా ఈ కార్ రేస్‌లో ఈడీ కేసు నమోదు


 


అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మీడియా పాయింట్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై విరుచుకుపడ్డారు. 'వానాకాలం రైతు బంధు ఎగొట్టిన దివానా గాడు ఎవడు?' అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్లో చిత్త శుద్ధి లేదని.. డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశాడని విమర్శించారు. రాష్ట్రం లో 25 శాతం మాత్రమే రుణమాఫీ అయ్యిందని ప్రకటించారు. 'రేవంత్ రెడ్డి సభలో అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఓటు నోటుకు దొంగ రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెపుతున్నాడు' అని విమర్శించారు.


Also Read: Harish Rao: ఫార్ములా ఈ రేసు కేసు మొత్తం డొల్ల.. కేటీఆర్‌కు తొలి విజయం


 


'పత్తి, కంది సాగు చేసే రైతులకు  రెండో పంటకు  రైతుబంధు వేయరా. రాష్ట్రంలో సాగు చేయని భూముల వివరాలు ఇవ్వండని మేము అడిగితే ప్రభుత్వం వివరాలు ఇవ్వడం లేదు. రైతు ఆత్మహత్యల మీద అబద్ధాలు చెప్పింది. ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారం కేసీఆర్‌ పాలనలో రైతు ఆత్మహత్యలు తగ్గాయి' అని మాజీ మంత్రి కేటీఆర్‌ వివరించారు. రైతు బంధు స్టార్ట్ అయిన తరువాత రైతు ఆత్మహత్య లు తగ్గాయని స్పష్టం చేశారు. రైతు ఆత్మహత్యల శాతాన్ని తాము తగ్గించామని.. రేవంత్ రెడ్డి కి చరిత్ర తెలవదు అని మండిపడ్డారు.


'తెలంగాణ ఎప్పటికీ మిగులు రాష్ట్రమే. పదేండ్లలో లక్ష కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ, రైతుబంధు ద్వారా  ఇచ్చాం' అని మాజీ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. 'పాన్‌కార్డులు, ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు ఇవ్వమంటే ఎలా? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు వారికి ఇవ్వమని ఎందుకు చెప్పలేదు? అని నిలదీశారు. రైతు భరోసా మీద వేసిన  కమిటీలు అన్ని  కాలయాపన కోసమేనని స్పష్టం చేశారు. ప్రజలు కోరుకున్నది పేరు మార్పిడి కాదు,గుణాత్మకమైన మార్పు కోరుకున్నారని చెప్పారు.


'మాజీ సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా కాంగ్రెస్ వస్తే రైతుబంధు కట్ అవుతుంది అన్నాడు. ఇప్పుడు రైతుబంధు రావడం లేదు. ఈ విషయాన్ని రైతులు స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలని నిలదీయాలి' అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. రుణమాఫీ, రైతుబంధు ఏమైందని ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను గల్లా పట్టి అడగండి అని సూచించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి కుటుంబసభ్యులకు కేటీఆర్‌ కీలక విజ్ఞప్తి చేశారు. 'రేవంత్ రెడ్డిని ఎర్రగడ్డకు తీసుకువెళ్లి చూపించండి అని అతడి కుటుంబసభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా' అని తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter