KTR On Election Results: లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అత్యధిక స్థానాలను సొంతం చేసుకుంటుందని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. కేంద్రంలో ఎన్డీయే సర్కార్‌ ఓడిపోవడం ఖాయమని.. ప్రాంతీయ పార్టీలే హవా కొనసాగిస్తాయని ప్రకటించారు. ఇండియా, ఎన్డీయే ఏ కూటములకు కూడా స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. కూటమిలో లేని పార్టీలే కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Himanshu Rao: తొలిసారి ఓటు వేసిన మాజీ సీఎం కేసీఆర్‌ మనుమడు హిమాన్షు రావు


 


లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలోని తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో మంగళవారం కేటీఆర్‌ పర్యటించారు. పోలింగ్‌ సరళిని పార్టీ నాయకులతో చర్చించిన అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ సైనికులు అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శించారని తెలిపారు. ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించబోతున్నట్లు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో బీఆర్‌ఎస్‌ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందుతుందని చెప్పారు. 'ఈనాడైనా.. ఏనాడైనా బీఆర్‌ఎస్‌ పార్టీనే తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామరక్ష అని ప్రజలకు అర్థమైంది' అని పేర్కొన్నారు. 

Also Read: K Laxman: ఆగస్టులో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఉండదు: లక్ష్మణ్‌ జోష్యం


 


ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బీజేపీలపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. 'బీజేపీ, కాంగ్రెస్‌లు కేసీఆర్‌ను దూషించడానికి పరిమితమయ్యాయి. తెలంగాణకు ఏం చేయకపోయినా అడ్డగోలు విమర్శలు చేశాయి. వాటితో ఏం కావని ప్రజలకు అర్థమైపోయి ప్రజలు కారు గుర్తుకే ఓట్లు గుద్దారు' అని కేటీఆర్‌ వివరించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు స్థానిక సంస్థల ఎన్నికలకు పునాది కాబోతుందని ప్రకటించారు.


రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై మరోసారి కేటీఆర్‌ తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. ఐదు నెలలు టైం పాస్‌గా ప్రభుత్వాన్ని నడిపారని మండిపడ్డారు. ప్రజా సమస్యల పట్ల అవగాహన లేకుండా.. అన్ని చిల్లరమల్లర అంశాలు తీసుకుని మేడిగడ్డ, శ్వేతపత్రాలు, ఫోన్‌ ట్యాపింగ్‌ వంటి అంశాలపై ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని పేర్కొన్నారు. ఐదు నెలల్లోనే ఎక్కడా లేని ప్రజా వ్యతిరేకతను రేవంత్‌ రెడ్డి మూటగట్టుకున్నాడని తెలిపారు. ఎన్నికల తర్వాత అయినా బుద్ధి తెచ్చుకుని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు నెరవేర్చాలని రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ హితవు పలికారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter