KT Rama Rao Vs Teenmar Mallanna: అధికారంలోకి వచ్చిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. రైతులు, ఉద్యోగులు, విద్యార్థులకు చేస్తున్న మోసాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ - నల్గొండ - ఖమ్మం పట్టభద్ర ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో కేటీఆర్‌ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నల్గొండలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న పేరు ప్రస్తావించకుండా తీవ్ర విమర్శలు చేశారు. విద్యావంతుడైన రాకేశ్‌ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: New Liquor Brands: ఏపీ మద్యం బ్రాండ్లు తెలంగాణలో వస్తున్నాయా.. మంత్రి క్లారిటీ ఇదే!


'ఎన్నికల సమయంలో క్వింటాల్‌ వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్న బియ్యానికి మాత్రమే ఇస్తామంటూ మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. సన్న వడ్లకు బోనస్‌ ఇస్తామంటున్న సన్నాసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి మరచిపోయారు' అని కేటీఆర్‌ గుర్తుచేశారు.

Also Read: U Tax Scam: ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలనం.. రేవంత్‌ ప్రభుత్వంపై 'యూ ట్యాక్స్‌' బాంబు


'అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన వాళ్లకు ఓటేద్దామా? పదేళ్ల పాటు నిజాయితీగా పనిచేసిన కేసీఆర్ గారి అభ్యర్థికి ఓటు వేద్దామా?' అని పిలుపునిచ్చారు. '2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ అన్నారు. వాటి ఊసేలేదు. కానీ సిగ్గు లేకుండా 30 వేల ఉద్యోగాలు ఇచ్చినా అని రేవంత్ రెడ్డి చెబుతున్నాడు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చిన అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండానే 30 వేల ఉద్యోగాలు ఇచ్చానని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాడు' అని మండిపడ్డారు.


'మెగా డీఎస్సీ దగా డీఎస్సీ. ఎంట్రన్స్ పరీక్షకు ఫీజు పెట్టమని చెప్పి ఇప్పుడు టెట్ పరీక్ష కోసం ఐదు రెట్లు ఫీజు పెంచి రూ.2 వేలు వసూలు చేస్తున్నారు' అని గుర్తు చేశారు. గెలిచే వరకు ఒక మాట. గెలిచిన తర్వాత మరొక మాట అని తెలిపారు. ఇలాంటి మోసకారి ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేలా నిలదీయాలంటే  ప్రశ్నించే వ్యక్తులు కావాలని.. రాకేశ్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు.


ఆరు నెలల్లోనే ఈ ప్రభుత్వం రైతులు, మహిళలు, నిరుద్యోగులు, పెద్దమనుషులు ఇలా ప్రతి వర్గాన్ని మోసం చేసిందని రేవంత్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ విమర్శించారు. ఐదు నెలల్లోనే ఐదేళ్ల అపఖ్యాతి మూటగట్టుకుందని.. అరచేతిలో వైకుంఠం చూపించి అందరినీ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యావంతుడికి పట్టం కడతారా ఒక బ్లాక్ మెయిలర్, చీటర్‌కు పట్టం కడతారా? ఆలోచించండి అని కేటీఆర్‌ సూచించారు.


శాసనమండలిలో యోగ్యులు, అర్హులకు అవకాశం ఇవ్వాలి కానీ.. బ్లాక్ మెయిలర్లు, దందాలు చేస్తూ బెదిరించే వాళ్లకు అవకాశం ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి కూడా చీటర్లు, బ్లాక్ మెయిలర్లను ప్రోత్సహిస్తే రేపు మీకే ఎసరు పెడుతారని హెచ్చరించారు. సమాజానికి పట్టిన చీడపురుగు, దొంగను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిందో చెప్పాలని సవాల్‌ విసిరారు. యూట్యూబ్‌ను అడ్డంపెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ దందాలు చేసే చీటర్‌ను ఓడించాలని పరోక్షంగా తీన్మార్‌ మల్లన్నపై విమర్శలు చేశారు. శాసనమండలిలో బాకా ఊదేవాళ్లు కాదని.. ప్రభుత్వం బాజా భజయించే వాళ్లు ఉండాలని పేర్కొన్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter