KT Rama Rao: పెండ్లికి పోతావో .. సావుకు పోతావో రేవంత్ రెడ్డి నీ ఇష్టం
Where You Go Your Wish Mr Revanth Reddy Says KT Rama Rao: గౌతమ్ అదానీ వ్యవహారంలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఈ వ్యవహారంలో తనపై చేసిన విమర్శలకు మాజీ మంత్ర కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Revanth Reddy Gautam Adani: లంచం ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి స్కిల్స్ యూనివర్సిటీకి గౌతమ్ అదానీ ఇచ్చిన రూ.వంద కోట్ల విరాళాన్ని తిరస్కరించడం రాజకీయంగా సంచలనం రేపింది. ఈ సందర్భంగా గౌతమ్ అదానీతో కేసీఆర్, కేటీఆర్‌కు సత్సంబంధాలు ఉన్నాయని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తనపై చేసిన వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నువ్వు యాడికైనా పో సామి.. మా అజెండా తెలంగాణ అభివృద్ధి అని స్పష్టం చేశారు.
ఇది చదవండి: Adani Donation: రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. అదానీ రూ.వంద కోట్ల విరాళం తిరస్కరణ
న్యూఢిల్లీలో రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై కేటీఆర్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. తాను ఓం బిర్లా కుమార్తె పెళ్లి కోసం ఢిల్లీ వచ్చిన అని వివరణ ఇచ్చుకోవడంతో కేటీఆర్ స్పందిస్తూ.. 'పెండ్లికి పోతున్నవో.. పేరంటానికి పోతున్నావో.. సావుకు పోతున్నావో' అని ఎద్దేవా చేశారు. 'తెలంగాణ పౌరులుగా 28 సార్లు పోయినవ్. 28 రూపాయలు తీస్కరాలేదు అని అడగడం మా బాధ్యత' అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇది చదవండి: Harish Rao అబద్ధాల్లో రేవంత్ రెడ్డి ఓ డాక్టర్.. మహారాష్ట్ర ప్రజలు గట్టి బుద్ది చెప్పారు
'రాజ్యాంగబద్ధంగా మినహా ఈ ఏడాదిలో అదనంగా కేంద్రం నుంచి ఒక్క రూపాయి తెచ్చింది లేదు. ఈడీ దాడుల నుంచి తప్పించుకోవడానికి ఫైవ్ స్టార్ హోటల్లో చీకట్లో కాళ్లు పట్టుకున్నదెవరో? ఈడీ చేసిన దాడులు కనీసం బయటకు ప్రకటించకుండా ఎవరి కాళ్ళు పట్టుకుని తప్పించుకున్నారో?' అని కేటీఆర్ సందేహాలు లేవనెత్తారు. 'మీ బడెబాయ్.. చోటే మియాల వ్యవహారం ఎవరికి తెలుసు పిట్టలదొరా' అని పేర్కొన్నారు.
'పోరాటం మా తెలంగాణ రక్తంలో ఉంది. మేము నీలా ఎన్నడూ ఢిల్లీ గులాములం కాదు. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర నీది. కొట్లాడి తెచ్చిన తెలంగాణను తెర్లు చేయాలని ప్రయత్నించి పట్టుబడిన ఓటుకునోటు చరిత్ర నీది. కానీ మా జెండా మా ఎజెండా ఎన్నటికీ తెలంగాణ అభివృద్ధి' అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. తమ అజెండా ఎప్పుడూ తెలంగాణ అభివృద్ధి అని స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter