Road Under Bridge: కూకట్‌పల్లి - హైటెక్‌సిటీ మధ్య ఆర్యూబీ ప్రారంభించిన కేటీఆర్, ఆ వాహనదారులకు ఊరట
KTR Inaugurated Road Under Bridge : ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఎస్‌ఆర్డీపీలో భాగంగా రూ.66.59 కోట్ల వ్యయంతో కూకట్‌పల్లి - హైటెక్‌సిటీ మధ్య నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి(RUB)ని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
KTR Inaugurated Road Under Bridge : హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఎస్‌ఆర్డీపీలో భాగంగా రూ.66.59 కోట్ల వ్యయంతో కూకట్‌పల్లి - హైటెక్‌సిటీ మధ్య నిర్మించిన రోడ్డు అండర్ బ్రిడ్జి(RUB)ని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సీహెచ్ మల్లారెడ్డి ప్రారంభించారు.
ముఖ్యంగా కూకట్‌పల్లి, హైటెక్ సిటీ ప్రాంతాల మధ్య రోడ్లకు సంబంధించి పూర్తి చేస్తున్న పనులతో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అధికంగా రద్దీ ఉండే ప్రాంతంలో 400 మీటర్ల పొడవు కలిగిన రైల్వే అండర్ బ్రిడ్జీని తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. సాధారణంగా ఈ వంతెన కింద భారీ స్థాయిలో నీరు నిల్వ ఉండేది. అందులో వాహనదారుల రాకపోకలు అతికష్టం మీద జరిగేవి. ఇక్కడ ఓ వంపును నిర్మించి హరితహారం కింద మూసాపేట ప్రాంతంలో మొక్కలకు నీరందిస్తామని మంత్రి కేటీఆర్(Minister KTR) పేర్కొన్నారు. కోవిడ్-19 నేపథ్యంలో మాస్కులు ధరించి మంత్రులు, ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read: Telangana COVID-19 Cases: తెలంగాణలో కరోనా కల్లోలం, తాజాగా 1097 కోవిడ్-19 పాజిటివ్ కేసులు
నగరంలో పలు రోడ్ల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం నడుం బిగించిందన్నారు. హైదరాబాద్(Hyderabad) శివార్లలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. కైతలాపూర్‌లో డంపింగ్ యార్డు ఇబ్బంది లేకుండా చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. సమగ్ర డ్రైనేజీ వ్యవస్థకు రూ.3,500 మేట్ల ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థతో పాటు రోడ్ల సమస్య, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పారు.
Also Read: 7th Pay Commission: యూపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్, రూ.2 లక్షలకు పైగా వేతనం, DA, TA ఇతర అలవెన్సులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook