KT Rama Rao: వ్యక్తిగతంగా తనను, తమ పార్టీని దెబ్బతీయాలనే కుట్రతో కొన్ని యూట్యూబ్ ఛానళ్ల వ్యవహరిస్తున్నాయని మాజీ మంత్రి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. అసత్యాలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై అధికారికంగా గూగుల్‌కి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఇలాంటి ఛానళ్ల ప్రచారంపై జాగ్రత్త ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాంటి ఛానళ్లను ఇక ఉపేక్షించేది లేదని న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన విడుదల చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Wine Shops: మందుబాబులకు వెరీ బ్యాడ్‌ న్యూస్‌.. వైన్స్‌, బార్లు, పబ్‌లు బంద్‌


'యూట్యూబ్ ఛానళ్లు బాధ్యతగా ఉండాల్సిందిపోయి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయి. అలాంటి యూట్యూబ్ ఛానళ్లపైన కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ ఛానళ్లపై పరువు నష్టం ధావాతోపాటు, కుట్రపూరితంగా వ్యవహరిస్తుండడంతో క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాం' అని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తంబ్‌నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో శుద్ద అబద్ధాలను చూపిస్తున్నాయని మండిపడ్డారు. అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇలాంటి నేరపూరిత, చట్టవిరుద్ధ వీడియోలను, అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నాయని వివరించారు. 'ఇది వ్యక్తిగతంగా నాతోపాటు, మా పార్టీని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే జరుగుతున్నదని భావిస్నన్నా. ప్రజలను అయోమయానికి గురి చేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగా భావిస్తున్నాం' అని కేటీఆర్‌ తెలిపారు.

Also Read: KCR: నోరు విప్పిన కేసీఆర్‌.. కవిత, అరవింద్‌, హేమంత్‌ అరెస్ట్‌పై తొలి స్పందన ఇదే..


 


గతంలో తమపై అసత్య ప్రచారం, అవాస్తవాలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అసత్యాలను అదేపనిగా ప్రచారం చేసి, అడ్డమైన తంబునెల్స్‌తో వార్తల పేరిట ప్రచారానికి పాల్పడుతున్నాయని విమర్శించారు. ఆయా ఛానళ్లను నిషేధించాలని యూట్యూట్‌కి అధికారికంగా ఫిర్యాదు కూడా చేస్తామని తెలిపారు. 


ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని యూట్యూబ్‌ ఛానళ్లకు కేటీఆర్‌ హెచ్చరించారు. కుట్రపూరితంగా వ్యవహారించే యూట్యూబ్ ఛానళ్లు చట్ట ప్రకారం శిక్షకు సిద్దంగా ఉండాలని చెప్పారు. కుట్రపూరిత, అసత్య ప్రచారాలు చేసే యూట్యూబ్‌ ఛానళ్లపై జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉన్న సమయంలో, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా యూట్యూబ్‌ ఛానళ్లు కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నాయి. గతంలో చూసీచూడకుండా వ్యవహరించిన గులాబీ పార్టీ ఇప్పుడు వాటిపై యుద్ధానికి దిగింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook