KVP Ramachandra Rao Farm House: తన ఫామ్‌హౌస్‌ కూడా హైడ్రా పరిధిలోకి వస్తుందని తీవ్ర రాజకీయ దుమారం రేపడంతో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కేవీపీ రామచంద్ర రావు స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. రాజకీయంగా తనపై తీవ్ర ఆరోపణలు చేస్తుండడంతో రేవంత్‌ రెడ్డిని తప్పుబట్టారు. నేను నిబద్ధతత కలిగిన నాయకుడినని పేర్కొన్నారు. అవసరమైతే తన ఫామ్‌హౌస్‌ను సర్వే చేసి నిబంధనలు ఉల్లంఘించి ఉంటే తానే కూల్చుకుంటానని స్పష్టం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Konda Surekha: మళ్లీ కొండా సురేఖ నోటి దూల.. కేసీఆర్‌ను కేటీఆర్ హత్య చేశాడేమో


 


హైదరాబాద్‌లో గురువారం జరిగిన ఓ సభలో హైడ్రాపై రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ కేవీపీ రామచంద్రా రావు ఫామ్‌హౌస్‌ విషయమై ప్రస్తావించారు. 'కేటీఆర్‌, కేవీపీ రామచంద్ర రావు ఫామ్‌హౌస్‌లు కూల్చకూడదా?' అని రేవంత్‌ నిలదీశారు. అంతకుముందు కొన్నాళ్లుగా బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నారు. తన ఫామ్‌హౌస్‌ రాజకీయ వివాదానికి కేంద్రంగా మారడంతో శుక్రవారం కేవీపీ స్పందించి రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు.

Also Read: Revanth HYDRAA: హైడ్రా కూల్చివేతలపై రేవంత్‌ రెడ్డి అదే దూకుడు.. ఉల్టా ప్రజలపై ఎదురుదాడి


తన ఫామ్‌హౌజ్‌ విషయమై రేవంత్‌కు మూడు పేజీల భారీ లేఖ రాసిన కేవీపీ కాంగ్రెస్‌ పార్టీకి తాను చేసిన సేవలను వివరించారు. వైఎస్సార్‌ సీఎంగా ఉన్న సమయంలోనే మూసీ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టామని.. నిధుల లేమితో ఆ కార్యక్రమం కొనసాగలేదని చెబుతూ చింతించారు. రంగారెడ్డి జిల్లాలోని అజీజ్‌నగర్‌లో ఉన్న తన ఫామ్‌హౌస్‌లు, భవనాలు ఎలాంటి ఎఫ్‌టీఎల్‌.. బఫర్‌ జోన్‌ పరిధిలో లేవని స్పష్టం చేశారు. 


'అధికారులను ఫామ్‌హౌస్‌కు పంపించి చట్ట ప్రకారం ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిని మార్క్‌ చేస్తే ఆ పరిధిలో ఏదైనా కట్టడం మా ఫార్మ్‌హౌస్‌లో ఉంటే 48 గంటలలో ప్రభుత్వానికి భారం కాకుండా మా సొంత ఖర్చుతో కూల్చివేస్తాం' అని కేవీపీ రామచంద్ర రావు లేఖలో తెలిపారు. తాను 1980 నుంచి హైదరాబాద్‌లో నివాసం ఏర్పరచుకుని ఉంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుడిగా తనకు చట్టం నుంచి ఎలాంటి మినహాయింపులు వద్దని ప్రకటించారు. సాధారణ పౌరుడికి ఏ చట్టం వరతిస్తుందో తనకు అలాగే వ్యవహరించాలని కేవీపీ సూచించారు.


గతంలో కేటీఆర్‌ విమర్శలు
హైడ్రా కూల్చివేతలపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ఫామ్‌హౌస్‌లను వదిలేసి కొందరివి మాత్రమే కూల్చివేస్తున్నారని ఆరోపించారు. ఈ సమయంలోనే అజీజ్‌నగర్‌లోని కేవీపీ రామచంద్ర రావు ఫామ్‌హౌస్‌ కేటీఆర్‌ విమర్శలు చేశారు. కేవీపీ ఫామ్‌హౌస్‌ కూల్చరా? అని ప్రతిపక్షాలు విమర్శిస్తుండడంతో వాటికి సమాధానంగా కేవీపీ లేఖ రాశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter