TS POLYCET: తెలంగాణ పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు
ఈ ఏడాది తెలంగాణ పాలిసెట్ (TS PolyCet 2020)కు దరఖాస్తు చేసుకోలేని వారికి శుభవార్త. పాలిసెట్-2020 దరఖాస్తుల గడువును పొడిగించారు.
హైదరాబాద్ : ఈ ఏడాది తెలంగాణ పాలిసెట్ (Telangana PolyCet 2020)కు దరఖాస్తు చేసుకోలేని వారికి శుభవార్త. పాలిసెట్-2020 ఆన్లైన్ దరఖాస్తుల గడువును జులై 30వ తేదీ వరకు పొడిగించారు. ఈ విషయాన్ని తెలంగాణ సాంకేతిక విద్యా శిక్షణ మండలి సెక్రటరీ సి.శ్రీనాథ్ శనివారం ప్రకటించారు.
(TS PolyCet 2020 Application Form) అప్లికేషన్ ఫాం కోసం క్లిక్ చేయండి
ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ జులై 25 (శనివారం)తో రూ.200 ఆలస్య రుసుముతో పాలిసెట్ 2020 దరఖాస్తుల గడువు ముగిసింది. అయితే రూ.300 ఆలస్య రుసుంతో ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసేకునేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించారు. Telangana: త్వరలో 2 లక్షల యాంటీజెన్ కిట్లతో పరీక్షలు