Telangana Rains: తెలంగాణలో భారీ వర్ష సూచన కొనసాగుతోంది. నిన్నటి ఉత్తర-దక్షిణ ద్రోణి ఇవాళ దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరం ప్రదేశం వరకు కేంద్రీకృతమైంది. సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద స్థిరంగా కొనసాగుతోంది. నిన్న దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం నేడు మరింత బలహీన పడింది. ఈ విషయాన్ని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీటి ప్రభావంతో రాగల మూడురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇవాళ, రేపు కొన్ని చోట్ల వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి మాత్రం చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురువనున్నాయి. మూడురోజులపాటు పిడుగులు పడే అవకాశం ఉందని..ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.


నాలుగో రోజు ములుగు, దుబ్బాక, జయశంకర్‌ భూపాల్‌పల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో విస్తారంగా వానలు పడతాయని హెచ్చరించింది. ఐదు రోజు మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది.


ఆదిలాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురవనున్నాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని..వాటితోపాటు పిడుగులు సైతం పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.



Also read:Palnadu: పల్నాడు జిల్లాలో పరువు హత్య కలకలం..కొడుకును చంపిన తల్లిదండ్రులు..!


Also read:India vs West Indies: రేపే భారత్, విండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్..టీమిండియా జట్టు ఇదిగో..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook