Lawyer alleges TRS Mla followers attacked him: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన మహిళా బంధు కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అనుచరులు, టీఆర్ఎస్ కార్యకర్తలు తనపై దాడికి పాల్పడినట్లు మహేష్ అనే న్యాయవాది ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే, అతని అనుచరుల దౌర్జన్యంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 'కేసీఆర్ మహిళా బంధు' సంబరాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆదివారం ఏర్పాటు చేసిన 'మహిళా బంధు' కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు అక్కడికి వచ్చి ఎమ్మెల్యే మంచిరెడ్డికి తమ సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆ మహిళలకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న న్యాయవాది మహేష్.. తన సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించాడు.


తాను వీడియో తీయడాన్ని గమనించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులు తనను దూషించారని, మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారని మహేష్ ఆరోపిస్తున్నాడు. తన సెల్‌ఫోన్ కూడా లాక్కున్నారని.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సెల్‌ఫోన్ తిరిగిచ్చేశారని పేర్కొన్నాడు. వారి నుంచి ప్రాణ భయం ఉన్న కారణంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. 


మరోవైపు, ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగిన మహిళలు మాట్లాడుతూ.. రోడ్డు వెడల్పులో భాగంగా తమ కాలనీలోని ఇండ్లను ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే కూల్చివేశారని ఆరోపించారు. మహిళా బంధు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేను దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లగా తమను దూషించాడన్నారు. ఎమ్మెల్యేపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


Also Read: పెట్రోల్ బంక్‌లో ఘరానా మోసం... డీజిల్‌లో నీళ్లు కలిపి అమ్ముతున్న వైనం.. ఎక్కడంటే..


Also Read: IND vs SL: జడేజా సూపర్ షో.. తొలి టెస్టులో భారత్ ఘన విజయం! విరాట్ కోహ్లీకి స్పెషల్ గిఫ్ట్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook