తెలంగాణ మహిళా సమస్యలపై ఇవాంకకు లేఖ
మహిళా సాధికారత అనే అంశంపై ఒక అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తే.. అక్కడ అంతా కేటీఆర్ హవా మాత్రమే నడిచిందని వీహెచ్ అన్నారు.
తెలంగాణలో మహిళలు ఎన్నో అవమానాలకు గురవుతున్నారని.. ఆఖరికి తెలంగాణ క్యాబినెట్‌లో కూడా వారికి ప్రాతినిధ్యం కరువైందని.. ఇదే విషయాన్ని బహిర్గతం చేసి తాను అమెరికా సలహాదారు ఇవాంక ట్రంప్‌కు లేఖ రాశానని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు తెలిపారు. హైదరాబాద్ నగరానికి వచ్చి ఇవాంక ట్రంప్ చూసినవన్నీ నిజాలు కావని.. ఆమె అసలు విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది అని.. అందుకే తాను ఆమెకు లేఖ రాయడం జరిగిందని వీహెచ్ తెలిపారు.
మహిళా సాధికారత అనే అంశంపై ఒక అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తే.. అక్కడ అంతా కేటీఆర్ హవా మాత్రమే నడిచిందని వీహెచ్ అన్నారు. తెలంగాణలో ఎందరో మహిళలు వివక్షకు గురవుతున్నారని.. వారి గురించి లోకానికి బహిర్గతం చేయడం కోసమే తాను ఇవాంకకు లేఖ రాసానని వీహెచ్ తెలిపారు. కనీసం ప్రతిపక్షం నేతలను కూడా ఈ సదస్సుకి ప్రభుత్వం ఆహ్వానించలేదని ఆయన తెలిపారు.