ఏడాదిపాటు టెక్కీ లైసెన్సు సస్పెండ్ చేసిన పోలీసులు
మద్యం తాగి కారు నడిపి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఇద్దరిని ఢీకొట్టిన కేసులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లైసెన్స్‌ను ఆర్టీఏ అధికారులు ఏడాదిపాటు సస్పెండ్ చేశారని సైబరాబాద్ ట్రాఫిక్ డీసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్ తెలిపారు.
హైదరాబాద్ : మద్యం తాగి కారు నడిపి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఇద్దరిని ఢీకొట్టిన కేసులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లైసెన్స్‌ను ఆర్టీఏ అధికారులు ఏడాదిపాటు సస్పెండ్ చేశారని సైబరాబాద్ ట్రాఫిక్ డీసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్ తెలిపారు. గత ఏడాది నవంబర్10వ తేదీన తెల్లవారుజామున 1.05 గంటలకు ఇద్దరు యువకులు సెల్ఫీ తీసుకునేందుకు నిలబడినప్పుడు కారులో వేగంగా వచ్చిన పెద్దకోట్ల అభిలాష్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు కిందపడి మృతిచెందారని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు కాగ్నిజెంట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కూకట్‌పల్లికి చెందిన అభిలాష్‌ను అరెస్టు చేశారని తెలిపారు.
నిందితుడికి వైద్య పరీక్షలు చేయించగా మద్యం తాగి కారు నడిపినట్లు బయటపడిందని అన్నారు. నిందితుడి లైసెన్స్ కోసం ఆర్టీఏ అధికారులకు సిఫార్సు చేయగా కూకట్‌పల్లి ఆర్టీఏ అధికారులు ఏడాదిపాటు లైసెన్స్‌ను రద్దు చేశారని తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడం వల్లే ఇద్దరు యువకులను ఢీకొట్టాడని పోలీసుల విచారణలో తేలిందన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..