Telangana Weather Updates: తెలంగాణలో గత వారం కురిసిన అతి భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. వానలు కాస్త తెరిపినివ్వడంతో జనం హమ్మయ్యా అనుకున్నారు. కానీ ఇంతలోనే మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. బుధవారం (జూలై 20) రాత్రి నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల,పెద్దపల్లి, కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిద్ధిపేట తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాబోయే కొద్ది గంటల్లో హన్మకొండ, జనగాం, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కూడా వానలు విస్తరించే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అప్‌డేట్ ప్రకారం.. రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికైతే ఎటువంటి హెచ్చరికలు జారీ అవలేదు.


వరద నష్టం రూ.1400 కోట్లు :


తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో రూ.1400 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్రానికి తక్షణ సాయంగా రూ.1000 కోట్లు అందజేయాలని కేంద్రానికి లేఖ రాసింది. రోడ్లు భవనాల శాఖలకు రూ.498కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.449 కోట్లు, సాగునీటి శాఖకు రూ.33 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు రూ.379 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.7 కోట్లు.. మొత్తంగా రూ.1400 కోట్లు నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి నివేదికలో పేర్కొంది.


Also Read: Cyber Cheater: సైబర్ చీటర్ వంశీ కృష్ణ చేతిలో మోసపోయిన 1000 మంది మహిళలు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు


Also Read: Horoscope Today July 21st: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారిని తెలియని భయం వెంటాడుతుంది



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook