Reels Like Earn Money: మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఒక యాప్ లో వచ్చే రీల్స్‌కు లైక్‌ కొడితే చాలు మీరు లక్షల్లో డబ్బులు సంపాదించవచ్చని నమ్మించి అమాయక ప్రజలను మోసం చేసిన సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. రీల్స్‌కు లైక్‌ చేస్తే డబ్బులు కొన్నాళ్లు నమ్మకంగా పంపించి అనంతరం భారీగా డిపాజిట్‌ చేసుకుని ఆఫీస్‌ ఎత్తేసిన వైనం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది. రూ.లక్షల్లో మోసపోయిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. నయా మోసం వివరాలు ఇలా ఉన్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Water Supply: హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలెర్ట్‌.. ఈనెల 24న మంచినీటి సరఫరా బంద్‌..


 


నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ యాప్ ద్వారా రూ.వేలల్లో.. రూ.లక్షలు సంపాదించవచ్చని కొందరు నమ్మించారు. తెలిసిన వారి ద్వారా.. పరిచయస్తుల ద్వారా పెద్ద ఎత్తున ప్రజలను నమ్మించి తమ ఖాతాల్లో డబ్బులు జమ చేసుకున్నారు. 'రీల్స్‌కి లైక్ చేస్తే చాలు డబ్బులు మీ వాలెట్లో జమ అవుతాయి' అని ఆశ చూపించారు. ముందుగా కొంత డబ్బు డిపాజిట్ చేసి వచ్చిన రీల్స్‌కు లైక్‌ కొడితే రెట్టింపు డబ్బులు వస్తాయని చెప్పారు.

Also Read: Arya Vysyas: పొట్టి శ్రీరాములు పేరు మార్పుపై దుమారం.. మరో అగ్గి రాజేసిన రేవంత్‌ సర్కార్‌


'పి 1, పీ2, పీ3 కేటగిరీల చొప్పున కేటగిరి పెరిగిన కొద్దీ డబ్బులు పెరుగుతాయి' అని అమాయకులకు చెప్పారు. పీ1లో రూ.2,100 ఓ యాప్‌లో డిపాజిట్ చేస్తే రోజుకు ఐదు రీల్స్ పంపి ఒక్కో రీలుకి లైక్ కొట్టడం ద్వారా రూ.15 చొప్పున రూ.75 వాలెట్‌లో జమ అయినట్లు చూపుతారు. పీ2 కేటగిరిలో రూ.5,500 డిపాజిట్ చేస్తే రోజుకి 10 రూల్స్ పంపి రీల్‌కి రూ.20 చొప్పున రూ.200 వాలెట్లో జమ అయినట్లు నమ్మించారు. ఇక పీ3 దశలో రూ.18,300 డిపాజిట్ చేస్తే 15 టాస్కులు ఇచ్చి ఒక్కో దానికి రూ.44 చొప్పున రూ.660 రూపాయలు జమ అయినట్లు చూపి మోసం చేయడం ప్రారంభించారు.


లైక్‌ కొడితేనే లక్షల్లో డబ్బులు అని ఆశచూపడంతో కొందరు రూ.లక్షల వరకు డిపాజిట్ చేశారు. ఇలా పెద్ద ఎత్తున డబ్బులు రావడంతో నిర్వాహకుల అసలు రూపం బయటకు వచ్చింది. ఒక్కొక్కరిని నమ్మిస్తూ ఇలా ఏకంగా 400 మందిని నమ్మించారు. భారీగా డబ్బు డిపాజిట్‌ కావడంతో ఆ నిర్వాహకులు బిచాణా ఎత్తేశారు. 10 రోజుల నుంచి యాప్ పని చేయడం లేదు. దీంతో కార్యాలయానికి వెళ్లగా తాళం వేసి ఉంది. దీంతో తాము మోసపోయామని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటివరకు సుమారు 400 మంది నుంచి రూ.25 లక్షల రూపాయల వరకు వసూలు చేసి ఊడాయించినట్లు తెలుస్తోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.