KTR on Modi over Jobs and Hijab: కర్ణాటకలో హిజాబ్ వివాదంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. తెలంగాణలోనూ టీఆర్ఎస్, బీజేపీ ఈ వివాదంపై ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఇది బీజేపీ కుట్రేనని.. మతపరమైన విషయాల్లో జోక్యం తగదని టీఆర్ఎస్ వాదిస్తుండగా.. పలు ముస్లిం దేశాల్లో సైతం హిజాబ్‌పై నిషేధం ఉందని బీజేపీ శ్రేణులు వాదిస్తున్నాయి. తాజాగా హిజాబ్ వివాదాన్ని 'జాబ్స్'కి ముడిపెడుతూ ప్రధాని మోదీకి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు ప్రముఖ కార్టూనిస్ట్ రోహిత్ కబదే వేసిన సెటైరికల్ కార్టూన్‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ కార్టూన్‌లో ఓ వ్యక్తి తన చేతిలో 'జాబ్..?' అనే ప్లకార్డు పట్టుకుని ఉన్నాడు. ఇంతలో అతని వద్దకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. ప్లకార్డుపై ఉన్న 'జాబ్'ను కాస్త 'హిజాబ్'గా మార్చేస్తాడు. అంటే.. దేశంలో యువత ఉద్యోగాల గురించి అడుగుతుంటే.. బీజేపీ ప్రభుత్వం హిజాబ్ వివాదాన్ని తెర పైకి తీసుకొచ్చిందనేది దాని అర్థంగా కనిపిస్తోంది. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్‌పై కొంతమంది సానుకూలంగా స్పందిస్తుండగా.. అసలు హిజాబ్ వివాదానికి మోదీకి సంబంధమేంటని బీజేపీ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు.


కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ఎందుకు చేపట్టట్లేదని ప్రశ్నిస్తున్న తెలంగాణ సర్కార్‌ను... మరి రాష్ట్రం సంగతేంటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ సర్కార్‌ను నిలదీస్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ తన ప్రెస్ మీట్‌లో, బహిరంగ సభల్లో సైతం ఉద్యోగాల భర్తీపై కేంద్రాన్ని నిలదీసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 17 లక్షల పోస్టులను ఎందుకు భర్తీ చేయట్లేదని ఆయన ప్రశ్నించారు. దీంతో తెలంగాణ సర్కార్‌పై కూడా రాష్ట్రంలో ఖాళీల భర్తీపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీల లెక్కలు తేల్చి త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 
 



Also Read: TS Police Vacancies: పోలీస్ శాఖలో తేలిన ఖాళీల లెక్క.. త్వరలో 17వేల కొలువుల భర్తీ..?


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook