Liquor Prices Hike: పర్సు ఖాళీ అయితేనే కిక్కు.. మందుబాబులకు కేసీఆర్ సర్కార్ షాక్
Liquor Prices Hike: మందుబాబులకు కేసీఆర్ సర్కార్ మరో షాకిచ్చింది. లిక్కర్ ధరలను భారీగా పెంచేసింది. పెరిగిన ధరలను ఇవాళ్టీ నుంచే అమలులోనికి తీసుకొచ్చింది. మద్యం ధరలు 20 రూపాయల నుంచి ఏకంగా 160 రూపాయల వరకు పెరిగాయి.
Liquor Prices Hike: మందుబాబులకు కేసీఆర్ సర్కార్ మరో షాకిచ్చింది. లిక్కర్ ధరలను భారీగా పెంచేసింది. పెరిగిన ధరలను ఇవాళ్టీ నుంచే అమలులోనికి తీసుకొచ్చింది. మద్యం ధరలు 20 రూపాయల నుంచి ఏకంగా 160 రూపాయల వరకు పెరిగాయి. బీర్ల ధరలు 20 రూపాయలు పెంచింది. పెరిగిన ధరలపై ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం రాత్రి అమ్మకాలు పూర్తి కాగానే.. మద్యాన్ని సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. స్టాక్ ను లెక్కించి.. గురువారం నుంచి కొత్త ధరల ప్రకారమే సేల్స్ జరిగేలా ఎక్సైజ్ ఏర్పాట్లు చేశారు.
సాధారణ, మీడియం రకం మద్యం క్వార్టర్ బాటిల్ ధర 20 రూపాయలు పెరిగింది. ప్రీమియం లిక్కర్ క్వార్టర్ బాటిల్ రేటును 40 రూపాయలు పెంచింది ప్రభుత్వం. ఇక సాధారణ, మీడియం లిక్కర్ హాఫ్ బాటిల్ పై 40 రూపాయలు హైక్ చేశారు. ఇక ఫుల్ బాటిల్ పై ఏకంగా 80 రూపాయలు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. ప్రీమియం లిక్కర్ ఫుల్ బాటిల్ ధర ఏకంగా 160 రూపాయలు పెరిగింది. వైన్, బీర్ల ధరలు కూడా పెరిగాయి.వైన్ క్వార్టర్ బాటిల్‌పై 10 రూపాయలు, హాఫ్ బాటిల్‌పై 20 రూపాయలు, ఫుల్ బాటిల్ పై 40 రూపాయలు పెంచారు. ధరలు పెరగనుండటంతో బుధవారం రాత్రి నుంచే లిక్కర్ అమ్మకాలు ఆపేశారు. అన్ని డిపోల నుంచి మద్యం తరలింపును నిలిపేశారు. ఆన్‌లైన్ ద్వారా మద్యం ఆర్డర్ చేసే వెబ్‌సైట్ ను కూడా ఆపేశారు. కొత్త ధరలతో వెబ్‌సైట్‌ను గురువారం అమలులోనికి తెస్తామని ఎక్సైజ్ అధికారులు చెప్పారు.
మద్యం ధరల పెంపుపై మందుబాబులు భగ్గుమంటున్నారు.ఇప్పటికే నిత్యావసరాలు ధరలు పెరిగిపోవడంతో జనాలకు భారంగా మారింది. పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు అందకుండా పోయాయి. వంట గ్యాస్ ధర పెరిగిపోతూనే ఉంది. వీటికి తోడు కరెంట్ ఛార్జీలను భారీగా పెంచింది కేసీఆర్ సర్కార్. తాజాగా లిక్కర్ ధరలు పెంచడంతో మరింత భారం తప్పదు.
READ ALSO: Minister Mallareddy: మరో వివాదంలో మంత్రి మల్లారెడ్డి.. బావమరిదిపై భూ కబ్జా కేసు
READ ALSO: Auto-Cab Strike: జంట నగరాల్లో నిలిచిపోయిన ఆటో, క్యాబ్‌లు, ప్రజల ఇబ్బందులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook