Wine Shope Closed in Hyderabad: హైదరాబాద్‌లో బోనాల పండుగ సందర్భంగా రెండు రోజుల పాటు వైన్‌ షాపులు మూతపడనున్నాయి. వైన్‌ షాపులతో పాటు బార్లు, మద్యం సర్వ్‌  క్లబ్బులు తెరవకూడదని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 16 ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 17 సాయంత్రం 6 గంటల వరకు వైన్స్‌తో పాటు మద్యం సర్వ్ చేసే అన్ని రకాల వ్యాపారాలు బంద్ కానున్నాయి. జంట నగరాల్లో యేటా ఆషాడ మాసంలో జరిగే బోనాల పండుగ ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వైన్స్ బంద్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఆదేశాలను అతిక్రమించి మద్య విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బోనాల సందర్భంగా అలర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహంకాళి ఆలయం పరిసరాల్లో భక్తుల తాకిడి పెరగడంతో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. దాదాపు 5 లక్షల మంది బోనాలు సమర్పిస్తారని పోలీసులు అంచనా వేస్తున్నారు.


మల్కాజిగిరిలో నిర్వహించబోయే బోనాల ఉత్సవాల సందర్భంగా ఓల్డ్ మల్కాజిగిరి మహంకాళి అమ్మవారి ఆలయం, సఫీల్ గూడ కట్టమైసమ్మ దేవాలయాన్ని సీపీ చౌహన్ సందర్శించారు. ఈ సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పోలీసులు ఆయనకు వివరించారు. మహిళా భక్తులు, పిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. షీ టీమ్ బృందాలు కూడా మహిళా భక్తుల రక్షణ కోసం విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 


Also Read: Cyberabad Police: మరణించిన ఎస్సైకి పోస్టింగ్.. పోలీసులు వింత ఉత్తర్వులు  


Also Read: Eluru News: కన్నతల్లి కసాయి బుద్ది.. సొంత కుమార్తెలను రెండో భర్తకు అప్పగించిన మహిళ  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి