Harish Rao Arrest: బీఆర్ఎస్ నేతలను ఈడ్చుకెళ్లిన పోలీసులు.. వాహనాల్లో కుక్కించి మరి..!
Harish Rao Arrest Live Updates: మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. హైటెన్షన్ నడుమ అదుపులోకి తీసుకుని కుందుర్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్‌గా మారాయి.
Harish Rao Arrest Live Updates: ఎమ్మెల్యేలు ఆరికెపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధంతో తెలంగాణ రాజకీయాలు హైటెన్షన్‌కు చేరాయి. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలంటూ సైబరాబాద్ సీపీ ఆఫీసు వద్ద మాజీ మంత్రి హరీశ్ రావుతోపాటు బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు హరీశ్ రావును అరెస్ట్ చేసి.. బలవంతంగా స్టేషన్‌కు తలించారు. బీఆర్ఎస్ నాయకులను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి వాహనాల్లో కుక్కేశారు. ఈ క్రమంలో హరీశ్ రావు చేతికి గాయమైంది. అంతకుముందు కౌశిక్ రెడ్డిపై మీదకు వెళ్లిన ఆరెకపూడి అనుచరులు.. ఇంటిలోని గేట్లు విరగ్గొట్టేందుకు ప్రయత్నించారు. రాళ్లతో దాడి చేసి కిటికి అద్దాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. తాజాగా అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Latest Updates
Harish Rao Arrest Live Updates: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ దగ్గర నిరసన తెలియజేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేసి రంగారెడ్డి జిల్లా కేశంపేట్ పోలీస్ స్టేషన్‌కి తరలిస్తుండగా మండలంలోని లో కొత్తపేట గ్రామం వద్ద బీఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
Harish Rao Arrest Live Updates: అదుపులోకి తీసుకున్న బీఆర్ఎస్ నేతలను రంగారెడ్డి జిల్లా తలకొండ పల్లి మీదుగా కేశంపేట వైపుగా పోలీసులు తరలిస్తున్నారు.