Hyderabad Rains Live Updates: హైదరాబాద్ నగర వాసులకు బిగ్ అలర్ట్.. భారీ వర్షం.. ఎమర్జెన్సీ నంబర్లు ఇవిగో
Hyderabad Weather Live Updates: హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. నగరంతోపాటు తెలంగాణ, ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షానికి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Weather Live Updates in Telugu: నైరుతీ బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మే 24వ తేదీని నాటికి ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 23వ తేదీ వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని.. కోస్తాంధ్ర, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. ఉమ్మడి మెదక్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర వర్షం పడుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షానికి సంబంధించి లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Latest Updates
Telangana Rains Live Updates: హైదరాబాద్‌లో భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. వనస్థలిపురం చింతలకుంట వద్ద నేషనల్ హైవేపై భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో పనామా- ఎల్బీనగర్ మధ్య వాహనదారులకు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందిగా మారింది. ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు ట్రాఫిక్ స్లోగా కదులుతోంది.
Hyderabad Rains Help Line Numbers: హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం పడటంతో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్ఎఫ్) సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాంతాల్లోని నీటి నిల్వలను తొలగిస్తున్నారు. మరికొన్ని రోజులు వర్ష సూచన ఉండటంతో ప్రజల కోసం జీహెచ్‌ఎంసీ టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచింది. GHMC-DRF సహాయం 040-21111111, 9000113667 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించింది.
Telangana Rains Live Updates: వికారాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం పడుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వానలతో వరి పంట నీట మునిగింది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. సంగారెడ్డి, పోతిరెడ్డిపల్లి, కంది, సదాశివపేటలో భారీ వాన పడుతోంది.
Telangana Rains Live Updates: ఇవాళ పలుచోట్ల గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో వాన కురవనుంది. హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదగిరి గుట్ట, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, ఏరియాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు.
Hyderabad Rains Live Updates: ఉపరితల ఆవర్తనం ఫలితంగా తెలంగాణలో హైదరాబాద్ సహా పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. హైదరాబాద్‌లో మరికాసేపట్లో జడివాన కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ హెచ్చరించింది. రాబోయే 3 గంటల పాటు హైదరాబాద్ లో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ వార్నింగ్ ఇస్తోంది.
Hyderabad Rains Live Updates: నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్, చందానగర్, మియాపూర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, పటాన్ చెరు, అమీన్‌పూర్, బీహెచ్ఎల్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. బషీర్ బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది.