MUNUGODE BYELECTION LIVE UPDATES: చిల్లర దొంగ.. బ్లాక్ మెయిలర్! రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి ఫైర్
MUNUGODU BYELECTION: సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో మునుగోడుకు త్వరలో ఉపఎన్నిక రాబోతోంది. దీంతో ప్రధాన పార్టీలన్ని మునుగోడుపై ఫోకస్ చేశాయి.
MUNUGODU BYELECTION: సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో మునుగోడుకు త్వరలో ఉపఎన్నిక రాబోతోంది. దీంతో ప్రధాన పార్టీలన్ని మునుగోడుపై ఫోకస్ చేశాయి. దుబ్బాక,హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితమే మునుగోడులో రిపీట్ అవుతుందని బీజేపీ చెబుతోంది. నల్గొండలో బీజేపీకి అంత సీన్ లేదని... హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్ గల్లంతైందని... మునుగోడులోనూ అదే ఫలితం వస్తుందన్నారు. కాంగ్రెస్ కంచుకోట మునుగోడులో తమ గెలుపును ఎవరూ ఆపలేరని పీసీసీ పెద్దలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీల పోటాపోటీ వ్యూహాలతో మునుగోడు నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాజకీయాల్లో ట్విస్ట్ లు నెలకొంటున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా, మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి అప్ డేట్స్ మినిట్ టు మినిట్..
Latest Updates
తిట్టడం, బ్లాక్ మెయిల్ చేయడం తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నైజమని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పీసీసీ చీఫ్ గా ఉన్నా ఆయన భాష, ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్నారు రాజేందర్. కాంగ్రెస్, టీఆర్ఎస్ చెట్టపట్టాలు వేసుకొని తిరగడం నిజం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఉన్న జార్ఖండ్ లో హేమంత్ సోరేన్ , యూపీలో అఖిలేష్ కు, తమిళనాడులో స్టాలిన్ కి కేసీఆర్ పైసలు పంపింది వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థికి టీఆర్ఎస్ కలిసి మద్దతు ఇచ్చింది నిజం కాదా అని ఈటల రాజేందర్ నిలదీశారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను ఖతం చేయడం ఖాయం
బిల్డర్లు, కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి రేవంత్ బెదిరిస్తున్నాడు
డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు
రేవంత్ ను నమ్మితే కాంగ్రెస్ కార్యకర్తలు మోసపోతారు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రేవంత్ రెడ్డి పాత్ర లేదు
చంద్రబాబుతో కలిసి తెలంగాణను దోచుకోవాలని రేవంత్ రెడ్డి ప్లాన్
హుజురాబాద్ లో రేవంత్ రెడ్డి ఎన్ని ఓట్లు తెచ్చాడు
దుబ్బాకలో కాంగ్రెస్ ను ఎందుకు గెలిపించ లేదు
కొడంగల్ ప్రజలే రేవంత్ రెడ్డిని తరిమికొట్టారు
రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్
కాంట్రాక్టులకు అమ్ముడుపోయానని నిరూపిస్తావా?
నిరూపిస్తే రాజకీయ సన్యాయం చేస్తా..
నిరూపించకపోతే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తాడా
మునుగోడు ఉప తీర్పుతో పెను మార్పులు తప్పవు
మునుగోడుకు రేవంత్ వస్తే డిపాజిట్ కూడా రాదు
రేవంత్ రెడ్డి చిల్లర దొంగ
బ్లాక్ మెయిల్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించాడు
రేవంత్ రెడ్డి పనిచేసేది చంద్రబాబు డైరెక్షన్ లో
సీమాంధ్ర పెట్టుబడి దారులు రేవంత్ రెడ్డితో ఆడిస్తున్నారు
రేవంత్ రెడ్డి వెనక ఉన్నది సీమాంధ్ర పెత్తందార్లు
రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్
నాలుగు పార్టీలు మారినవారు నన్ను విమర్శిస్తారా
సోనియాగాంధీని రేవంత్ రెడ్డి బలి దేవత అన్నది నిజం కాదా
రేవంత్ రెడ్డికి వ్యక్తిత్వం ఉందా
తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి డ్రామాలు చేయలేదా
తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రాజీనామాను స్పీకర్ కు ఇవ్వలేదు
రాజీనామా లేఖను చంద్రబాబుకు ఇచ్చి డ్రామాలు చేశాడు
రేవంత్ రెడ్డి పీసీసీ పదవిని కొనుకొన్నాడు
రేవంత్ రెడ్డి కింద పనిచేసేందుకు ఎవరూ సిద్ధంగా లేరు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ సీరియస్ గా స్పందిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా రాజగోపాల్ రెడ్డి దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో దిష్టిబొమ్మలను దహనం చేయాలని పార్టీ శ్రేణులకు అధిష్టానం సూచించింది. దీంతో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గంలోనూ రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కేడర్ రోడ్డెక్కింది.
మునుగోడు నియోజకవర్గంపై కాంగ్రెస్ దూకుడు పెంచింది. శుక్రవారం మునుగోడులో నియోజకవర్గ విస్త్రత స్థాయి సమావేశం నిర్వహిస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ ముఖ్య నేతంలతా హాజరుకానున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు ఈ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మునుగోడు ఉపఎన్నిక కోసం స్ట్రాటజీ కమిటి, ప్రచార కమిటీని నియమించింది. పీసీసీ ప్రచార కమిటి చైర్మెన్ మధుయాష్కీ గౌడ్ కన్వీనర్ గా ఉన్న కమిటీలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, బలరాం నాయక్ , అంజన్ కుమార్ యాదవ్, సంపత్ కుమార్, అనిల్ కుమార్ ఉన్నారు.
1967లో మునుగోడు నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటివరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆరు సార్లు కాంగ్రెస్ గెలవగా.. ఐదు సార్లు సీపీఐ గెలిచింది. 2014లో గులాబీ జెండా ఎగిరింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మునుగోడు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీపీఐ నుంచి ఉజ్జిని నారాయణరావు మూడు సార్లు గెలిచారు. 2018లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు.