Munugode ByPoll Live Updates: కోమటిరెడ్డితో పాటు బీజేపీలోకి మరో సీనియర్ నేత.. కాంగ్రెస్ లో పరేషాన్
Munugode ByPoll Live Updates: మునుగోడు ఉపఎన్నికలో అధికార పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.ఒకేసారి ఆరుగురు టీఆర్ఎస్ సర్పంచ్ లు కమలం గూటికి చేరారు
Munugode ByPoll Live Updates: ఉపఎన్నిక జరగనున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో జంపింగ్ ల పర్వం జోరుగా సాగుతోంది. రాత్రికి రాత్రే స్థానిక సంస్థల ప్రతినిధులు మరో పార్టీలో జాయిన్ అవుతున్నారు. గంటగంటకో ట్విస్ట్ నెలకొంటోంది. ఎప్పుడు ఎవరూ ఏ పార్టీలోకి వెళతారో తెలియని పరిస్థితి నెలకొంది. వలసల రాజకీయంతో మునుగోడు రాజకీయాలు హీటెక్కాయి. మునుగోడు రాజకీయాలపై మినిట్ టు మినిట్ అప్ డేట్స్...
Latest Updates
మునుగోడుపై గాంధీభవన్ లో కాంగ్రెస్ కీలక సమావేశం
పార్టీ నేతలతో చర్చిస్తున్న పార్టీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్
సమావేశానికి హాజరుకాని మధు యాష్కీ, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి
మునుగోడు స్ట్రాటజీ కమిటి చైర్మెన్ గా ఉన్న మధుయాష్కీ గౌడ్
కీలకమైన సమావేశానికి ముఖ్య నేతలు రాకపోవడంపై ఠాగూర్ అసహనం
దేశంలో ఎక్కడా లేనివిధంగా మునుగోడులోనే 15శాతం మంది దివ్యాంగులున్నారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపమంతా గత పాలకులదేనని ఆరోపించారు. ఈ ప్రాంత బిడ్డలు ఫ్లోరైడ్ రక్కసితో అవిటివారిగా మారినా గత పాలకులు పట్టించుకోలేదని మండిపడ్డారు
అమిత్ షా సభకు ముందే బీజేపీలో సంచలనం
ఈనెల 18న బీజేపీలోకి కోరుట్లకు చెందిన సీనియర్ నేత
పార్టీలో చేరేది ఎవరో వెల్లడించని తరుణ్ చుగ్
బీజేపీలో ఎవరు చేరబోతున్నారన్నదానిపై ఉత్కంఠ
బహిరంగ సభలో పార్టీలో చేరికలు ఉంటాయి: తరుణ్‌చుగ్
పార్టీ కార్యాచరణను అమిత్‌షా ప్రకటిస్తారు: తరుణ్‌చుగ్
కేసీఆర్ తన సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నారు: తరుణ్చుగ్మునుగోడు నియోజకవర్గంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభ ఖరారు
ఈనెల 21న మునుగోడులో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్న అమిత్ షా
అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడుపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. గాంధీభవన్ లో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో మునుగోడు ఉపఎన్నికపై చర్చించనున్నారు. మండలాల వారీగా నియమించిన ఇంచార్జులతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
మర్రిగుడెం మండలం నుండి కాంగ్రెస్ పార్టీ వైస్ ఎంపీపీ వెంకటేష్ , లెంకెలపల్లి సర్పంచ్ పాక నాగేష్ యాదవ్ , సారంపెట్ సర్పంచ్ వెనేమల్ల నర్సింహ, MPTC శ్రీశైలంతో పాటు పలువురు నాయకులు మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
చల్మడ టీఆర్ఎస్ గ్రామ సర్పంచ్ హైదరాబాద్ లో ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరిక
చండూర్ మండలంలోని పలు గ్రామాల టీఆర్ఎస్ ,కాంగ్రెస్ సర్పంచులు బీజేపీలో చేరిక.
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సమక్షంలో చేరిక
టీఆర్ఎస్ సర్పంచులు
చొప్పరి వారి గూడెం
ధోనిపాముల
నెర్మట
తుమ్మలపల్లికాంగ్రెస్ సర్పంచులు
ఉడతల పల్లి
కోటయ్య గూడెం
శిర్ధే పల్లి
గొల్లగూడెంకాంగ్రెస్ ఎంపీటీసీలు
కస్తాల
కొండా పురంమునుగోడు మండలం
చల్మడ టీఆర్ఎస్ గ్రామ సర్పంచ్
మునుగోడు ఉపఎన్నికలో అధికార పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వారం రోజులుగా నియోజకవర్గంలోనే మకం వేసిన జగదీశ్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. గత నాలుగు రోజుల్లో ఆరుగురు సర్పంచ్ లు, ఐదుగురు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. అయితే మంత్రి జగదీశ్ రెడ్డి ఎత్తులకు చెక్ పెట్టింది బీజేపీ. ఒకేసారి 10 మంది టీఆర్ఎస్ సర్పంచ్ లు కమలం గూటికి చేరారు. చండూరు మండలానికి చెందిన అధికార పార్టీ సర్పంచ్ లు మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. మంగళవారం చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి బీజేపీలో చేరారు. తాడూరి వెంకట్ రెడ్డితో పాటు నలుగురు సీనియర్ నేతలు కారుకు దిగి కమలం పార్టీలో చేరారు.
చండూర్ మండలం దోనిపాముల సర్పంచ్ దేవేందర్, నెర్మట సర్పంచ్ నర్సింహా రెడ్డి, చోప్పవారి గూడం సర్పంచ్ భర్త వెంకన్న, తుమ్మలపల్లి సర్పంచ్ కురుపాటి రాములమ్మ కుమారుడు కురుపాటి సైదులు మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారి సమక్షంలో బిజెపిలో చేరారు.