Bonalu Live Updates: అంగరంగ వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు... బంగారు బోనమెత్తిన ఎమ్మెల్సీ కవిత

Sun, 17 Jul 2022-3:08 pm,

Bonalu Live Updates: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు నేడు, రేపు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. మహిళలు బోనమెత్తి అమ్మవారికి మొక్కులు చెల్లించనున్నారు.

Bonalu Live Updates: తెలంగాణ సంస్కృతిలో బోనానికి ప్రత్యేక స్థానం ఉంది. అమ్మ దేవతలను పూజించేందుకు బోనమెత్తే సాంప్రదాయం తెలంగాణ అంతటా ఉంది. మహంకాళి బోనాలు, ఎల్లమ్మ బోనాలు, పోచమ్మ బోనాలు.. ఇలా ఆయా అమ్మ దేవతలను బోనమెత్తి పూజిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో లష్కర్ బోనాలు జరుగుతున్నాయి. నేడు, రేపు రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా బోనాల జాతర జరుగుతుంది. పండగ నేపథ్యంలో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి మొదలైంది. బోనమెత్తే మహిళలు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల నృత్యాలతో బోనాల జాతర కన్నుల పండుగగా సాగనుంది. ఈ నేపథ్యంలో బోనాల జాతరపై ఎప్పటికప్పుడు లైవ్ అప్‌డేట్స్ మీకోసం... 

Latest Updates

  • బోనాల వేడుకల్లో హుషారుగా డ్యాన్స్ చేసిన తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్..

  • నెత్తిన బోనమెత్తి కోలాటమాడిన మహిళలు...  

  • సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ తన కుటుంబంతో కలిసి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.

  • సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్సీ కవిత బంగారు బోనం..

     

  • తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటి పేరు మారిన వైనం...

    సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర సందర్బంగా సిటీలైట్ చౌరస్తా దగ్గర ఏర్పాటు చేసిన ఆర్చిలో ముఖ్యమంత్రి ఇంటి పేరు తప్పుగా ముద్రించారు. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బదులు, శ్రీ 'కల్వకుంట్ట' చంద్రశేఖర్ రావుగా మారింది. ఆర్చికి అటువైపు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫ్లెక్సీలు, కటౌట్లు. మరో వైపు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఫ్లెక్సీలు, కటౌట్లు ఉన్నాయి.

  • సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయానికి రేవంత్ రెడ్డి 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, అనిల్ యాదవ్, హర్కర వేణుగోపాల్ తదితరులు..

    ఆర్థిక సంక్షోభం రాకుండా ప్రకృతి వైపరిత్యాలు సంభవించకుండా,  
    మత సామరస్యాన్ని కాపాడాలని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా అమ్మ వారి చల్లని దీవేనలు ఉండాలని
    తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడలని కాంగ్రెస్ పార్టీ ఉజ్జయిని అమ్మవారిని కోరుకుంటుంది.. తెలంగాణ అభివృద్ధికి హాని కలిగించే అనేక కార్యక్రమాలు పాలకులు చేపడుతున్నారు. అది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. క్రూరమైనా ఆలోచనలతో పరిపాలిస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకుల బుద్దులు మార్చాలని అమ్మ వారిని కోరుకున్నాం.. - రేవంత్ రెడ్డి

  • అమ్మవారి బోనాల పండగను కూడా బిజినెస్ ప్రమోషన్‌కు వాడేస్తున్న 'అమూల్..'

  • బంగారు బోనంతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

  • 'అమ్మా హే జగదాంబే..' జీ తెలుగు న్యూస్ 'బోనాలు' ప్రత్యేక పాట..

  • నెత్తిన బోనంతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి తరలి వెళ్తున్న మహిళలు.. 

  • కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సతీసమేతంగా మహాకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.

  • తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సతీసమేతంగా మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..

  • ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

     దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం అమ్మవారికి  బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

  • ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఇవాళ బంగారు బోనం సమర్పించనున్నారు.

  • సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండగ లైవ్‌ను ఇక్కడ వీక్షించండి..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

  • మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంది. ఈ సందర్భంగా తలసాని కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. రాజకీయాలకు అతీతంగా బోనాల పండగ వైభవంగా జరగనుందన్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link