BJP Mla Raja Singh: రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు..!

Tue, 23 Aug 2022-8:22 pm,

BJP Mla Raja Singh: తెలంగాణ బీజేపీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమవడంతో బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది.

BJP Mla Raja Singh: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై వేటు పడింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. దీంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. వచ్చే నెల 2లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు వివాదస్పద కేసులో రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై తెలంగాణవ్యాప్తంగా 6 చోట్ల కేసులు నమోదు అయ్యాయి.

Latest Updates

  • ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు
    బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
    బెయిల్ ఇవ్వొద్దని వాదించిన పీపీ
    రాజాసింగ్ ప్రజాప్రతినిధి అంటూ వాదించిన ఆయన తరపు న్యాయవాది
    41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇవ్వలేదని కోర్టుకు తెలిపిన రాజాసింగ్ లాయర్
    బెయిల్ ఇస్తే ఉద్రిక్తతలు పెరుగుతాయని పోలీసుల వాదన
    ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం రాజాసింగ్‌కు బెయిల్

  • ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు
    బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
    వెంటనే విడుదల చేయాలని ఆదేశం

  • తెలంగాణ 8 ఏళ్లు ప్రశాంతంగా ఉంది: అసదుద్దీన్ ఓవైసీ
    ముస్లింలను బీజేపీ ద్వేషిస్తోంది
    తెలంగాణలో శాంతి లేకుండా చేయాలని బీజేపీ చూస్తోంది
    హైదరాబాద్‌లో అల్లర్లకు బీజేపీ కుట్ర

     

  • ఎమ్మెల్యే రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్
    రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ కేసులు
    రాజాసింగ్ బెయిల్ పిటిషన్‌ తిరస్కరణ
    చాంద్రాయణగుట్ట, మలక్‌పేట్ ప్రాంతాల్లో పోలీసుల అలర్ట్
    నాంపల్లి కోర్టు వద్ద ఎంఐఎం, రాజాసింగ్ అనుచరులు
    వారిని చెదరగొట్టిన పోలీసులు, లాఠీఛార్జ్

  • ఎమ్మెల్యే రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్
    రిమాండ్ విధించిన 14వ అదనపు మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్
    చంచల్‌గూడ జైలుకు రాజాసింగ్ తరలింపు
    చంచల్ గూడ జైలు దగ్గర భారీ బందోబస్తు

  • MLA Raja Singh Remanded: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కి నాంపల్లి క్రిమినల్ కోర్ట్ 14 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు రాజా సింగ్‌ని చంచల్‌గూడ జైలుకి తరలించారు.

  • నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం
    కోర్టు వద్ద ఎంఐఎం, రాజాసింగ్ అనుచరులు
    కోర్టు ఆవరణలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నం
    పోలీసుల లాఠీఛార్జ్
    ఇరువర్గాలకు చెదరగొట్టిన పోలీసులు

     

  • నాంపల్లి కోర్టు దగ్గర ఉద్రిక్తత
    కోర్టు ఆవరణలోకి చొచ్చుకెళ్లేందుకు రాజాసింగ్ అనుచరుల యత్నం
    అడ్డుకున్న పోలీసులు
    ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు

     

  • రాజాసింగ్‌ను నాంపల్లి కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
    రెచ్చగొట్టే వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
    రాజాసింగ్‌పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు
    హైదరాబాద్‌లో 4 చోట్ల కేసులు నమోదు

  • మంగళ్‌హాట్ పీఎస్‌లో నమోదైన కేసులో రాజాసింగ్ అరెస్ట్
    153ఏ, 295ఏ, 505(2), 506 సెక్షన్ల కింద కేసులు
    తెలంగాణలో 6 చోట్ల రాజాసింగ్‌పై కేసులు
    హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్, బహదూర్‌పురా, డబీర్‌పురా, బాలానగర్, పీఎస్‌ల్లో కేసులు
    సంగారెడ్డి, నిజామాబాద్‌లోనూ కేసులు

  • నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత
    కాసేపట్లో నాంపల్లి కోర్టుకు రాజాసింగ్
    కోర్టు వద్ద భారీగా పోలీసుల మోహరింపు
    నాంపల్లి కోర్టుకు రావాలంటూ కార్యకర్తలకు రాజాసింగ్ సందేశం

  • బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
    బొల్లారం పీఎస్‌ నుంచి నాంపల్లి కోర్టుకు తరలింపు
    నాంపల్లి కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు

     

  • తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై వేటు
    బీజేపీ నుంచి సస్పెన్షన్
    వెల్లడించిన బీజేపీ అధిష్టానం
    వచ్చే నెల 2లోపు వివరణ ఇవ్వాలని ఆదేశం
    ఇటీవల రాజాసింగ్ వీడియోపై రచ్చ
    తొలగించిన పోలీసులు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link