Kavitha Arrest Updates: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌లో బిగ్ ట్విస్ట్.. కేటీఆర్‌పై కూడా కేసు నమోదు
Kavitha Arrest In Delhi Liquor Scam: తెలంగాణలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. లోక్‌సభ ఎన్నికల ముందు ఆమె అరెస్ట్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కవిత అరెస్ట్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
MLC Kavitha Arrest Live Update: లోక్‌సభ ఎన్నికల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. మద్యం కుంభకోణం కేసు అనూహ్య మలుపు తిరిగింది. కవిత అరెస్ట్‌తో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలోనే కవిత అరెస్ట్ జరగడం గమనార్హం. సుప్రీంకోర్టులో మద్యం కుంభకోణం కేసు విచారణ ఈనెల 19వ తేదీకి వాయిదా వేసిన అనంతరం ఈడీ అధికారులు హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల మధ్యలో కవిత నివాసానికి చేరుకున్నారు. ఈడీతోపాటు ఐటీ అధికారులు కూడా రావడం గమనార్హం. దాదాపు ఐదు గంటలపాటు సుదీర్ఘ విచారణ జరిపిన ఈడీ సాయంత్రం కవితకు సెర్చ్ వారెంట్‌తోపాటు అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చారు. విచారణ సందర్భంగా మొబైల్ ఫోన్స్, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కవిత అరెస్ట్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Latest Updates
Kavitha Arrest Live Updates: కవిత అరెస్ట్‌లో బిగ్ ట్విస్ట్.. కేటీఆర్‌పై కేసు నమోదు
- కవిత అరెస్ట్ నేపథ్యంలో ఆమె సోదరుడు, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కూడా కేసు నమోదైంది.
- విచారణ సమయంలో అధికారులతో వాగ్వాదం చేసిన కారణంగా కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదుచేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.
- హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.
Kavitha Arrest Live Updates: కవిత అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన బీఆర్‌ఎస్ పార్టీ. అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. 'ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం బిజెపి, కాంగ్రెస్ కలిపి కుట్ర పన్నాయి. రేపు నోటిఫికేషన్ అనగా ఈరోజు అరెస్ట్ చేయడం కుట్ర' అని తెలిపారు.
- సుప్రీంకోర్టులో ఈ అంశం ఉంది. దౌర్జన్యంగా అరెస్టు చేయడం జరిగింది. మా పార్టీ నాయకుల మీద కూడా కుట్ర జరిగింది.
- కవిత అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు చర్య ఇది.
- ప్రజాస్వామిక చర్యలకు విరుద్ధంగా.. కవిత అరెస్ట్ నిరసనగా రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపు.
Kavitha Arrest Live Updates: తన కుమార్తె కవిత అరెస్ట్ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. తదుపరి ఎలా ఎదుర్కోవాలని న్యాయ నిపుణులతో కేసీఆర్ సంప్రదింపులు చేస్తున్నారని సమాచారం. తన కుమార్తెను ఎలా కాపాడుకోవాలో అనే అంశంపై న్యాయ పోరాటానికి కేసీఆర్ సిద్ధం కానున్నారు.
Kavitha Arrest Live Updates: ఇంట్లోంచి బయటకు వచ్చిన కవిత. ఇంట్లో నుంచి బయటకు వస్తున్న సందర్భంగా పిడికిలి బిగించి అభివాదం చేశారు.
Kavitha Arrest Live Updates: ఎట్టకేలకు కవితను ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చిన ఈడీ బృందం. ఢిల్లీకి తరలిస్తున్నారని సమాచారం.
Kavitha Arrest Live Updates: కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించాలని భావిస్తున్న ఈడీ బృందం. సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్న సమయంలో ఎలా అరెస్ట్ చేస్తారని కవిత సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీ తరలించాలంటే ముందు స్థానిక కోర్టులో కవితను ప్రవేశపెట్టాలనే నిబంధనను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఈడీ బృందంతో కేటీఆర్ తీవ్రంగా వాగ్వాదం చేశారు.
Kavitha Arrest Live Updates: కవిత అరెస్ట్ మద్యం కుంభకోణం కేసును ఊహించని మలుపు తిప్పింది. కాగా ఇదే కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా అరెస్ట్ చేసేందుకు ఈడీ సిద్ధమైంది.
Kavitha Arrest Live Updates: కవిత నివాసంలో విచారణ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం. కేటీఆర్ ఇంట్లోకి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన అధికారులు
Kavitha Arrest Live Updates: ఈడీ అరెస్ట్ నేపథ్యంలో కవిత నివాసానికి ఆమె సోదరుడు, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు వచ్చారు.