KomatiReddy Rajgopal Reddy Live Updates:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం.. ఉపఎన్నిక ఎప్పుడంటే?

Mon, 08 Aug 2022-12:08 pm,

KomatiReddy Rajagopal Reddy: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాను చెప్పినట్లుగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారు.

KomatiReddy Rajgopal Reddy: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాను చెప్పినట్లుగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి రాజీనామా లేఖను సమర్పించారు.వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా సమర్పించిన కొన్ని నిమిషాల్లోనే ఆమోదించారు స్పీకర్ పోచారం. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఆయన ఇప్పటికే రాజీనామా చేశారు. ఈనెల 21న కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 

Latest Updates

  • నవంబర్ లో మునుగోడు ఉప ఎన్నిక జరిగే అవకాశం

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    నవంబర్ లో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు

    గుజరాత్ తో పాటు మునుగోడు ఉప ఎన్నిక?

     

  • అసెంబ్లీ స్పీకర్ కు రాజీనామా లేఖ సమర్పించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING



     

     

  • ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం

    నిమిషాల్లోనే ఆమోదించిన అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

  • స్పీకర్ నా రాజీనామా ఆమోదిస్తారు అనుకుంటున్నా- రాజగోపాల్ రెడ్డి

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ఉద్యోగ కల్పన,  ప్రజలకు వైద్యం, పేదలకు ఇండ్ల కోసం, పెన్షన్ ల కోసం నా రాజీనామా

    నేను రాజీనామా అనగానే గట్టుప్పల్ మండలం వచ్చింది

    కేసిఆర్ కుటుంబం అరాచక పాలన సాగిస్తుంది

    నేను రాజీనామ చేస్తున్న అంటే కేసిఆర్ దిగి వస్తున్నారు

    నా రాజీనామాతో మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇస్తారు

    తెలంగాణకు కేసిఆర్ నుంచి విముక్తి కల్పిస్తారు

    నన్ను గెలిపించి మునుగోడు ప్రజలు పాపం  చేశారా

    అభివృద్ది కోసం కేసిఆర్ ను కలవాలని చూస్తే అపాయింట్ మెంట్ ఇవ్వలేదు

    ఉప ఎన్నిక పై ప్రజలు మాట్లాడుకుంటున్నారు

    నా పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు

    సీఎంకు సిరిసిల్ల సిద్దిపేట, గజ్వేల్ తప్ప ఇతర ప్రాంతాలు కనిపించడం లేదు..

    మిషన్ భగీరథలో 25వేల కోట్లు దోచుకున్నది నిజం కాదా

    జీతాలు ఇవ్వాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

    టీఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారింది

  • అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి రాజీనామా లేఖ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

  • స్పీకర్ కు రాజీనామా లేఖ సమర్పించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    స్పీకర్ ఫార్మాట్ లో మునుగోడు ఎమ్మెల్యే  పదవికి రాజీనామా లేఖ

    రాజీనామాను ఆమోదింప చేసుకుంటానన్న రాజగోపాల్ రెడ్డి

    కేసీఆర్ సర్కార్ పై  యుద్ధం మొదలైందన్న రాజగోపాల్ రెడ్డి

  • అసెంబ్లీకి చేరుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    స్పీకర్ ఫార్మాట్ లో మునుగోడు ఎమ్మెల్యే  పదవికి రాజీనామా లేఖ

     

  • యుద్ధం నా కోసం కాదు ప్రజల కోసం- రాజగోపాల్ రెడ్డి

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    కేసీఆర్ చుట్టూ తెలంగాణ ద్రోహులే ఉన్నారు- రాజగోపాల్ రెడ్డి

    కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నా పోరాటం- రాజగోపాల్ రెడ్డి

    ఉప ఎన్నికలో మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇస్తారు- రాజగోపాల్ రెడ్డి

     

  • గన్ పార్కులో అమరవీరులకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాళి

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    మునుగోడు నియోజకవర్గ అభివృద్ది కోసమే రాజీనామా- రాజగోపాల్ రెడ్డి

    ఎర్రబెల్లి, పువ్వాడ, గంగుల ఉద్యమకారులా- రాజగోపాల్ రెడ్డి

    ఉద్యమకారులపై తలసాని కేసులు పెట్టించలేదా- రాజగోపాల్ రెడ్డి

  • కోమటిరెడ్డి రాజీనామాపై స్పీకర్ పోచారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. అధికార పార్టీ సిగ్నల్స్ ప్రకారం ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. మునుగోడు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ వివిధ సంస్థలతో సర్వేలు చేయిస్తున్నారు. ఇప్పటికే కొన్ని రిపోర్టులు ఆయనకు చేరాయి. సర్వే టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటే కోమటిరెడ్డి రాజీనామాకు  స్పీకర్ నుంచి వెంటనే ఆమోదం రావొచ్చని భావిస్తున్నారు. సర్వేలో వ్యతిరేక ఫలితం వస్తే మాత్రం రాజీనామాను స్పీకర్ పెండింగ్ లో పెట్టవచ్చని తెలుస్తోంది. దీంతో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది సస్పెన్స్ గా మారింది.

  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం పొందితే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఏదైనా ఒక పార్లమెంట్  లేదా అసెంబ్లీ స్థానం ఖాళీ అయితే.. ఆ సీటుకు ఆరు నెలల లోపు ఉప ఎన్నిక జరపాల్సి ఉంటుంది. ఈ లెక్కన కోమటిరెడ్డి రాజీనామాతో ఫిబ్రవరి వరకు ఉప ఎన్నికకు గడువు ఉంది. అయితే నవంబర్, డిసెంబర్ లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మునుగోడు ఉప ఎన్నిక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జరగవచ్చని అంచనా వేస్తున్నారు.

  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమర్పించిన రాజీనామాను ఎప్పుడు ఆమోదిస్తారన్నది స్పీకర్ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. గతంలో ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలను స్పీకర్లు నెలల కొద్ది పెండింగ్ లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. గత ఏడాది ఈటల రాజేందర్ చేసిన రాజీనామాను కొన్ని గంటల్లోనే ఆమోదించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.

     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link