Ramoji Rao: ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం.. రామోజీరావు అస్తమయంపై ప్రముఖల సంతాపం

Sat, 08 Jun 2024-8:37 am,

Ramoji Rao Death News Live Updates: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల రాజకీయ, సినీ, ఇతర ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

Ramoji Rao Death News Live Updates: రామోజీ గ్రూపు సంస్థల అధినేత, ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు (87) కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతుండగా.. ఈ నెల 5న శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. దీంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. వెంటిలెటర్‌పై చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్ సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం తరలించారు. మార్గదర్శి, ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్న రామోజీరావు.. తెలుగు మీడియా గమనాన్ని మార్చేసిన దార్శనికుడిగా పేరు గడించారు. రామోజీ ఫిల్మ్‌ సిటీ ఏర్పాటుతో హైదరాబాద్, ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధిలో ఆయన భాగమయ్యారు.  
 

Latest Updates

  • Ramoji Rao Passed Away: ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీ రావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యస్థాపకుడిగా వారందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
     

  • Ramoji Rao Death News Live Updates: రామోజీరావు అస్తమయంపై ప్రధాని మోదీ ట్వీట్

     

  • Ramoji Rao Death News Live Updates: "రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి స్వయంకృషితో కష్టపడి అంచలంచెలుగా ఎదిగిన వ్యక్తి రామోజీరావు. ఈనాడు దినపత్రిక స్థాపించి తెలుగు పత్రికా ప్రపంచంలో నవ శకానికి నాంది పలికారు. ఈనాడు మీడియా సంస్థ ద్వారా నిజాలను నిర్భయంగా ప్రసారం చేసి సమాజాన్ని చైతన్యం చేశారు. ఈనాడు ముందడుగు ద్వారా సామాన్యులకు చేరువగా సమాచార హక్కు చట్టం, సుజలాం, సుఫలాం అంటూ పరిశుభ్రత కోసం ఊరూవాడా చైతన్యం వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టారు.ఆయన మృతి  మీడియా రంగానికి, తెలుగుజాతికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను." ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
     

  • Ramoji Rao Death News Live Updates: "ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత  చెరుకూరి రామోజీరావు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుంది. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు గారు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను." అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

     

  • Ramoji Rao Death News Live Updates: రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీ రావు తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం రాష్ట్రానికే కాదు.. దేశానికి తీరని లోటు అని అన్నారు. రామోజీ రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
     

  • Ramoji Rao Death News Live Updates: అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓ మీడియా దిగ్గజానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగటం దేశంలో ఇదే ప్రథమం.

  • Ramoji Rao Death News Live Updates: సైకిల్‌పై పచ్చళ్లు విక్రయించిన రామోజీ.. వేలకోట్లకు అధిపతి ఎలా అయ్యాడో తెలుసా..? రామోజీరావు పూర్తి బయోగ్రఫీ తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
     

  • Ramoji Rao Death News Live Updates: ఈనాడు అధినేత రామోజీ రావు మరణంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు  దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

  • Ramoji Rao Death News Live Updates: 'ఎవ్వరికీ తలవంచని  మేరు పర్వతం.. దివి కేగింది' అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

     

  • Ramoji Rao Death News Live Updates: కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతు కుటుంబంలో జన్మించారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link