Telangana Election 2023 Result Live: జీ న్యూస్ ఎక్స్‌క్లూజివ్.. సీఎంగా రేవంత్ రెడ్డి
Telangana Election 2023 Result Live Counting Update in Telugu: గత నెల రోజులుగా నువ్వా-నేనా అన్నట్లు తలపడిన అభ్యర్థుల భవితవ్యం ఆదివారంతో తేలిపోనుంది. రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల ఫలితాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Telangana Election Result 2023 Counting Live: నేటితో ఉత్కంఠకు తెరపడనుంది. తెలంగాణలో అధికారం చేపట్టబోయేది ఎవరో ఇవాళ్టితో తేలిపోనుంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 49 కౌంటింగ్ కేంద్రాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,290 అభ్యర్థులు పోటీలో నిలిచారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా..? కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు ఏమైనా అద్భుతాలు చేశాయా..? బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది..? ఎంఐఎం తన పట్టు నిలుపుకుంటుందా..? అనేది మరికాసేపట్లో తేలనుంది. 71.34 శాతం మంది ఈసారి ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరి వీరు ఎవరికి పట్టం కట్టారు..? ఎవరిని గెలిపించారు..? ఎన్నికల కౌంటింగ్ లైప్ అప్‌డేట్స్ ఇక్కడ ఫాలో అవ్వండి.
Latest Updates
Telangana Elections Counting Live Updates: గవర్నర్ తమిళసైతో కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. అనంతరం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. సీఎల్పీ భేటీ రేపు ఉదయం 9.30 గంటలకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Telangana Elections Counting Live Updates: రేపు హోటల్ ఎల్లాలో సీఎల్పీ మీటింగ్
==> సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి ఎంపిక లాంఛనమే..
==> సాయంత్రం రాజ్ భవన్‌లో ప్రమాణస్వీకారం..
==> రేవంత్ ప్రమాణ స్వీకరానికి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు హాజరయ్యే అవకాశం..
==> ముఖ్యమంత్రి పదవి కోసం గ్రూపులు కట్టకుండా అధిష్టానం వ్యూహం
==> వీలైనంత త్వరగా రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ప్రకటించి.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించాలనే యోచన.
==> కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రూపులు కట్టకుండా ఇవాళ రాత్రి హోటల్లోనే బస ఏర్పాటు
==> రేపు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్.. సీఎల్పీ నేత ఎంపిక
Telangana Elections Counting Live Updates: పటాన్ చెరు నియోజకవర్గం నుంచి 7091 ఓట్ల మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధించారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి. పటాన్ చెరు అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దేవుజా చేతుల మీదుగా గెలుపు పత్రాన్ని అందుకున్నారు. తన గెలుపులో వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకొని వెళ్తామని చెప్పారు.
Telangana Elections Counting Live Updates: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. జీ న్యూస్ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ మీ కోసం..
Telangana Elections Counting Live Updates: రాజ్‌భవన్‌కు కాంగ్రెస్ నేతల బృందం బయలుదేరింది. గవర్నర్ తమిళసైతో కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు. డీకే శివకుమార్, థాక్రే, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లారు.
Telangana Elections Counting Live Updates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అయింది. అయితే సీఎం ఎవరనేది ఉత్కంఠగా మారింది. మరికాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో సీఎల్పీ సమావేశం జరగనుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు హోటల్‌కు ఒక్కక్కరిగా చేరుకున్నారు.
Telangana Elections Counting Live Updates: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌లో విజయం సాధించిన బీజేపీకి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు.
Telangana Elections Counting Live Updates: సీఎం అభ్యర్థి ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ అన్నారు. అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు.
Telangana Elections Counting Live Updates: తెలంగాణ కొత్త డీజీపీగా రవి గుప్తా నియమితులయ్యారు. డీజీపీ అంజనీ కుమార్‌పై ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన డీజీపీగా రవి గుప్తాను నియమించింది ఈసీ.
Telangana Elections Counting Live Updates: కరీంనగర్‌లో ముగిసిన కౌంటింగ్
==> రెండు ఈవీఎంల వీవీ ప్యాట్‌లను లెక్కించిన అధికారులు
==> బండి సంజయ్‌పై 3169 ఓట్లతో గెలిచిన గంగుల కమలాకర్Telangana Elections Counting Live Updates: తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 64 సీట్లలో విజయం సాధించింది. బీఆర్ఎస్ 39 సీట్లకే పరిమితమైంది. బీజేపీ 8 గెలుచుకోగా.. ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానంలో విజయం సాధించాయి.
Telangana Elections Counting Live Updates: తెలంగాణ నుంచి ఎమ్మెల్యే ఎన్నికైన అత్యంత పిన్న వయస్కురాలుగా యశస్విని రెడ్డి (26)గా రికార్డ్ సృష్టించారు. పాలకుర్తి అసెంబ్లీ స్థానం నుంచి ఆమె మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై అనూహ్య రీతిలో విజయం సాధించారు.
Telangana Elections Counting Live Updates: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై గువ్వల బాలరాజు స్పందించారు. "తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు 2009లో ఎంపీగా పోటీ చేసినప్పుడు నాకు రాజకీయంగా ఎదగడానికి పునాదులు వేసి అప్పుడు ఓడిపోయినా.. కానీ ఆ తర్వాత 2014, 2018 ఎన్నికలలో రెండుసార్లు గెలిపించి నన్ను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన అచ్చంపేట ప్రజానీకానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
తీర్పు ఏ రకంగా నైనా ఉండని దానిని ప్రజాస్వామ్య బద్దంగా స్వీకరిద్దాం. ప్రజా తీర్పే శిరోధార్యంగా, ప్రజలు ఇచ్చేటువంటి తీర్పే కొలమానంగా తీసుకుని ప్రజల ముందుకు వెళ్దాం. ఈ రోజు వెలువడిన ఫలితాలలో మనం కుంగిపోవలసిన అవసరం లేదు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రజల మధ్యల ఉందాం.. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో కొత్తగా ఏర్పాటు అయ్యే ప్రభుత్వం ఒకవేళ మంచి చేసే సహాకరిద్దాం.. ప్రజలకు విరుద్ధంగా మనోభావాలకు హాని చేస్తే గత పోరాట అనుభవాలను కూడా పరిగణలోనికి తీసుకొని నూతన ఉత్సాహంతో ప్రజలలోకి పోరాటలతో ముందుకు వెళ్దాం..
అలాగే ఈరోజు గెలుపొందిన కాంగ్రెస్ పార్టీకి కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నందున వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే వారి పాలన ప్రజాస్వామ్య యుతంగా కొనసాగాలని ప్రజలందరికీ మేలు చేకూరాలని కోరుకుంటున్నాను." అని ఆయన చెప్పుకొచ్చారు.Telangana Elections Counting Live Updates: వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు రేపటి నుంచే పూర్తిస్థాయిలో సిద్దమై ముందుకు వెళతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆ దిశగా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు. ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించి బీజేపీ అభ్యర్థిని గెలిపించిన కామారెడ్డి ప్రజలకు అభినందనలు తెలిపారు. రెండు మూడేళ్లుగా ప్రజలకు సేవలందిస్తూ.. రాజకీయ పోరాటం చేసి బీజేపీ జెండా పాతినందుకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. జనసేనతో పొత్తుపై స్పందిస్తూ.. నష్టమైతే లేదన్నారు.
Telangana Election 2023 Result Live: నిర్మల్ నియోజకవర్గం
బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర రెడ్డి 50,703 ఓట్ల మెజారిటీతో విజయం
బీజేపీ : 1,06,400
కాంగ్రెస్ : 28,642
బీఆర్ఎస్ : 55,697ముధోల్ నియోజకవర్గం: బీజేపీ అభ్యర్థి రామారావు పవార్ 23,419 ఓట్ల మెజారిటీతో విజయం
బీజేపీ: 96,799
కాంగ్రెస్ : 15,394
బీఆర్ఎస్ : 73,380
ఖానాపూర్ నియోజకవర్గం: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెడ్మా బొజ్జు పటేల్ 4,702 ఓట్ల మెజారిటీతో విజయంబీజేపీ : 52,398
కాంగ్రెస్ : 58,870
బీఆర్ఎస్ : 54,168Telangana Elections Counting Live Updates: ఆదిలాబాద్ నియోజకవర్గం
బీజేపీ అభ్యర్థి పాయల శంకర్ 6,692 ఓట్ల మెజారిటీతో విజయం
బీజేపీ: 67,608
కాంగ్రెస్: 47,724
బీఆర్ఎస్: 60,916బోథ్ నియోజకవర్గం: బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ 22,800 ఓట్ల మెజారిటీతో విజయం
బీజేపీ : 53,992
కాంగ్రెస్ : 32,797
బీఆర్ఎస్ : 76,792Telangana Elections Counting Live Updates: జగిత్యాల నియోజకవర్గం
బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ 15,822 ఓట్ల మెజారిటీతో గెలుపు
కాంగ్రెస్ : 54421
బీజేపీ : 42138
బీఆర్ఎస్ : 70243
లీడ్ బీఆర్ఎస్ : 15822Telangana Elections Counting Live Updates: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఫలితాలు ఇలా..
నిజామాబాద్ అర్బన్-ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా (బీజేపీ)-14,620 మెజారిటీ
నిజామాబాద్ రూరల్-భూపతి రెడ్డి (కాంగ్రెస్)-21,621 మెజారిటీ
బోధన్-పి.సుదర్శన్ రెడ్డి (కాంగ్రెస్)-3082 మెజారిటీ
ఆర్మూర్-పైడి రాకేష్ రెడ్డి (బీజేపీ)-29,302 మెజారిటీ.
బాల్కొండ-వేముల ప్రశాంత్ రెడ్డి (బీఆర్ఎస్)-4,533 మెజారిటీ.
కామారెడ్డి-కాటి పల్లి వెంకట రమణా రెడ్డి (బీజేపీ)-6789 మెజారిటీ.
ఎల్లారెడ్డి-మదన్ మోహన్ రావు (కాంగ్రెస్)-23,451 మెజారిటీ.
జుక్కల్-తోట లక్ష్మి కాంత్ రావు (కాంగ్రెస్)-1152 మెజారిటీ.
బాన్స్ వాడ- పోచారం శ్రీనివాస్ రెడ్డి (బీఆర్ఎస్)-23,582 మెజారిటీ.Telangana Elections Counting Live Updates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనను ఓటర్లు దారుణంగా తిరస్కరించారు. 8 చోట్ల పోటీ చేసిన జనసేన అభ్యర్థులు ఒక్క చోట కూడా డిపాజిట్ దక్కించులేకపోయారు. ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట, కూకట్‌పల్లి, తాండూరు, కోదాడ, నాగర్కర్నూలులో జనసేన పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ ప్రచారసభలకు జనం భారీగా హాజరైనా.. ఓట్లు మాత్రం వేయలేదు.
Telangana Elections Counting Live Updates: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం
25వ రౌండ్ ఓట్ల లెక్కింపు
1) గొరిగే మల్లేష్ (బీఎస్పీ) 54
2) నోముల దయానంద్ గౌడ్ (బీజేపీ) 273
3) పగడాల యాదయ్య (సీపీఎం) 71
4) మల్ రెడ్డి రంగారెడ్డి (కాంగ్రెస్) 1927
5) మంచిరెడ్డి కిషన్ రెడ్డి (బీఆర్ఎస్) 630
26వ రౌండ్ కాంగ్రెస్ 1297 ఆధిక్యం
బీఎస్పీ మొత్తం ఓట్లు : 2,556
బీజేపీ మొత్తం ఓట్లు : 15,064
సీపీఎం మొత్తం ఓట్లు : 8,710
కాంగ్రెస్ మొత్తం ఓట్లు : 1,24,447
బీఆర్ఎస్ మొత్తం ఓట్లు : 84320
Telangana Elections Counting Live Updates: నల్లగొండ జిల్లా ఫలితాలు ఇలా..
1.నాగార్జునసాగర్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జైవీర్ రెడ్డి-55,849 ఓట్లతో గెలుపు.
2.మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థి.. బత్తుల లక్ష్మారెడ్డి-BLR: 48,782 ఓట్లతో గెలుపు.
3.నల్లగొండ: కోమటిరెడ్డి వెంకటరెడ్డి-54,332 ఓట్లతో గెలుపు.
4.మునుగోడు: కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డ-40,138 ఓట్లతో గెలుపు.
5. హుజూర్నగర్: కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తంకుమార్ రెడ్డి.. 43,959 ఓట్లతో గెలుపు.
6. నకిరేకల్: కాంగ్రెస్ అభ్యర్ధి వేముల వీరేశం 68,839 ఓట్ల తేడాతో గెలుపు.
7.తుంగతుర్తి: కాంగ్రెస్ అభ్యర్ధి మందుల సామేల్ -51,094 ఓట్ల తేడాతో గెలుపు.
8. దేవరకొండ: కాంగ్రెస్ అభ్యర్ధి.. 30,140 ఓట్ల తేడాతో..
9. ఆలేరు: కాంగ్రెస్ అభ్యర్ధి బీర్ల అయిలయ్య.. 49,656 ఓట్ల తేడాతో గెలుపు.
10. కోదాడ: కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతి.. 57,861 ఓట్లతో గెలుపు..
11. భువనగిరి: కాంగ్రెస్ అభ్యర్ధి కుంభం అనిల్ కుమార్ రెడ్డి.. 25,761 వేల ఓట్ల తేడాతో గెలుపు.
&
12. సూర్యాపేట: BRS అభ్యర్ధి జగదీష్ రెడ్డి.. 5,637 ఓట్ల తేడాతో గెలుపుTelangana Elections Counting Live Updates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు 8 స్థానాల్లో విజయం సాధించారు.
==> కామారెడ్డి - వెంకట రమణా రెడ్డి
==> ఆదిలాబాద్ - పాయల్ శంకర్
==> ముధోల్ - రామారావు పటేల్
==> నిర్మల్ - ఏలేటి మహేశ్వర్ రెడ్డి
==> గోషామహల్ - రాజాసింగ్
==> నిజామాబాద్ (అర్బన్)- ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా
==> ఆర్మూర్ - పైడి రాకేష్ రెడ్డి
==> సిర్పూర్ - పాల్వాయి హరీష్ఓటమిపాలైన సిట్టింగ్ ఎమ్మెల్యేలు
==> హుజురాబాద్, గజ్వేల్ - ఈటల రాజేందర్
==> దుబ్బాక - రఘునందన్ రావుబీజేపీ నుంచి పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు ఓటమిపాలయ్యారు. సోయం బాపూరావు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ అనూహ్యంగా ఓడిపోయారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గెలుపొందారు.
Telangana Elections Counting Live Updates: కోఠి మహిళా విశ్వవిద్యాలయం వద్ద బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజాసింగ్ గెలుపుతో భారీగా చేరుకున్నారు అభిమానులు. అభిమానులతో కలిసి రాజాసింగ్ సంబరాలు చేసుకున్నారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయం నుంచి దుల్‌పేట్ వరకు ర్యాలీగా వెళ్లారు.
==> గోశామహల్‌లో 3వసారి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు
==> తనను ఓడించేందుకు మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు పెట్టారు
==> ఒక్కొక్క ఓటుకు రూ.5 వేల ఇచ్చి కొనాలని చూశారు
==> గతంలో కంటే ఇప్పుడు అసెంబ్లీలో ఎక్కువ మంది ఉన్నాం..
==> ప్రజల సమస్యలపై అసెంబ్లీలో కొట్లాడుతాం..
==> అధిష్టానం ఆదేశిస్తే కేంద్ర రాజకీయాలలోకి వస్తాను
==> కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఆమోదయోగ్యమైన కావు
==> అవి అమలు చేస్తే రాష్ట్రం ఇంకా అప్పులపాలు అవుతుంది
==> నాపై నమ్మకంతో హ్యాట్రిక్ విజయాన్ని ఇచ్చిన గోషామహల్ ప్రజలకు ప్రత్యేక అభినందనలుTelangana Elections Counting Live Updates: తాండూరు అసెంబ్లీ ఎన్నికల ఓటమిపై ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స్పందించారు. ఎన్నికల్లో ప్రజల ఇచ్చిన తీర్పును స్వీకరిస్తానని అన్నారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. తన ఓటమికి ప్రత్యేక కారణాలు ఏమి లేవన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంటింటికి సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. ప్రతి గడపకు పథకాలను అందించామన్నారు. కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా వీయడంతో ప్రజలు తమను తిరస్కరించారని అన్నారు. ఓటర్ల తీర్పును సాధారంగా స్వీకరిస్తామని అన్నారు. ఓడిపోయినా ప్రజల కోసం పనిచేస్తామన్నారు.
Telangana Elections Counting Live Updates: ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు డీజీపీ అంజనీకుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాకముందే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడంతో ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.
Telangana Elections Counting Live Updates: వరంగల్ జిల్లాలో ఫలితాలు ఇలా..
==> భూపాలపల్లిలో కాంగ్రెస్ గండ్ర సత్యనారాయణ రావు విజయం
==> పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ రేవూరి ప్రకాష్ రెడ్డి విజయం.
==> ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ఘన విజయం.
==> నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ దొంతి మాధవరెడ్డి విజయం
==> డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ రాంచంధర్ నాయక్ విజయం.
==> మహబూబాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మురళీ నాయక్ విజయం.
==> పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ యశస్విని రెడ్డి విజయం.
==> వర్దన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ KR నాగరాజు విజయం
==> వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయిని రాజేందర్ రెడ్డి విజయం.
==> వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ కొండా సురేఖ విజయం .
==> స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి విజయం.
==> జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి..
==> ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 నియోజకవర్గల్లో కాంగ్రెస్ ఘన విజయం.
Telangana Elections Counting Live Updates: పటాన్ చెరు నియోజకవర్గం
19వ రౌండ్బీఆర్ఎస్- 87651
కాంగ్రెస్- 82288
బీఎస్పీ- 41950
బీజేపీ- 15800
సీపీఎం- 936
19వ రౌండ్లో 5363 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు.
19వ రౌండ్ పూర్తయ్యే సరికి పోలైన ఓట్లు 2,33,670 పోలయ్యాయి.Telangana Elections Counting Live Updates: ముషీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ 37 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
చివరి రౌండ్ ముగిసేసరికి
బీఆర్ఎస్:- 74,491
బీజేపీ:- 36,027
కాంగ్రెస్:- 36,426Telangana Elections Counting Live Updates: రాజేంద్రనగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కస్తూరి నరేందర్‌పై బీఆరెస్ పార్టీ అభ్యర్థి టి.ప్రకాష్ గౌడ్ గెలుపొందారు.
Telangana Elections Counting Live Updates: కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకటరమణ సంచలన విజయం సాధించారు. సీఎం కేసీఆర్‌పై 5 వేల పై చిలుకు ఓట్లతో విజయం సాధించారు. రేవంత్ రెడ్డి మూడోస్థానానికి పరిమితమయ్యారు.
Telangana Elections Counting Live Updates: అసెంబ్లీ ఎన్నికలమ్లో ఓటమిపై పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. "ఖమ్మం నియోజకవర్గం, ఖమ్మం జిల్లా ప్రజలకు నమస్కారం.. ఈ రోజు వచ్చిన ఎన్నికల ఫలితాలకు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నా. నాపై గెలుపొందిన తుమ్మల నాగేశ్వరరావు గారికి నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎన్నికలలో గెలుపు, ఓటములు సహజం. దాన్ని స్పోర్టివ్‌గా తీసుకుని ముందుకు పోతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలను గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న దరిమిలా వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తు.. మంచి పరిపాలన అందిస్తారని ఆశిస్తున్నాను. నా విజయాన్ని కాంక్షిస్తూ ఇప్పటి వరకు పని చేసిన BRS శ్రేణులకు, కార్యకర్తలకు, మీడియా, అభిమానులకు పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నా.." అని పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు.
Telangana Elections Counting Live Updates: జూబ్లీహిల్స్‌లో ఓట్ల లెక్కింపు ఆగిపోయింది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ఈసీకి ఫిర్యాదు చేశారు.
Telangana Elections Counting Live Updates: కూకట్‌పల్లిలో 68,572 ఓట్లతో మాధవరం కృష్ణారావు విజయం సాధించారు.
Telangana Elections Counting Live Updates: నాంపల్లి నియోజకవర్గం
14వ రౌండ్బీఆర్ఎస్ : 10342
బీజేపీ : 7125
కాంగ్రెస్ : 42843
ఎంఐఎం : 45173
ఎంఐఎం అభ్యర్థి మాజీద్ హుస్సేన్ 2330 ఓట్ల మెజారిటీతో ముందంజTelangana Elections Counting Live Updates: సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో ఆయన రాజీనామా చేశారు. గవర్నర్ తమిళసైను కలిసి రాజీనామా పత్రంను అందజేశారు.
Telangana Elections Counting Live Updates: పటాన్ చెరు నియోజకవర్గం
16వ రౌండ్
కాంగ్రెస్: 5367
బీఆర్ఎస్: 4574
బీజేపీ: 477
బీఎస్పీ: 236516వ రౌండ్ లీడ్ కాంగ్రెస్ : 793
ఓవరాల్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి మొత్తం 6884 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Telangana Elections Counting Live Updates: సీఎం కేసీఆర్ మరికాసేపట్లో రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించనున్నారు.
Telangana Elections Counting Live Updates: ఆదిలాబాద్ జిల్లా ఫలితాలు ఇలా..
==> ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పాయల శంకర్ స్వల్ప మెజారిటీతో విజయం
==> బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ భారీ మెజారిటీతో విజయం
==> నిర్మల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి భారీ విజయం
==> ముధోల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ భారీ విజయం
==> ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోజ్జు పటేల్ స్వల్ప మెజారిటీతో విజయం
Telangana Elections Counting Live Updates: కోరుట్ల నియోజకవర్గం
19వ రౌండ్ ఫలితాలు
01. BRS - 1922
02. INC - 1349
03. BJP - 185119వ రౌండ్ పూర్తయ్యే సరికి మొత్తం ఓట్లు
01. BRS - 72115
02. INC - 39647
03. BJP - 61810LEAD - BRS 10305
కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ గెలుపు.
సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌పై 10,305 ఓట్ల మెజారిటీతో గెలుపు
Telangana Elections Counting Live Updates: సూర్యాపేట సెగ్మెంట్:
కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి రాంరెడ్డి దామోదర్ రెడ్డిపై 4238 ఓట్లతో తేడాతో జగదీష్ రెడ్డి గెలుపొందారు.
Telangana Elections Counting Live Updates: కాంగ్రెస్ విజయంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. సచివాలయ గేట్లు సామాన్యులకు తెరుచుకుంటాయన్నారు. ప్రగతి భవన్‌ను డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భవన్‌గా మారుతుందన్నారు. ఇక నుంచి అది ప్రగతి భవన్ కాదని.. ప్రజా భవన్ కాదన్నారు.
Telangana Elections Counting Live Updates: కొత్తగూడెం నియోజకవర్గం:
18 రౌండ్లు:
బీఆర్ఎస్ : 36,811
వనమా వెంకటేశ్వరరావుసీపీఐ : 78,758
కూనంనేని సాంబశివరావు
ఫార్వార్డ్ బ్లాక్ : 52,619
జలగం వెంకటరావుఆధిక్యం : కునంనేని సాంబశివరావు 26,439 ఓట్లు
Telangana Elections Counting Live Updates: ముషీరాబాద్ నియోజకవర్గం
17వ రౌండ్
బీఆర్ఎస్-3011
కాంగ్రెస్-1717
బీజేపీ-2708బీఆర్ఎస్ అభ్యర్థి ముఠాగోపాల్‌కు లీడ్..30,600
Telangana Elections Counting Live Updates: పటాన్ చెరు నియోజకవర్గం
కాంగ్రెస్ : 3233
బీఆర్ఎస్ : 6147
బీజేపీ : 1124
బీఎస్పీ : 229813వ రౌండ్ లీడ్ బీఆర్ఎస్: 2914
మొత్తం 5151 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్Telangana Elections Counting Live Updates: 47,135 మెజార్టీతో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ విజయం సాధించారు.
Telangana Elections Counting Live Updates: బీజేపీ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు ఓటమిపాలయ్యారు. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు ఓడిపోయారు.
Telangana Elections Counting Live Updates: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ 6,560 ఓట్లతో గెలుపొందారు.
Telangana Elections Counting Live Updates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుగురు మంత్రులు ఓటమిపాలయ్యారు. పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిరంజన్ రెడ్డి అనూహ్యంగా ఓడిపోయారు.
Telangana Elections Counting Live Updates: ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ స్పందించారు. రెండు సార్లు బీఆర్ఎస్‌కు అధికారం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. నేటి ఫలితం గురించి బాధపడట్లేదని.. కానీ తాము ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నిరాశ చెందామన్నారు. దీనిని తాము అభ్యాసంగా తీసుకొని తిరిగి పుంజుకుంటామన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు.
Telangana Elections Counting Live Updates: కోరుట్ల నియోజక వర్గంలో 17వ రౌండ్ ముగిసేవరకు
బీఆర్ఎస్ 67,150
బీజేపీ 57,176
కాంగ్రెస్ 36,616
బీఆర్ఎస్ 9,974 ఓట్లతో ముందంజనర్సంపేటలో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి విజయం సాధించారు. ఖానాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మా బొజ్జ గెలుపొందారు.
నాంపల్లిలో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్..2,400 ఓట్లతో ఫిరోజ్ ఖాన్ ఆధిక్యంలో ఉన్నారు.
Telangana Elections Counting Live Updates: తనకు సీఎం పదవి ఇస్తే బాధ్యతగా స్వీకరిస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో దొరల తెలంగాణ పాలన పోయి ప్రజల తెలంగాణ పాలన వచ్చిందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఎమ్మెల్యేలంతా ఒక్కచోట చేరుతామన్నారు. వారు సీఎల్పీ లీడర్‌గా గా కొనసాగమంటే కొనసాగుతానని తెలిపారు.
Telangana Assembly Election 2023 Winning Candidates: కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. 1717 ఆధిక్యంలో ఉన్నారు.
Telangana Elections Counting Live Updates: నకిరేకల్లు కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం విజయం..
==> నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జైవీర్ రెడ్డి విజయం
==> మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి విజయం
==> దేవరకొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలు నాయక్ విజయం..
==> నల్గొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపు
==> మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం
==> హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం..
==> ఆలేరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిర్లా ఐలయ్య విజయంTelangana Elections Counting Live Updates: కొల్లాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డిపై గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన క్రియేట్ చేసిన బర్రెలక్క ఓటమి పాలయ్యారు.
Telangana Elections Counting Live Updates: వరంగల్ తూర్పు నియోజకవర్గం
9వ రౌండ్ పూర్తయ్యేసరికి ఓట్లు
కాంగ్రెస్: 35741
బీజేపీ: 27681
బీఆర్ఎస్: 21828
బీఎస్పీ: 409మెజారిటీ- కాంగ్రెస్ 8,060 ఓట్ల మెజారిటీతో కొండా సురేఖ ముందంజ
Telangana Elections Counting Live Updates: కామారెడ్డిలో బీజేపీ అభ్యర్ధి కట్టిపల్లి రమణారెడ్డి లీడ్‌లోకి వచ్చారు. 15వ రౌండ్ ముగిసేసరికి 4030 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.
Telangana Elections Counting Live Updates: హొరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పాయల శంకర్ విజయం సాధించారు. బీజేపీ విజయం ఖాయం కావడంతో బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న కౌంటింగ్ కేంద్రం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. బీజేపీ అభ్యర్థి పాయల శంకర్ 4 వేలకు పై చిలుకు మెజారిటీతో విజయం సాధించారు.
Telangana Elections Counting Live Updates: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావుపై 14వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు 28,930 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.
Telangana Assembly Election 2023 Winning Candidates: మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి, సనత్‌నగర్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలుపొందారు.
Telangana Elections Counting Live Updates: షాద్ నగర్ నియోజకవర్గం
17వ రౌండ్ ఫలితాలు
కాంగ్రెస్- 3026
బీఆర్ఎస్ - 2578
బీజేపీ- 373
Aifb - 2398బీఆర్ఎస్ మొత్తం ఓట్లు: 57284
కాంగ్రెస్ మొత్తం ఓట్లు: 61826
17వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి శంకరయ్య: 4542 ఓట్లతో ముందంజలో ఉన్నారు.Telangana Elections Counting Live Updates: 14వ రౌండ్ ఫలితాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం :
BRS : 4455
BJP : 552CONG : 3281
BSP : 200
27,193.. ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్ ముందంజ
Telangana Elections Counting Live Updates: పరిగి నియోజకవర్గం
పదో రౌండ్
బీఆర్ఎస్ : 2723
కాంగ్రెస్ : 3664
బీజేపీ : 1128ఆధిక్యం : 941
మొత్తం కాంగ్రెస్ ఆధిక్యం.. 12,270Telangana Assembly Election 2023 Winning Candidates: పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమిపాలయ్యారు. ఇక్కడ యశస్విని రెడ్డి విజయం సాధించారు. నిర్మల్‌లో బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి గెలుపొందారు. నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి 5 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. మెదక్‌లో పద్మాదేవేందర్ రెడ్డిపై మైనంపల్లి రోహిత్ గెలుపొందారు.
Telangana Assembly Election 2023 Winning Candidates: కొండంగల్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజయం సాధించారు. 32,800 ఓట్లతో గెలుపొందారు.
Telangana Elections Counting Live Updates: చేవెళ్ల నియోజకవర్గంలో 12వ రౌండ్
బీఆర్ఎస్ కాలే యాదయ్య ---3060
కాంగ్రెస్ పామేన భీం భరత్ ---3206
బీజేపీ కేఎస్ రత్నం ----2336
ఈ రౌండ్ లీడ్ ---146 (కాంగ్రెస్)
మొత్తం లీడ్-- 4975 (బీఆర్ఎస్)Telangana Elections Counting Live Updates: సిరిసిల్ల నియోజకవర్గం
13వ రౌండ్‌లో ఫలితాలు
బీఆర్ఎస్ (కేటీఆర్) : 59001
బీజేపీ (రాణి రుద్రమ) : 12366
కాంగ్రెస్ (కేకే మహేందర్ రెడ్డి): 32982
12వ రౌండ్‌లు ముగిసిన అనంతరం బీఆర్ఎస్ లీడ్: 26019
Telangana Elections Counting Live Updates: బాల్కొండలో 3 వేల మెజారిటీతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గెలుపొందారు.
Telangana Elections Counting Live Updates: శేరిలింగంపల్లి నియోజకవర్గం
12వ రౌండ్ ఫలితాలు..
బీఆర్ఎస్ : 9593
కాంగ్రెస్: 3623
బీజేపీ: 2394బీఆర్ఎస్ పార్టీ లీడ్: 5970
మొత్తం లీడ్: 24604
Telangana Elections Counting Live Updates: గోషామహల్ నియోజకవర్గం 11వ రౌండ్
బీఆర్ఎస్ : 3007
కాంగ్రెస్ : 298
బీజేపీ : 5646బీజేపీ రాజాసింగ్ ఆధిక్యం: 20533
Telangana Elections Counting Live Updates: కోరుట్ల నియోజకవర్గంలో 9వ రౌండ్
బీఆర్ఎస్ 31,926
బీజేపీ 25,393
కాంగ్రెస్ 22,341ఆధిక్యం బీఆర్ఎస్ 6533 ఓట్లతో ముందంజ
Telangana Elections Counting Live Updates: 12వ రౌండ్ వరకు కరీంనగర్‌లో 6,217 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.
Telangana Elections Counting Live Updates: పటాన్ చెరు నియోజకవర్గం 6వ రౌండ్
బీఆర్ఎస్- 25284
కాంగ్రెస్ - 22247
బీఎస్పీ - 19697
బీజేపీ - 40216వ రౌండ్లో 3037 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు.
6 రౌండ్ వరకు మొత్తం పోలైన ఓట్లు 73209.
Telangana Elections Counting Live Updates: సిరిసిల్ల నియోజకవర్గం
11 రౌండ్ల ఫలితాలు
బీఆర్ఎస్ (కేటీఆర్ ): 49087
బీజేపీ (రాణి రుద్రమ): 10699
కాంగ్రెస్ (కేకే మహేందర్ రెడ్డి) : 28014
11 రౌండ్లు ముగిసేసరికి బీఆర్ఎస్ లీడ్: 21073
Telangana Assembly Election 2023 Winning Candidates: నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గెలుపొందారు. అంబర్‌పేటలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ విజయం సాధించారు.
Telangana Elections Counting Live Updates: కోరుట్ల నియోజకవర్గం
కోరుట్ల : 7వ రౌండ్
కాంగ్రెస్ : 17756
బీజేపీ : 18444
బీఆర్ఎస్ : 24679
లీడ్ బీఆర్ఎస్ : 6235Telangana Elections Counting Live Updates: సికింద్రాబాద్ నియోజకవర్గం
రౌండ్ నెంబర్: 11
BRS: 4460
BJP: 2315
INC: 209311వ రౌండ్ మెజారిటీ: BRS ఆధిక్యం 2145
11వ రౌండ్ ముగిసే సరికి BRS అభ్యర్థి పద్మారావు 32883 ఓట్లతో ఆధిక్యం..
Telangana Assembly Election 2023 Winning Candidates: భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు.
Telangana Elections Counting Live Updates: కోరుట్ల నియోజకవర్గం 8వ రౌండ్ ముగిసేసరికి
బీజేపీ: 21,812
బీఆర్ఎస్: 27,946
కాంగ్రెస్: 20,127బీఆర్ఎస్ ఆధిక్యం: 6134
Telangana Elections Counting Live Updates: షాద్‌నగర్ నియోజకవర్గం
12వ రౌండ్ వరకు ఫలితాలు..
బీఆర్ఎస్ మొత్తం ఓట్లు: 42381
కాంగ్రెస్ మొత్తం ఓట్లు :- 43788
మొత్తం 12వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి శంకరయ్య ఓట్ల 1407 ముందంజలో ఉన్నారు.
Telangana Elections Counting Live Updates: ఆదిలాబాద్ జిల్లా: 10వ రౌండ్
ఆదిలాబాద్-బీజేపీ అభ్యర్థి పాయల శంకర్ 5,959 ఓట్లతో ముందంజ
బోథ్-బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ 12,378 ఓట్లతో ముందంజ
నిర్మల్ జిల్లా: 10వ రౌండ్
నిర్మల్- బీజేపీ అభ్యర్థి మహేశ్వర రెడ్డి 20,468 ఓట్లతో ముందంజ
ఖానాపూర్- కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేడ్మ బొజ్జు 7,992 ఓట్లతో ముందంజ
ముధోల్- బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ 13,187 ఓట్లతో ముందంజ
Telangana Elections Counting Live Updates: నర్సంపేట నియోజకవర్గంలో 13వ రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవ రెడ్డి 9167 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
Telangana Elections Counting Live Updates: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని డీజీపీ అంజనీ కుమార్, మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ కలిశారు.
Telangana Elections Counting Live Updates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ మూడు సిట్టింగ్ స్థానాల్లో వెనుకంజలో ఉంది. నాంపల్లిలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా.. కార్వాన్, యాకుత్‌పూరాలో బీజేపీ ఆధిపత్యం చెలాయిస్తోంది. మలక్‌పేట, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహుదూర్‌పురాలో ఎంఐఎం ఆధిక్యంలో ఉంది.
Telangana Elections Counting Live Updates: మేడ్చల్ నియోజకవర్గం
8వ రౌండ్
12,381 ఓట్ల ఆధిక్యంలో మంత్రి మల్లారెడ్డి
బీఆర్ఎస్: 72,018
కాంగ్రెస్ : 59,637
బీజేపీ: 14,144Telangana Elections Counting Live Updates: సికింద్రాబాద్ నియోజకవర్గం
రౌండ్ నెంబర్: 08
BRS: 5551
BJP: 2186
INC: 8108వ రౌండ్ మెజారిటీ: BRS ఆధిక్యం 3365
8వ రౌండ్ ముగిసే సరికి BRS అభ్యర్థి పద్మారావు 26846 ఓట్లతో ఆధిక్యం.Telangana Elections Counting Live Updates: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏడో రౌండ్ ఓట్ల లెక్కింపు
గొరిగే మల్లేష్ (బీఎస్పీ)-110
నోముల దయానంద్ గౌడ్ (బీజేపీ)-679
పగడాల యాదయ్య (సీపీఎం)-557
మల్ రెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి (కాంగ్రెస్)-5287
మంచిరెడ్డి కిషన్ రెడ్డి (బీఆర్ఎస్)-3279
కాంగ్రెస్ ఆధిక్యం 2008
ఏడో రౌండ్లు కలిపి 12,889 ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మాల్ రెడ్డి రంగారెడ్డి
Telangana Elections Counting Live Updates: రామగుండం నియోజకవర్గం
13వ రౌండ్ ఫలితాలు..
01. INC (MS. రాజ్ ఠాకూర్) - 4640
02. BRS (కోరుకంటి చందర్) - 2212
03. BJP (కందుల సంద్యారాణి) - 57113వ రౌండ్ పూర్తయ్యే సరికి మొత్తం ఓట్లు..
01. INC(MS. రాజ్ ఠాకూర్) - 65,462
02. BRS(కోరుకంటి చందర్) - 25,110
03. BJP(కందుల సంద్యారాణి) - 9,132మొత్తంగా 13వ రౌండ్ పూర్తయ్యే సరికి 40,352 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి MS.రాజ్ ఠాకూర్ ముందంజ.
Telangana Elections Counting Live Updates: కాంగ్రెస్ లీడ్‌లో ఉన్న 66 స్థానాల్లో 10 నుంచి 20 వేల ఓట్ల తేడా
బీఆర్ఎస్ లీడ్‌లో ఉన్న 36 స్థానాల్లో 3 నుండి 4 వేల ఓట్ల తేడా..
Telangana Elections Counting Live Updates: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం
బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద: 1,04,325
కాంగ్రెస్ అభ్యర్థి కొలను హనుమంత్ రెడ్డి: 61,711
బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్: 54,970 ఓట్లు సాధించారు.
బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద 42,614 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
Telangana Elections Counting Live Updates: ముషీరాబాద్ నియోజకవర్గం
7వ రౌండ్ ముగిసేసరికి
కాంగ్రెస్ :- 2020
బీఆర్ఎస్ :-4349
బీజేపీ:-2064
ముఠా గోపాల్‌కు 9339 ఓట్ల ఆధిక్యంTelangana Elections Counting Live Updates: జనగామ నియోజవర్గం
ఆరో రౌండ్...
పల్లా రాజేశ్వర్ రెడ్డి (బీఆర్ఎస్)-4934
కొమ్మూరి ప్రతాప్ రెడ్డి (కాంగ్రెస్)-3634
ఆరో రౌండ్‌లో 1300 బీఆర్ఎస్ ఆధిక్యం
Telangana Elections Counting Live Updates: కూకట్‌పల్లి నియోజకవర్గం
ఐదవ రౌండ్‌లో 5,850 ఓట్ల ముందంజలో బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు
మొత్తం 20,000 లీడ్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి
Telangana Elections Counting Live Updates: కల్వకుర్తి నియోజకవర్గం
10th రౌండ్ ముగిసే సరికి
బీజేపీ.. 3015
కాంగ్రెస్.. 5025
బీఆర్ఎస్.. 2870
కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ్ రెడ్డి 8007 ఓట్ల ఆధిక్యంతో ముందంజ..
Telangana Elections Counting Live Updates: పెద్దపల్లి నియోజకవర్గం
రౌండ్ : 07
కాంగ్రెస్ : 5321
బీఆర్ఎస్ : 2731
బీజేపీ : 219
బీఎస్పీ : 430ఏడోవ రౌండ్ ముగిసే వరకు కాంగ్రెస్ అభ్యర్థి విజయరమణా రావు 17091 ఓట్ల ఆధిక్యం
Telangana Assembly Election 2023 Winning Candidates: తెలంగాణలో మొదటి ఫలితం వచ్చింది. అశ్వారావుపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ 28 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
Telangana Elections Counting Live Updates: సిరిసిల్ల నియోజకవర్గం
ఏడో రౌండ్
బీఆర్ఎస్: 26648
బీఎస్పీ: 3394
కాంగ్రెస్: 18,687
బీజేపీ: 6,286
బీఆర్ఎస్ లీడ్: 7,961
Telangana Elections Counting Live Updates: సిరిసిల్ల నియోజకవర్గం
ఏడో రౌండ్
బీఆర్ఎస్: 26648
బీఎస్పీ: 3394
కాంగ్రెస్: 18,687
బీజేపీ: 6,286
బీఆర్ఎస్ లీడ్: 7,961
Telangana Elections Counting Live Updates: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజక వర్గం
12వ రౌండ్ ముగిసేసరికి
==> కాంగ్రెస్: 62380
==> బీఆర్ఎస్ : 38549
==> కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణకు 26,311 ఆధిక్యంTelangana Elections Counting Live Updates: శేరిలింగంపల్లి నియోజకవర్గం
ఆరో రౌండ్ ఫలితాలు..
బీఆర్ఎస్ : 39369
కాంగ్రెస్: 29295
బీజేపీ: 24031
లీడ్: బీఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ 10,074 ఆధిక్యం
Telangana Election 2023 Result Live: ఈవీఎంల లెక్కింపులో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.
==> చెన్నూర్ నియోజకవర్గంలో 5వ రౌండ్ లెక్కింపు పూర్తవ్వగా.. 12,040 వేల ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ముందంజ
==> కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామికి వచ్చిన ఓట్లు 26123
==> బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌కు వచ్చిన ఓట్లు 14083
Telangana Election 2023 Result Live: ముషీరాబాద్ ఐదో రౌండ్
బీఆర్ఎస్ : 3162
బీజేపీ : 1676
కాంగ్రెస్ : 1136ఐదో రౌండ్ ముగిసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ 5739 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
Telangana Election 2023 Result Live: కామారెడ్డిలో ఐదో రౌండ్ పూర్తయ్యే సరికి బీఆర్ఎస్‌కి 660 ఓట్లు ఆధిక్యం లభించింది. మొత్తంగా రేవంత్ రెడ్డి 2500 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. కొల్లాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి 2042 ఓట్ల ఆధిక్యం, కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి సాంబశివరావుకు 9,024 ఓట్ల ఆధిక్యం, కల్వకుర్తిలో 5853 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్, ఇబ్రహీంపట్నంలో నాల్గో రౌండ్ పూర్తయ్యే సరికి 7625 ఓట్లు ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి నిలిచారు. కొడంగల్‌లో ఆరో రౌండ్ పూర్తయే సరికి రేవంత్ రెడ్డికి 7781 ఓట్ల ఆధిక్యం లభించింది.
Telangana Election 2023 Result Live: మహేశ్వరం నియోజకవర్గం
ఏడో రౌండ్
బీఆర్ఎస్: 5831-34194
కాంగ్రెస్ : 2742-20129
బీజేపీ : 5116-30114
బీఎస్పీ : 109-789ఏడో రౌండ్ ముగిసే సరికి: బీఆర్ఎస్ ఆధిక్యం: 4080
Telangana Election 2023 Result Live: సూర్యాపేట నియోజకవర్గం
నాలుగో రౌండ్..
1.గుంటకండ్ల జగదీష్ రెడ్డి (బీఆర్ఎస్)---4012
2.రాంరెడ్డి దామోదర్ రెడ్డి (కాంగ్రెస్) --2938
3.వట్టే జానయ్య యాదవ్ (బీఎస్పీ)--454
4.సంకినేని వెంకటేశ్వరావు (బీజేపీ)- 2027గుంటకండ్ల జగదీష్ రెడ్డి --2657 (లీడ్)
Telangana Election 2023 Result Live: ములుగు నియోజకవర్గం
7వ రౌండ్
కాంగ్రెస్...4395
బీఆర్ఎస్..2614
బీజేపీ...435
కాంగ్రెస్ మొత్తం ఆధిక్యం...10,080
Telangana Elections Counting Live Updates: మహేశ్వరం నియోజకవర్గం
ఆరో రౌండ్ ఫలితాలు ఇలా..
బీఆర్ఎస్: 5961
కాంగ్రెస్:: 3803
బీజేపీ: 5317
బీఎస్పీ: 503ఆరో రౌండ్ ముగిసేసరికి: బీఆర్ఎస్ 3,365 ఓట్లు ఆధిక్యం
Telangana Elections Counting Live Updates: షాద్ నగర్ నియోజకవర్గం
5వ రౌండ్ వరకు ఫలితాలు..
బీఆర్ఎస్ :- 18383
కాంగ్రెస్:- 20803
బీజేపీ:- 1657
AIFB:- 6706
మొత్తం 5వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి శంకరయ్య 2420 ఓట్ల ముందంజలో ఉన్నారు
Telangana Elections Counting Live Updates: కామారెడ్డిలో రేవంత్ రెడ్డి లీడ్
==> ఐదో రౌండ్ ముగిసేసరికి లీడ్ 2133
==> కాంగ్రెస్స్.. రేవంత్ రెడ్డి.. 2701
==> బీఆర్ఎస్ ...3356
==> బీజేపీ ....2334
Telangana Elections Counting Live Updates: మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ హవా..!
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలివీస్తున్నా.. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగుతోంది. ఉప్పల్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థులు తమ ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు.
Telangana Elections Counting Live Updates: నల్గొండ సెగ్మెంట్:
ఏడు రౌండ్లు ముగిసేసరికి 21,302 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కాంగ్రెస్ : 38,618
బీఆర్ఎస్ : 17,316
పిల్లి రామరాజు: 9,472.సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ స్థానం:
5వ రౌండ్
బీఆర్ఎస్ లీడ్.. 3761BRS : 6037
CONG : 1268
BJP : 2276
BSP : 62
Telangana Elections Counting Live Updates: నల్గొండ సెగ్మెంట్:
ఏడు రౌండ్లు ముగిసేసరికి 21,302 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కాంగ్రెస్ : 38,618
బీఆర్ఎస్ : 17,316
పిల్లి రామరాజు: 9,472.
Telangana Elections Counting Live Updates: రామగుండం నియోజకవర్గం
ఏడో రౌండ్ :
కాంగ్రెస్ : 5556
బిఆర్ఎస్: 2318
బీజేపీ: 737ఏడో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ 24,376 ఓట్ల ఆధిక్యంతో ముందున్నారు.
Telangana Elections Counting Live Updates: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో 3వ రౌండ్‌లో బీఆర్ఎస్ అభ్యర్ధి లాస్య నందిత ముందంజ
==> 7221 ఓట్ల ఆధిక్యంతో ముందంజ
==> బీఆర్ఎస్.. 5331
==> కాంగ్రెస్.. 768
==> బీజేపీ.. 1516
Telangana Elections Counting Live Updates: ముషీరాబాద్ మూడోరౌండ్ బీఆర్ఎస్: 3136 బీజేపీ: 2026 కాంగ్రెస్: 1741 మూడవ రౌండ్ ముగిసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ 3308 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
Telangana Elections Counting Live Updates: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం
==> కాంగ్రెస్: మల్ రెడ్డి రంగారెడ్డి 14346
==> బీఆర్ఎస్: మంచిరెడ్డి కిషన్ రెడ్డి 8951
==> బీజేపీ: నోముల దయాంద్ గౌడ్ 1490
==> రెండో రౌండ్‌లో కాంగ్రెస్ 5395 ఓట్ల ముందంజ==> కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేకానంద 5 రౌండ్లు ముగిసేసరికి 18 వేల మెజారిటీ సాధించారు.
==> మల్కాజిగిరిలో మూడో రౌండ్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి 8632 ఆధిక్యంలో ముందున్నారు
==> కూకట్‌పల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఆధిక్యంలో ఉన్నారు.
Telangana Elections Counting Live Updates: మేడ్చల్ మూడవ రౌండ్
బీఆర్ఎస్... 28298
కాంగ్రెస్...20839
బీజేపీ... 5998
బీఆర్ఎస్ లీడ్... 7469Telangana Elections Counting Live Updates: కామారెడ్డిలో రేవంత్ రెడ్డి హవా
కామారెడ్డిలో కాంగ్రెస్ లీడ్ 2585
==> కాంగ్రెస్ 3228
==> బీఆర్ఎస్ 2363
==> బీజేపీ 2555Telangana Elections Counting Live Updates: మహేశ్వరం నియోజకవర్గంలో నాలుగో రౌండ్ ముగిసేవరకు
1.సబితా ఇంద్రారెడ్డి... 5015
మొత్తం.. 17080
2.అందేల శ్రీరాములు యాదవ్.. 5017
మొత్తం ఓట్లు.. 15808
3.కిచ్చన లక్ష్మారెడ్డి... 3318
మొత్తం ఓట్లు.. 10,080
లీడ్ బీఆర్ఎస్..1272
Telangana Elections Counting Live Updates: మానకొండూర్ నియోజకవర్గం నాలుగో రౌండ్ ముగిసేసరికి ఇలా..
కాంగ్రెస్ - 4486
బీఆర్ఎస్ - 3233
బీజేపీ - 664
Telangana Elections Counting Live Updates: తెలంగాణ ఫలితాలో బీఆర్ఎస్కు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా మంత్రులు కొన్ని నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉన్నారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్, ఖమ్మంలో పువ్వాడ అజయ్, నిర్మల్లో ఇంద్రకరణ్ రెడ్డి, వనపర్తిలో నిరంజన్ రెడ్డి వెనుకబడ్డారు.
Telangana Elections Counting Live Updates: ఐదో రౌండ్ ముగిసేసరికి కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో
బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానందకు 43,844
కాంగ్రెస్ అభ్యర్థి కొలను హనుమంత్ రెడ్డికి 31,808
బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కు25554 ఓట్లు సాధించారు
== కేపీ వివేకానంద 12,036 ఓట్లతో ముందంజలో ఉన్నారుTelangana Elections Counting Live Updates: రెండో రౌండ్‌లో వరంగల్ తూర్పు
కాంగ్రెస్ 5016
బీజేపీ 2605
బీఆర్ఎస్ 1249
== కాంగ్రెస్ 2,777 ఓట్ల లీడ్Telangana Elections Counting Live Updates: ములుగు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కంపులో
మూడో రౌండ్లోకాంగ్రెస్: 4227
బిఆర్ఎస్: 2793
మూడో రౌండ్‌లో 1434 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క
Telangana Elections Counting Live Updates: జగిత్యాల జిల్లా పరిస్థితి ఇలా..
జగిత్యాల: ఒకటో రౌండ్
కాంగ్రెస్ : 3253
బీజేపీ : 1580
బీఆర్ఎస్ : 2264
లీడ్ కాంగ్రెస్ : 989......
ధర్మ పురి
కాంగ్రెస్ : 3916
బీజేపీ : 369
బీఆర్ఎస్ : 3487
లీడ్ కాంగ్రెస్: 429.....
కోరుట్ల
కాంగ్రెస్ : 2098
బీజేపీ : 3444
బీఆర్ఎస్ : 3612
లీడ్ బీఆర్ఎస్: 168Telangana Elections Counting Live Updates: కామారెడ్డిలో సీఎం కేసీఆర్ మూడో స్థానానికి పడిపోయారు. ఆధిక్యంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. రెండో స్థానంలో వెంకటరమణారెడ్డి (బీజేపీ) కొనసాగుతున్నారు. రేవంత్ కొడంగల్లోనూ లీడింగ్‌లో ఉన్నారు. అటు గజ్వేల్లో కేసీఆర్ ఆధిక్యంలో ఉన్నారు.
Telangana Elections Counting Live Updates: మేడ్చల్ నియోజకవర్గం
రెండవ రౌండ్ ఫలితాలుబీఆర్ఎస్: 19,853 (చామకూర మల్లారెడ్డి)
కాంగ్రెస్ : 14,248 (తోటకూర వజ్రేష్ యాదవ్)
బీజేపీ: 3705 (ఏనుగు సుదర్శన్ రెడ్డి)
రెండో రౌండ్ పూర్తి అయ్యేసరికి బీఆర్ఎస్ మల్లారెడ్డి 8518 ఓట్ల ఆధిక్యంTelangana Elections Counting Live Updates: సికింద్రాబాద్ నియోజకవర్గంలో రెండవ రౌండ్ పూర్తయ్యేవరకు బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్‌లో బీఆర్ఎస్ 5228 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 1399 ఓట్లు, కాంగ్రెస్‌కు 2615 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు 6544 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Telangana Elections Counting Live Updates: కొడంగల్ నియోజకవర్గం
మూడవ రౌండ్ ముగిసేసరికిBRS..3228
Cong..5113
కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి 5763 ఓట్లతో ఆధిక్యం
Telangana Elections Counting Live Updates: రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్ల నియోజకవర్గంలో రెండోరౌండ్ ముగిసేసరికి
కాంగ్రెస్ : 5192
బీఆర్ఎస్ : 6753
బీజేపీ : 1734బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేటీఆర్‌కు 1561 ఓట్ల లీడ్
Telangana Elections Counting Live Updates: మేడ్చల్ రెండో రౌండ్‌లో
బీజేపీ- 2354
కాంగ్రెస్- 6347
బీఆర్ఎస్- 9039Telangana Elections Counting Live Updates: ఆధిక్యంలో రాజాసింగ్
గోషామహల్ రెండవ రౌండ్
బీఆర్ఎస్: 4704
బీజేపీ: 3591
కాంగ్రెస్: 465
మొదటి రౌండ్ లీడ్‌తో కలిపితే బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ 2891 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
Telangana Elections Counting Live Updates: మానకొండుర్ నియోజకవర్గం
ఫస్ట్ రౌండ్
BRS :2738
BJP : 1370
CONG:3743పెద్దపల్లి జిల్లా గోదావరిఖని :
రామగుండం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
మొదటి రౌండ్ ఫలితాలు
BRS- 1513
INC- 6084
BJP- 392
BSP- 38మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ 4571 ఓట్లతో ముందంజ
రామగుండం నియోజకవర్గం..
రెండో రౌండ్BRS 1763
CONGRESS 5591
BJP 749
రెండు రౌండ్లు కలిపి కాంగ్రెస్ లీడ్- 8399మంచిర్యాల జిల్లా:
ఈవీఎంల లెక్కింపులో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది
చెన్నూర్ నియోజకవర్గంలో మొదటి రౌండ్ లెక్కింపు పూర్తవ్వగా.. 3088 వేల ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఆధిక్యంలో ఉన్నారు.
==> ముషీరాబాద్ సెకండ్ రౌండ్..
BRS 3239
cong 1677
BJp 2033==> కల్వకుర్తి సెకండ్ రౌండ్-83
ఆచారి -----2854
కసిరెడ్డి నారాయణ రెడ్డి ---3296
జైపాల్ యాదవ్ ---3413Telangana Elections Counting Live Updates: హుజురాబాద్‌లో రౌండ్ 2 పూర్తి..
==> బీజేపీ ఈటల రాజేందర్... 2548
==> కాంగ్రెస్ వొడితల ప్రణవ్.... 2846
==> బీఆర్ఎస్ పాడి కౌశిక్... 3907==> అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ 1979 ఓట్ల ఆధిక్యం
==> మహబూబ్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ 630 ఓట్ల లీడ్
==> కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి 4389 ఓట్ల ఆధిక్యం
Telangana Elections Counting Live Updates: ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థులు 58 స్థానాల్లో, బీఆర్ఎస్ 29, బీజేపీ 8, ఎంఐఎం 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
Telangana Assembly Election 2023 Result Live: సిరిసిల్లలో కేటీఆర్ వెనుకంజలో ఉన్నారు. మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.
==> కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి 1365 ఓట్ల ఆధిక్యం
==> సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర 200 ఓట్లతో ముందంజ
==> స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి 2వ రౌండ్‌లో 441 ఓట్లతో ముందంజ
==> కల్వకుర్తి నియోజకవర్గంలో రెండవ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి 1100 ఓట్లు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.Telangana Elections Counting Live Updates: సూర్యాపేట సెగ్మెంట్:
మొదటి రౌండ్ లో స్వల్ప ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి రాంరెడ్డి దామోదర్ రెడ్డి..
BRS 4386
INC 4418
BJP 1425
Telangana Elections Counting Live Updates: నారాయణపేట జిల్లా ముక్తల్ నియోజకవర్గ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు
కాంగ్రెస్ - 3375
బిఆర్ఎస్ - 2962
బిజెపి - 2789
బీఎస్పీ - 173==> చెన్నూర్ బీఆర్ఎస్‌పై 3 వేల ఓట్లతో కాంగ్రెస్ ముందంజ
==> నిజామాబాద్ రూరల్ మొదటి రౌండ్
కాంగ్రెస్ 3246
బీఆర్ఎస్ 2751
బీజేపీ 2123Telangana Elections Counting Live Updates: మంచిర్యాల జిల్లాలో పోస్ట్ బ్యాలెట్ వివరాలు
==> మంచిర్యాల బీఆర్ఎస్‌పై 3070 కాంగ్రెస్ ముందంజ
==> బెల్లంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిపై 2,600 కాంగ్రెస్ ఆధిక్యంTelangana Elections Counting Live Updates: కామారెడ్డి నియోజకవర్గంలో మొదటి రౌండ్.. ఉత్కంఠ కొనసాగుతున్న కౌంటింగ్
==> ఫస్ట్ రౌండ్‌లో కాంగ్రెస్ ముందంజ
==> కాంగ్రెస్ 3647
==> బీఆర్ఎస్ 2603
==> బీజేపీ 2666==> గజ్వేల్‌లో తొలి రౌంట్‌లో సీఎం కేసీఆర్ ఆధిక్యంలో ఉన్నారు.
==> ఓవరాల్‌గా దాదాపు 50 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు, బీఆర్ఎస్ అభ్యర్థులు 10, బీజేపీ ఐదు, ఎంఐఎం ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.==> నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం 2408 ఓట్ల లీడ్
==> ఆలేరు అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి రౌండ్లో 720 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి బీర్లు ఐలయ్యTelangana Assembly Election 2023 Result Live: నల్గొండ సెగ్మెంట్ తొలి రౌండ్ ఫలితాలు
==> కోమటిరెడ్డి: 6121
==> కంచర్ల: 2931
==> పిల్లి రామరాజు: 1994
Telangana Elections Counting Live Updates: నల్గొండ నియోజకవర్గంలో మొదటి రౌండ్ పూర్తి.. 4 వేల ఓట్ల ఆధిక్యం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..
==> కొల్లాపూర్‌లో బర్రెలక్క ముందంజ
==> జుక్కల్, ఎల్లారెడ్డి, బాల్కొండలో కాంగ్రెస్ ఆధిక్యం
==> పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత
==> కొత్తగూడెంలో సీపీఐ ముందంజ
Telangana Assembly Election 2023 Result Live: కామారెడ్డిలో సీఎం కేసీఆర్ వెనుకంజలో ఉన్నారు. రేవంత్ రెడ్డి 376, సీఎం కేసీఆర్ 276, బీజేపీ అభ్యర్థికి 76 ఓట్లు పడ్డాయి.
Telangana Assembly Election 2023 Result Live: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 సీట్లలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.
Telangana Assembly Election 2023 Result Live: తెలంగాణ తొలి ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజ
మంథనిలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో శ్రీధర్ బాబు ఆధిక్యం
గజ్వేల్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో బీఆర్ఎస్ ముందంజ
ములుగు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో కాంగ్రెస్ ముందంజ
సిరిసిల్ల పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో బీఆర్ఎస్ ముందంజ
కొడంగల్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో కాంగ్రెస్ ముందంజ
మంచిర్యాల పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో కాంగ్రెస్ ముందంజ
వేములవాడ, సిరిసిల్లలో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు
వేములవాడలో 1306 , సిరిసిల్లలో 1546 పోస్టల్ బ్యాలెట్లు
Telangana Elections Counting Live Updates: వికారాబాద్, పరిగి, తాండూరు, రామగుండం, ధర్మపురి, డోర్నకల్, నిజామాబాద్ రూరల్, అర్భన్ స్థానాల్లో కాంగ్రెస్ దూకుడు
Telangana Elections Counting Live Updates: మంచిర్యాల, బెల్లంపల్లి, వేములవాడ, భద్రాచలం, పినపాక అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది.
Telangana Elections Counting Live Updates: మంచిర్యాల, బెల్లంపల్లి, వేములవాడ, భద్రాచలం, పినపాక అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది.
Telangana Elections Counting Live Updates: తెలంగాణ 119 నియోజకవర్గాలు.. (65/119)
==> పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
==> బీఆర్ఎస్-20 స్థానాల్లో ముందంజ
==> కాంగ్రెస్ - 40 స్థానాల్లో ముందంజ
==> బీజేపీ - 2 స్థానాల్లో ముందంజ
==> ఎంఐఎం - 3 స్థానంలో ముందంజTelangana Elections Counting Live Updates: హుజురాబాద్ పోస్టల్ బ్యాలెట్‌లో ఈటల రాజేందర్ ముందంజలో ఉన్నారు. పాలేరులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందంజలో ఉన్నారు.
Telangana Elections Counting Live Updates: ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12అసెంబ్లీ స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ అభ్యర్థుల ముందంజ
Telangana Assembly Election 2023 Result Live: వరంగల్ ఈస్ట్, కొడంగల్ పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్, సిరిసిల్లలో బీఆర్ఎస్ ముందంజలో ఉంది.
Telangana Elections Counting Live Updates: తెలంగాణ 119 నియోజకవర్గాలు
46/119
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
==> బీఆర్ఎస్-18 స్థానాల్లో ముందంజ
==> కాంగ్రెస్-25 స్థానాల్లో ముందంజ
==> బీజేపీ - ఒక స్థానంలో ముందంజ
==> ఎంఐఎం - ఒక స్థానంలో ముందంజ
==> ఇతరులు - 1Telangana Elections Counting Live Updates: ఖమ్మం నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ముందంజ
Telangana Elections Counting Live Updates: నల్గొండలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ముందంజలో ఉన్నారు. మధిరలో భట్టి విక్రమార్క ముందంజలో ఉన్నారు.
Telangana Elections Counting Live Updates: పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో కరీంనగర్ స్థానం నుంచి బండి సంజయ్ ముందంజలో ఉన్నారు. కామారెడ్డిలో కూడా బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.
Telangana Elections Counting Live Updates: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నియోజకవర్గాల వారీగా పోస్టల్ బ్యాలెట్స్ వివరాలు
==> నల్గొండ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు....4619
==> దేవరకొండ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు....1424
==> మిర్యాలగూడ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు....2569
==> మునుగోడు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు....1494
==> నకిరేకల్ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు....1910
==> నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు....1958.
==> సూర్యాపేట నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు....3153
==> కోదాడ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...2638
==> హుజూర్నగర్ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు....2143
==> తుంగతుర్తి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు....1530
==> భువనగిరి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు... 1031
Telangana Elections Counting Live Updates: మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఐజ ఇంజనీరింగ్ కళాశాలలో మొదలైంది. మూడు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు కార్యకర్తలు ఏజెంట్లు కౌంటింగ్ ప్రదేశంలోకి చేరుకున్నారు. మూడు అంచల భద్రత నడుమ భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లా సంబంధించిన కౌంటింగ్ కోసం 18 టేబుల్స్ ఏర్పాటు చేయగా.. నాలుగు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు, 14 టేబుల్లు ఈవీఎంలను లెక్కించటానికి ఏర్పాటు చేశారు.
==> కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో రెండు నియోజకవర్గాలకు జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.==> నల్గొండ జిల్లాలోని నల్గొండ, మునుగోడు, నకిరేకల్, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, దేవరకొండ ఆరు నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
==> సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట హుజూర్‌నగర్, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభం
==> యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి, ఆలేరు రెండు నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ప్రారంభం..
Telangana Elections Counting Live Updates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కిస్తున్నారు.
Telangana Elections Counting Live Updates: నేడు తెలంగాణతోపాటు ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మిజోరాం ఓట్ల లెక్కింపును సోమవారం చేపట్టనున్నారు.
Telangana Elections Counting Live Updates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కఠను రేపుతున్నాయి. భద్రచాలం, చార్మినార్, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో అతి తక్కువ రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. చార్మినార్ నుంచి తొలి ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది. చార్మినార్‌లో 94,830 ఓట్లు లెక్కించాల్సి ఉంది. చివరగా శేరిలింగంపల్లి అసెంబ్లీ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది.
Telangana Elections Counting Live Updates: గోషామహల్ నియోజకవర్గ ఓట్ల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోఠి ఉమెన్స్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు.
Telangana Elections Counting Live Updates: అన్ని సర్వేలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ అప్రమత్తమైంది. అధికారం ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు ఆరంభించింది. కర్ణాటక ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ పర్యవేక్షణలో మిషన్ తెలంగాణ నడుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
==> మొత్తం 14 కంట్రోలు యూనిట్లలోని ఓట్ల వివరాలు లెక్కించేందుకు 14 టేబుల్స్ సిద్ధం చేశారు. 14 ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు కంప్లీట్ అయితే.. ఒక రౌండు ముగిసినట్లుగా పరిగణిస్తారు.
==> ఒక అసెంబ్లీ స్థానంలో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా.. ఓటర్లు అధికంగా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో 28 ఈవీఎంల ఓట్ల లెక్కింపును ఒక రౌండ్ కింద లెక్కిస్తారు.
Telangana Elections Counting Live Updates: లెక్కింపు ప్రక్రియ ఇలా
మొదట పోస్టల్ ఓట్లను 25 బ్యాలెట్ల చొప్పున కట్టలు కట్టి కౌంటింగ్ ప్రారంభించనున్నారు. వీటి లెక్కింపు పూర్తయిన తరువాత అభ్యర్థులు లేదా వారి తరుఫున ఉన్న ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ను ఓపెన్ చేస్తారు. ముందుగా కేటాయించిన కంట్రోల్ యూనిట్లను టేబుల్‌కు ఒకటి చొప్పున బయటకు తీసుకువస్తారు.
==> కంట్రోల్ యూనిట్‌లోని 'Total' బటన్‌ను ప్రెస్ చేయగానే.. ఎన్ని ఓట్లు పోలయ్యానే విషయం తేలిసిపోతుంది. 17-C పేరుతో నమోదు చేసిన రికార్డుతో కంట్రోల్ యూనిట్‌లో వచ్చిన మొత్తం ఓట్లతో సరిపోల్చుతారు. ఓట్ల సంఖ్య సరిపోయిందా..? లేదా..? అని పరిశీలిస్తారు.
==> ఓట్ల సంఖ్య సరిపోయిన తరువాత ‘Result’ బటన్‌ను ప్రెస్ చేయగానే.. ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో అనే వివరాలు తెలిసిపోతాయి. ఓట్ల వివరాలను అధికారులు, పోలింగ్ ఏజెంట్లు నమోదు చేసుకుంటారు. ఏజెంట్ల నుంచి ఆమోదం తెలిపిన తరువాత వారి సంతకాలు తీసుకుని.. మరో కంట్రోల్ యూనిట్‌ను లెక్కిస్తారు.
Telangana Elections Counting Live Updates: ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలకు సిబ్బంది ఇప్పటికే చేరుకున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మొదట పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.