Telangana Exit Poll Result LIVE 2023: పోటెత్తిన ఓటర్లు.. పోలింగ్ శాతం ఎంతంటే..?
Telangana Assembly Election live Updates: 119 నియోజకవర్గాలు.. 2,290 మంది అభ్యర్థులు.. 3.26 కోట్ల మంది ఓటర్లు.. గురువారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు జరగనుంది. పోలింగ్‌కు సంబంధించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Telangana Election 2023 LIVE Updates in Telugu: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో గురువారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది అన్ని పోలింగ్ స్టేషన్లకు చేరుకుని ఏర్పాట్లు పూర్తిచేశారు. 2,290 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. 3.26 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటు శాతం పెంచే ఉద్దేశంతో ఇప్పటికే అన్ని సంస్థలకు సెలవు ప్రకటించారు. సాయంత్రం 5 గంటలకు వరకు క్యూలో నిల్చున్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. బరిలో నిల్చున్న అభ్యర్థులు ఓటరు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 3న తెలంగాణతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. రాష్ట్రంలో పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. దాదాపు 75 వేల మంది పోలీసు బలగాలను ఎన్నికల పోలింగ్‌లో పాల్గొంటున్నారు. ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి..
Latest Updates
Telangana Exit Poll Result LIVE Updates 2023: పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 70.18 శాతం పోలింగ్ నమోదైంది.
Telangana Exit Poll Result LIVE Updates 2023: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ విధుల్లో పాల్గొన్న సిబ్బందికి రేపు ప్రత్యేక సెలవు ప్రకటించారు. స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని సీఈవో వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శుక్రవారం ప్రత్యేక సెలవు రానుంది.
Telangana Exit Poll Result LIVE Updates 2023: తెలంగాణ ఎన్నికల పోలింగ్ ఇంకా కొనసాగుతోంది. క్యూలో నిల్చున్న ఓటర్లు అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాత్రి 10.30 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో 69.07 శాతం పోలింగ్ నమోదైంది.
==> ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన తెలంగాణ ప్రజలకు బీజేపీ తరపున అభినందనలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
==> ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు విశేషంగా కృషి చేశారు
==> బీఆర్ఎస్, కాంగ్రెస్ అనేక ప్రాంతాల్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించి డబ్బు, మద్యం పంపిణీ చేశారు
==> ఈ విషయంలో ఎన్నికల సంఘం మరింత కఠినంగా వ్యవహరించాల్సింది
==> ఈ రోజు జరిగిన ఎన్నికల్లో మంచి ఫలితాలు ఆశిస్తున్నాం..
==> పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు. అధికార బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పని చేశారు
==> పోలీసుల ముందే విచ్చల విడిగా మద్యం, డబ్బు పంపిణీ జరిగింది. అయినా చూసి చూడనట్లే వ్యవహరించారు.
==> అనేక నియోజకవర్గాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి. అయినా ధైర్యంగా ఎదుర్కొని, ఎన్నికల్లో ముందుకు వెళ్లారు.
==> నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఈరోజు జరిగన ఘటనను ఖండిస్తున్నా.. ఇది ఏమాత్రం మంచిది కాదు.
==> దుందుడుకు విధానంతో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదు.
==> ఏకపక్షంగా ప్రాజెక్టు గేట్లు ఎత్తి సాగర్ నీళ్లు తరలించడం సరైన పద్దతి కాదు.
==> ఇది వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల కుట్రతో కావాలనే చేశాయి. శాంతి భద్రత సమస్య రాకుండా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేలా లేఖ రాయాలని అనుకుంటున్నా..
==> ఎన్నికల సమయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు డ్రామా ఆడుతున్నాయి
==> బీజేపీ కార్యకర్తలపై దాడులు, దొంగ ఓట్లతో అరాచకాలు సృష్టించాయి. దీక్షా దివాస్ పేరుతో బీఆర్ఎస్ సెంటిమెంట్ రెచ్చగొట్టింది.
==> అడ్డంకులు ఎదురైనా బీజేపీ శ్రేణులు నిలవరించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.Telangana Exit Poll Result LIVE Updates 2023: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో రాత్రి 10 గంటల వరకు 67.95 శాతం పోలింగ్ నమోదైంది.
Telangana Exit Poll Result LIVE Updates 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిపై టైమ్స్ నౌ-ఈటీజీ నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేలో బీఆర్ఎస్‌కు 37-45 సీట్లు, కాంగ్రెస్ 60-70 సీట్లు, బీజేపీకి 6-8, ఎంఐఎం 5-7 సీట్లు వస్తాయని తేలింది.
Telangana Exit Poll Result LIVE Updates 2023: నల్గొండలోని చందంపేట మండలం కోరుట్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవలో ఆరుగురు కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే దేవరకొండలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం కోరుట్ల పోలింగ్ బూత్‌కు కాంగ్రెస్ నేత నర్సింహారెడ్డి వెళ్లగా.. కోరుట్ల సర్పంచ్ వాగ్వాదం జరిగింది. ఓటింగ్ ముగిసిన అనంతరం నర్సింహారెడ్డి సోదరుడు తిలక్ రెడ్డి వర్గీయులు కోరుట్ల వెళ్లారు. అక్కడ తిలక్ రెడ్డి వర్గీయులపై గొడ్డళ్లు, కర్రలతో గ్రామస్థుల దాడితో చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Telangana Exit Poll Result LIVE Updates 2023: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో రాత్రి 9 గంటల వరకు 64.57 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇంకా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఉన్నట్లుగా సమాచారం. పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది.
Telangana Exit Poll Result LIVE Updates 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటివరకు 64.26శాతం పోలింగ్ నమోదైంది. పలు పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు బారులు తీరడంతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది.
Telangana Exit Poll Result LIVE Updates 2023: భదాద్రి కొత్తగూడెం జిల్లా ఐదు నియోజకవర్గాలలో పోలింగ్ సమయం ముగింపు సమయానికి 66.40 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
==> అశ్వారావుపేట నియోజకవర్గంలో 71.84 శాతం
==> భద్రాచలం నియోజకవర్గం లో 67.30 శాతం
==> ఇల్లందు నియోజకవర్గంలో 65.18 శాతం
==> పినపాక నియోజకవర్గంలో 65.02 శాతం
==> కొత్తగూడెం నియోజకవర్గంలో 64.73 శాతంTelangana Exit Poll Result LIVE 2023: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో సాయంత్రం 7 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం 64.05%. ఇంకా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూలో ఉండడంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది.
==> డిసెంబర్ 3న విజయం సాధించేది భారత రాష్ట్ర సమితినే- కేటీఆర్
==> గత మూడున్నర నెలలుగా ఎన్నికల కోసం పనిచేసిన ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు
==> ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసేందుకు పనిచేసిన ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి, అధికారికి ధన్యవాదాలు
==> ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న దానితో సంబంధం లేకుండా మా విజయం పైన పూర్తి ధీమాగా ఉన్నాం
==> 2018లో కూడా కేవలం ఒక్క ఏజెన్సీ మినహా మిగిలినవి అన్నీ తప్పుడు ఫలితాలను సూచించాయి
==> తెలంగాణ ప్రజలను ఎగ్జిట్ పోల్స్‌తో అయోమయానికి గురిచేయాలని చేసిన ప్రయత్నం ఫలించదు
==> ఎగ్జిట్ పోల్స్‌ను తప్పు అని నిరూపించడం మా పార్టీకి కొత్త కాదు
==> అసలైన ఫలితం మూడవ తేదీన వస్తుంది
==> 70కి పైగా స్థానాలతో మా పార్టీ విజయం సాధిస్తుంది.. మా ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది
==> ఈ ఎగ్జిట్ పోల్స్‌ను చూసి కార్యకర్తలు నాయకులు అయోమయానికి గురికావాల్సిన అవసరం లేదు
==> ప్రజలు ఎన్నికల క్యూ లైన్‌లో ఉన్నప్పుడు ఎగ్జిట్ పోల్స్ ద్వారా వారివి ప్రభావితం అయ్యేలా నిర్ణయం తీసుకోవడంపై ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలి
==> రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈఓతో మాట్లాడితే ఎన్నికల కమిషన్ నిబంధనలు అలాగే ఉన్నాయని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్న నిబంధనలను మారిస్తే బాగుంటుంది
==> భవిష్యత్‌లో ఆయన ఈ అంశంపైన దృష్టి పెట్టాలి
==> తమ ఎగ్జిట్ పోల్స్ తప్పని తేలితే తెలంగాణ ప్రజలకు మూడవ తేదీన క్షమాపణ చెప్పాలి
==> దుష్ప్రచారాలు, అబద్ధాలు, నకిలీ వీడియోలతో ప్రజలను ప్రభావితం చేసేలా పని చేస్తున్న పార్టీలపైన ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవడంపై ఆలోచించాలి.Telangana Exit Poll Result LIVE Updates 2023: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పోలింగ్ సరళి ఇలా..
==> దేవర కద్ర--------78.32%
==> జడ్చర్ల ---------73.80 %
==> మహబూబ్ నగర్------69.32%
==> అలంపూర్----------76.16%
==> గద్వాల-------71.23%
==> అచ్చంపేట్------70.40%
==> కొల్లాపూర్------ 69.84%
==> నాగర్ కర్నూల్------72.27%
==> నారాయణ పేట------69.21%
==> మక్తల్------- 66.13%
==> వనపర్తి------72.60%
Telangana Exit Poll Result LIVE Updates 2023: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఐదు నియోజక వర్గాలలో పోలింగ్ సమయం ముగింపు సమయానికి 66.37 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
==> అశ్వారావుపేట నియోజకవర్గంలో 71.80 శాతం
==> భద్రాచలం నియోజకవర్గంలో 67 శాతం
==> ఇల్లందు నియోజకవర్గంలో 65.20 శాతం
==> పినపాక నియోజకవర్గంలో 65 శాతం
==> కొత్తగూడెం నియోజకవర్గంలో 64.70 శాతంకొత్తగూడెం నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలలోని పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు ఆలస్యంగా రావడంతో ఇంకా పోలింగ్ జరుగుతోంది. కొత్తగూడెం నియోజకవర్గంలో 2 నుంచి 3 శాతం ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది.
Telangana Exit Poll Result LIVE Updates 2023: కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క (శిరీష) ఓటమి పాలవుతుందని ఆరా మస్తాన్ సర్వే తెలిపింది. ఆమెకు 15 వేల ఓట్లు రావచ్చని అంచనా వేసింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న జూపల్లి కృష్ణారావు గెలిచే అవకాశం ఉందని సర్వేలో వెల్లడించింది. బర్రెలక్క గెలవకపోయినా గట్టి పోటీ ఇస్తారని సర్వేలో తేలింది.
Telangana Exit Poll Result LIVE Updates 2023: చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధిస్తుందని తేలింది. బీఆర్ఎస్ 21-31 సీట్లు, కాంగ్రెస్ 67-78 సీట్లు, బీజేపీ 6-9 సీట్లు, ఎంఐఎం 6-7 సీట్లు గెలుచుకుంటుందని సర్వేలో తేలింది.
Telangana Exit Poll Result LIVE Updates 2023: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్ శాతం నమోదు
ఆదిలాబాద్ 73.58 శాతం
భద్రాద్రి 66.37 శాతం
హనుమకొండ 62.46 శాతం
హైదరాబాద్ 39.97 శాతం
జగిత్యాల 74.87 శాతం
జనగాం 80.23 శాతం
భూపాలపల్లి76.10 శాతం
గద్వాల్ 73.60 శాతం
కామారెడ్డి 71.00 శాతం
కరీంనగర్ 69.22 శాతం
ఖమ్మం 73.77 శాతం
ఆసిఫాబాద్ 71.63 శాతం
మహబూబాబాద్ 77.50 శాతం
మహబూబ్ నగర్ 73.70 శాతం
మంచిర్యాల 70.71 శాతం
మెదక్ 80.28 శాతం
మేడ్చల్ 49.25 శాతం
ములుగు 75.02 శాతం
నాగర్ కర్నూల్ 70.83 శాతం
నల్గొండ 75.72 శాతం
నారాయణపేట 67.70 శాతం
నిర్మల్ 71.47 శాతం
నిజామాబాద్ 68.30 శాతం
పెద్దపల్లి 69.83 శాతం
సిరిసిల్ల 71.87 శాతం
రంగారెడ్డి 53.03 శాతం
సంగారెడ్డి 73.83 శాతం
సిద్దిపేట 77.19 శాతం
సూర్యాపేట 74.88 శాతం
వికారాబాద్ 69.79 శాతం
వనపర్తి 72.60 శాతం
వరంగల్ 73.04 శాతం
యాదాద్రి జిల్లాలో 78.31 శాతం పోలింగ్ నమోదు.Telangana Exit Poll Result LIVE Updates 2023: కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితం రాబోతోందని ఆరామస్తాన్ సర్వే వెల్లడించింది. సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇక్కడ ఓడిపోవచ్చని వీరి సర్వేలో వెల్లడైంది. బీజేపీ అభ్యర్థి వెంకటరమణా రెడ్డి గెలిచే అవకాశం ఉందని తెలిపింది.
Telangana Exit Poll Result LIVE Updates 2023: తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావచ్చని ఆరా సర్వేలో తేలింది. అధికార బీఆర్ఎస్‌కు 41-49 సీట్లు (39.58% ఓట్లు) మాత్రమే రావచ్చని వెల్లడించింది. ప్రస్తుత ప్రతిపక్షంలోని కాంగ్రెస్ ఏకంగా 58-67 (41.13% ఓట్లు) గెలుస్తుందని స్పష్టం చేసింది. బీజేపీకి 5-7 సీట్లు రావచ్చని వెల్లడించింది. ఎంఐఎం 7 గెలిచే ఉందని పేర్కొంది. ఇతరులకు 2 చోట్ల రావచ్చని అంచనా వేసింది.
Telangana Exit Poll Result LIVE Updates 2023: తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఆత్మసాక్షి నిర్వహించిన ఎగ్జిట్ పోల్‌లో బీఆర్ఎస్‌కు 58-63 సీట్లు, కాంగ్రెస్ 48-51 సీట్లు, బీజేపీ 7-8, ఎంఐఎం 6-07, ఇతరులు 1-02 సీట్లు గెలుచుకుంటారని అంచనా వేసింది. పూర్తి సర్వే కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Telangana Assembly Elections Polling Live Updates: తెలంగాణతో పాటు రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎవరు గెలుస్తారు..? అధికారంలోకి ఎవరు వస్తారు..? అనేద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Telangana Assembly Elections Voting Updates: ఆసిఫాబాద్ జిల్లాలోనీ రెండు నియోజకవర్గాల్లో ఐదు గంటల వరకు 71.63 శాతం పోలింగ్ నమోదయింది.
Telangana Assembly Elections Polling Live Updates: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటలలోపు క్యూలైన్‌లో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
Telangana Assembly Elections Voting Updates: సాయంత్రం 5.30గంటలకే ఎగ్జిట్ పోల్ ఫలితాలు
==> ఎగ్జిట్ పోల్ ఫలితాల సమయంలో మార్పులు చేసిన సీఈసీ
==> సాయంత్రం 5.30 గంటల నుంచే ఎగ్జిట్ పోల్
==> గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ మరో ప్రకటన చేసిన సీఈసీTelangana Assembly Elections Voting Updates: హైదరాబాద్ నగరంలోని కవాడీగూడలోని విద్యా విహార హైస్కూల్లో ఉన్న 88, 89 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తుండడంతో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. దీంతో ఓటర్లు గంటల తరబడి క్యూలైన్‌లలో నిల్చుంటున్నారు. దీంతో ఎన్నికల అధికారులపై ఓటర్లు అసహానం వ్యక్తం చేస్తున్నారు.
Telangana Assembly Elections Voting Updates: హైదరాబాద్ నగరంలోని కవాడీగూడలోని విద్యా విహార హైస్కూల్లో ఉన్న 88, 89 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తుండడంతో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. దీంతో ఓటర్లు గంటల తరబడి క్యూలైన్‌లలో నిల్చుంటున్నారు. దీంతో ఎన్నికల అధికారులపై ఓటర్లు అసహానం వ్యక్తం చేస్తున్నారు.
Telangana Assembly Elections Voting Updates: మంథని నియోజకవర్గంలో ముగిసిన పోలింగ్ సమయం
==> పోలింగ్ ముగిసే సమయానికి దాదాపు 71.24 శాతం ఓటింగ్ నమోదు
==> మెజారిటీ బూత్‌ల వద్ద ఇంకా క్యూ లైన్లలో ఓటర్లు
==> 4 గంటలలోపు క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు.
Telangana Assembly Elections Voting Updates: హైదరాబాద్ జిల్లాలో 3 గంటల వరకు పోలింగ్ వివరాలు ఇలా..
==> ముషీరాబాద్‌లో 27.98 శాతం, మలక్‌పేట్‌లో 29.16 శాతం, అంబర్‌పేట్‌లో 34.3 శాతం, ఖైరతాబాద్‌లో 37 శాతం,
==> జూబ్లీహిల్స్‌లో 35.3 శాతం, సనత్ నగర్‌లో 39.27 శాతం, నాంపల్లిలో 22.7 శాతం, కార్వాన్‌లో 32.4 శాతం,
==> గోషామహల్‌లో 35 శాతం, చార్మినార్‌లో 29.83 శాతం, చాంద్రాయణగట్టలో 24.6 శాతం, యాకుత్‌పురాలో 20.09 శాతం, బహదూర్ పురాలో 30.41 శాతం,
==> సికింద్రాబాద్‌లో 36.31 శాతం, కంటోన్మెంట్‌లో 37.81 శాతం పోలింగ్ నమోదు.==> యాదాద్రి-భువనగిరి జిల్లాలో సాయంత్రం 3 గంటల వరకు 66.71 శాతం పోలింగ్ నమోదు
==> సూర్యాపేట జిల్లాలో సాయంత్రం 3 గంటల వరకు 62.07 శాతం పోలింగ్ నమోదు
==> మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గంలో 4 గంటల వరకు పోలైన పోలింగ్ ఓటింగ్ శాతం 65.01.Telangana Assembly Elections Voting Updates: సిద్దిపేటలో స్వామి (54) అనే వ్యక్తి ఓటు వేసి.. తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో గుండెపోటుతో మరణించాడు. హార్ట్ స్ట్రోక్‌తో ఇబ్బంది పడగా.. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే స్వామి మరణించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ఓటు వేసేందుకు సిద్దిపేటకు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Telangana Assembly Elections Voting Updates: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతం వివరాలు ఇలా..
==> ఐదు నియోజకవర్గాల పరిధిలో 58.39% పోలింగ్ శాతం నమోదు
==> 117 కొత్తగూడెం.. 49.70%
==> 118 అశ్వారావుపేట.. 63.75%
==> 119 భద్రాచలం.. 63.00%
==> 110 పినపాక.. 63.01%
==> 111 ఇల్లందు.. 56.91%Telangana Assembly Ennikalu Voting Updates: తెలంగాణలో మధ్యాహ్నం మూడు గంటలకు 51.89 శాతం పోలింగ్ నమోదు అయింది.
==> అత్యధికంగా మెదక్‌లో 69.33 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
==> అత్యల్పంగా హైదరాబాద్‌లో 31.17 శాతం నమోదు
==> ఇప్పటివరకు ఓటు హక్కు వినియోగించుకున్న కోటి 60 లక్షల మంది ఓటర్లు
==> మొత్తం ఓటర్లు 3 కోట్ల 26 లక్షల మందిTelangana Assembly Ennikalu Voting Updates: మరి కాసేపట్లో సమస్యాత్మక ప్రాంతాల్లో ముగియనున్న పోలింగ్
==> 13 నియోజకవర్గాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగింపు..
==> 4 గంటల్లోపు క్యూ లైన్‌లో ఉన్నవాళ్లకు మాత్రమే ఓటు వేసేందుకు అనుమతిTelangana Assembly Ennikalu Voting Updates: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లిలో కాంగ్రెస్ నాయకుడిపై బీఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. పోలింగ్ బూత్ వద్ద ఓటు వేసేందుకు వచ్చిన వారికి గుర్తు చూపిస్తూ ఓటేయాలని అడుగుతున్నారని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ నాయకుడిపై దాడికి దిగారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది.
Telangana Assembly Ennikalu Voting Updates: మధ్యాహ్నం 3:00 గంటల వరకు ఖమ్మం జిల్లాలో పోలింగ్ శాతం ఇలా..
==> ఖమ్మం.. 59.40%
==> పాలేరు... 66.17%
==> వైరా.....66.20%
==> మధిర...65.40%
==> సత్తుపల్లి..63.07%
==> మొత్తం జిల్లాలో 63.62%Telangana Assembly Ennikalu Voting Updates: నారాయణపేట జిల్లాలో పోలింగ్ శాతం ఇలా..
==> ఉదయం 9 గంటలకు..
==> నారాయణపేట 8 శాతం
==> మక్తల్ 9.67 శాతం==> ఉదయం 11 గంటలకు...
==> నారాయణపేట 21.60 శాతం
==> మక్తల్ 24.56 శాతం==> మధ్యాహ్నం 1 గంటలకు...
==> నారాయణపేట 42.90 శాతం
==> మక్తల్ 42.31 శాతం==> మధ్యాహ్నం 3 గంటలకు...
==> నారాయణపేట 55.4 శాతం
==> మక్తల్ 58.86 శాతం.Telangana Assembly Ennikalu Voting Updates: ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 51.89 శాతం పోలింగ్ నమోదైంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 2023 లైవ్ అప్‌డేట్‌లు: ఎన్నికల కమిషన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేఖ రాశారు. బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అధికారులు బీఆర్ఎస్‌కు పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
==> నల్గొండ జిల్లాలో మధ్యాహ్నం మూడు గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం: 59.98
==> కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా 3 గంటల వరకు 59.04 శాతం నమోదుతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 2023 లైవ్ అప్‌డేట్‌లు: దేవరకొండ నియోజకవర్గంలోని ఎర్రగొండపల్లిలో ఓటర్లు బారులు తీరారు. ఒకరినొకరు నెట్టుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో ఓటు వేసేందుకు నలుగురిని మాత్రమే పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు. నలుగురు లోపలికి రాగానే తలుపులు మూసి.. వారు బయటకు వెళ్లిన తరువాత మరో నలుగురికి అనుమతి ఇస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 2023 లైవ్ అప్‌డేట్‌లు: కొత్తగూడెం శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాలలోని 107 పోలింగ్ బూత్‌లో పరమేశ్వరి అనే స్థానిక మహిళ ఓటును అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులు ముందుగానే వేస్తూ ఓటర్లను మోసం చేస్తున్నారని ఎన్నికల అధికారులకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి జలగం వెంకటరావు ఫిర్యాదు చేశారు. 107 పోలింగ్ బూత్‌లో పరమేశ్వరి అనే మహిళతో అదే స్లిప్‌పై మరొకసారి ఓటు వేసే అవకాశం కల్పించారని.. ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఎవరైనా దొంగ ఓటు వేస్తే బాధిత ఓటర్ ఛాలెంజ్ చేసే అవకాశం కల్పించాలని, సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగ ఓట్లు వేస్తున్న వారిపై చర్యలు తీసుకొని అవసరమైతే రీపోల్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 2023 లైవ్ అప్‌డేట్‌లు: ఖమ్మం జిల్లా కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల బూత్ నెంబర్ 99 వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు మధ్య తోపులాట జరిగింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 2023 లైవ్ అప్‌డేట్‌లు: రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. నిర్మల్ రూరల్ మండలం ఎల్లపెల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కండువా ధరించి ఓటుహక్కు వినియోగించుకోవడంతో ఎన్నికల నియమావళి ఉల్లంఘించారంటూ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
క్యూ లైన్లో నిలబడి ఓటు వేసిన విజయ్ దేవరకొండ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 2023 లైవ్ అప్‌డేట్‌లు: పటాన్ చెరులో BRS, BSP నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ భార్య సుధ పోలింగ్ కేంద్రం సందర్శనకు రాగా.. వారు అభ్యంతరం తెలిపారు. ఇస్నాపూర్ పోలింగ్ కేంద్రానికి ముగ్గురు నాయకులతో కలిసి ఆమె రావడంపై బీఆర్ఎస్, బీఎస్పీ నేతలు వాగ్వాదానికి దిగారు. పోలీసుల అక్కడి నుంచి అందరినీ పంపించేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 2023 లైవ్ అప్‌డేట్‌లు: కొడంగల్ నియోజకవర్గం రేగడి మైలారం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలింగ్ బూత్‌కు బీజేపీ అభ్యర్థి రావడంపై కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం తెలిపారు. పట్నం నరేందర్ రెడ్డి వెళ్లిపోయాక ఘర్షణకు దిగారు. రోడ్డుపై ఘర్షణకు ఘర్షణ పడగా.. పోలీసులు చెదరగొట్టారు.
ఓటు వేసేందుకు వచ్చి.. ఇద్దరు మృతి
Telangana Election 2023 Update: ఓటు వినియోగించుకోవడానికి వచ్చి ఇద్దరు వృద్ధులు చనిపోయిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మావల మండల కేంద్రంలోని పోలింగ్ బూత్ నంబర్ 140లో తోకల గంగమ్మ అని వృద్ధురాలు ఓటేసేందుకు కేంద్రానికి వచ్చింది. మధ్యాహ్నం 12:30 నిమిషాలకు ఫిట్స్ రావడంతో కిందపడిపోయింది. గమనించిన పోలింగ్ ఏజెంట్ తో పాటు స్థానికలు హుటాహుటిన ఆమెను రిమ్స్ కి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. భుక్తాపూర్‌కు చెందిన రాజన్న (65) ఓటు వేయడానికి వచ్చి క్యూలో నిలబడ్డాడు. లైన్ ఉన్నప్పుడే కళ్లు తిరిగి పడిపోవడంతో రిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు
Telangana Election 2023 Update: జిల్లాల వారీగా మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ శాతం వివరాలు ఇలా..
==> ఆదిలాబాద్ 41.88 శాతం
==> భద్రాద్రి 39.29 శాతం
==> హనుమకొండ 35.29 శాతం
==> హైదరాబాద్ 20.79 శాతం
==> జగిత్యాల 46.14 శాతం
==> జనగాం 44.31 శాతం
==> భూపాలపల్లి49.12 శాతం
==> గద్వాల్ 49.29 శాతం
==> కామరెడ్డి 40.78 శాతం
==> కరీంనగర్ 40.73 శాతం
==> ఖమ్మం 42.93 శాతం
==> ఆసిఫాబాద్ 42.77 శాతం
==> మహబూబాబాద్ 46.89 శాతం
==> మహబూబ్ నగర్ 44.93 శాతం
==> మంచిర్యాల 42.74 శాతం
==> మెదక్ 50.80 శాతం
==> మేడ్చల్ 26.70 శాతం
==> ములుగు 45.69 శాతం
==> నాగర్ కర్నూల్ 39.58 శాతం
==> నల్గొండ 39.20 శాతం
==> నారాయణపేట 42.60 శాతం
==> నిర్మల్ 41.74 శాతం
==> నిజామాబాద్ 39.66 శాతం
==> పెద్దపల్లి 44.49 శాతం
==> సిరిసిల్ల 39.07శాతం
==> రంగారెడ్డి 29.79శాతం
==> సంగారెడ్డి 42.17 శాతం
==> సిద్దిపేట 44.35 శాతం
==> సూర్యాపేట 44.14 శాతం
==> వికారాబాద్ 44.85 శాతం
==> వనపర్తి 40.40 శాతం
==> వరంగల్ 37.25 శాతం
==> యాదద్రి 45.07శాతం పోలింగ్ నమోదు.Telangana Election 2023 Update: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 43 శాతం పోలింగ్ నమోదు
==> కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 1 గంట వరకు 40.86% పోలింగ్ నమోదుTelangana Election 2023 Update: నిజామాబాద్ జిల్లా 1 గంట వరకు 39.66 శాతం పోలింగ్ నమోదైంది.
==> ఆర్మూర్ - 35.60%
==> బోధన్ - 36.41%
==> బాన్స్‌వాడ -53.20%
==> నిజామాబాద్ అర్బన్-33.41%
==> నిజామాబాద్ రూరల్ - 43.38%
==> బాల్కొండ - 38.90%
కామారెడ్డి జిల్లా-41.15%==> కామారెడ్డి - 34.62%
==> ఎల్లారెడ్డి -45.61%
==> జుక్కల్ - 43.24%
Telangana Election 2023 Update: అత్యధికంగా మెదక్‌లో 50 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా హైదరాబాద్‌లో 20 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది.
Telangana Election 2023 Update: మధ్యాహ్నం ఒంటి గంట వరకు సూర్యాపేట జిల్లాలో 44.14 శాతం పోలింగ్ నమోదైంది.
==> సూర్యాపేట 36.43 శాతం, తుంగతుర్తి 52.65%, హుజూర్ నగర్ 48.61%, కోదాడ 38.3%.
==> నల్గొండ జిల్లాలో 39.20%
==> నల్గొండ 41.06%, దేవరకొండ 33.4%, మిర్యాలగూడ 39.21%, మునుగోడు 42.33%, నకిరేకల్ 39.49%, నాగార్జునసాగర్ 40.20 శాతం పోలింగ్ నమోదైంది.
==> యాదాద్రి-భువనగిరి జిల్లాలో భువనగిరిలో 34%, ఆలేరు 47 శాతం పోలింగ్ నమోందైంది.Telangana Election 2023 Update: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 36.68 శాతం పోలింగ్ నమోదైంది.
Telangana Election 2023 Update: ఖమ్మం జిల్లా మధిరలో కుటుంబసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. మధిర పట్టణంలోని సుందరయ్య నగర్ మండల ప్రజా పరిషత్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో సతీమణి మల్లు నందిని విక్రమార్క, కుమారుడు మల్లు సూర్య విక్రమాధిత్యతో కలిసి ఆయన ఓటు వేశారు.
Telangana Election 2023 Update: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో మధ్యాహ్నం 1 గంట వరకు 44.57 పోలింగ్ శాతం నమోదైంది.
Telangana Election 2023 Update: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. టేబుల్ కుర్చీలు పడేసి దుర్భాషలాడుకున్నారు. రెండు వర్గాల నాయకులు ఒకరిపై ఒకరు దాడికి యత్నం చేశారు.
నిజామాబాద్ జిల్లా 11 గంటల వరకు పోలింగ్ శాతం
==> ఆర్మూర్ - 16.74%
==> బోధన్ - 24.32%
==> బాన్స్‌వాడ -28.51%
==> నిజామాబాద్ అర్బన్ - 14.65%
==> నిజామాబాద్ రూరల్ - 22.80%
==> బాల్కొండ - 23.10%
==> కామారెడ్డి - 26.02%
==> ఎల్లారెడ్డి -25.24%
==> జుక్కల్ - 22.43%
ఎంపీ అరవింద్‌కి జగిత్యాల జిల్లా మూడు బొమ్మల మేడిపల్లి గ్రామంలో నిరసన సెగ తగిలింది. MPగా గెలిచి గ్రామానికి ఎలాంటి పనులు చేయలేదని నిలదీశారు.
ప్రభుత్వం ఏర్పాటుపై ధీమాతో ఉన్న TPCC చీఫ్ రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు..
చింతమడక గ్రామంలో సీఎం కేసీఆర్ తన సతిమతితో కలిసి ఓటు వేసిన వీడియో..
తెలంగాణ వ్యాప్తంగా కొన్ని పోలింగ్ స్టేషన్స్ వద్ద ఇరు పార్టీలకు మధ్య గొడవ జరుగుతున్నాయి. తాజాగా రాజేంద్రనగర్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై మరొకర దుర్భాషలాడుతూ దాడికి యత్నించారు. ఘటన స్థాలాని పోలీసులు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.
==> తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది: తెలంగాణ ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్
==> ఈవీఎంల సమస్య వచ్చిన దగ్గర కొత్తవి మార్చాం
==> అర్బన్ ఏరియాల్లో ఇంకా పోలింగ్ శాతం పెరగాలి.. ఇక నుంచి పెరుగుతుందని అనుకుంటున్నాం..
==> అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి
==> జరిగిన ప్రతి కంప్లైంట్స్‌పై డీఈఓను రిపోర్ట్ అడిగాం..
==> కవిత, రేవంత్ వ్యాఖ్యలపై ఫిర్యాదు వచ్చాయి.
==> రిపోర్ట్ రాగానే కోడ్ ఉల్లంఘిస్తే ఎఫ్‌ఐఆర్ రిజిష్టర్ చేస్తారు
==> 11 గంటల వరకు 20.64శాతం నమోదు అయింది
==> రూరల్‌లో పోలింగ్ శాతం భాగానే ఉంది.Telangana Election 2023 Update: కామారెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డిలో 25.24, కామారెడ్డిలో 26.2, జుక్కల్‌లో 22.33 శాతం మంది ఓటర్లు వినియోగించుకున్నారని ఎన్నికల అధికారులు తెలిపారు.
Telangana Election 2023 Update: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం రాజుపేట కాలనీలో బూత్ నెంబర్ 144, 141 బూతుల్లో 400 మంది ఓటర్లు ఓటు వేయమని నిరసన తెలుతున్నారు. తమకు ఏ పార్టీ నాయకుడు డబ్బులు ఇవ్వలేదని.. తాము ఓటు ఎందుకు వేయాలంటూ ఆందోళన చేపట్టారు.
Telangana Election 2023 Update: సిద్దిపేట జిల్లా చింతమడక సీఎం కేసీఆర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రానికి రాని ఓటర్లు.. సీఎం కేసీఆర్ రాగానే భారీగా చేరుకున్నారు. భారీగా క్యూలైన్‌లో నిల్చున్నారు.
ఓటింగ్‌పై కేఏ పాల్ సీరియస్
Telangana Election 2023 Polling Live Updates: ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో 281వ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ఆగిపోయింది. బ్యాలెట్ యూనిట్‌పై బీఆర్ఎస్ కారు గుర్తును మార్కర్‌తో చెరిపివేశారు గుర్తుతెలియని వ్యక్తులు. పోలింగ్ కేంద్రానికి బీజేపీ అభ్యర్థి పాయల శంకర్, బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న చేరుకున్నారు. పోలింగ్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారి పరిశీలిస్తున్నారు.
Telangana Election 2023 Polling Live Updates: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలుర పాఠశాల వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులు పంచుతున్నారనే ఆరోపిస్తూ.. బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పోలింగ్ బుత్ నెంబర్ 228, 229 స్థానికేతరులు కామారెడ్డి ని వదిలి వెల్లిపోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు భారీగా మోహరించారు.
Telangana Election 2023 Polling Live Updates: వరంగల్ జిల్లాలో ఉదయం వరకు మందకొడిగా సాగిన పోలింగ్ తరువాత ఊపందుకుంది. ఓటర్లు ఓటు వేసేందుకు బారులుతీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు.
ఉదయం 11 వరకు నమోదైన ఓటింగ్ ఇలా..
==> వరంగల్ పశ్చిమ 17.23%
==> వరంగల్ తూర్పు 13.5%
==> పాలకుర్తి 22.28%
==> నర్సంపేట 18.5%
==> భూపాలపల్లి 27.8%
==> ములుగు 25.36%
==> వర్ధన్నపేట 22.4%
==> స్టేషన్ ఘనపూర్ 32%
==> జనగామ 10.86%
==> పరకాల 26.25%
==> మహబూబాబాద్ 26.91%
==> డోర్నకల్ 29.35 %Telangana Election 2023 Polling Live Updates: సనత్ నగర్ నియోజకవర్గం పద్మారావు నగర్‌లోని తుంగభద్ర మహిళా సంఘంలోని పోలింగ్ బూత్ నంబర్ 85లో ఓటు హక్కు వినియోగించుకున్నారు సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల. సెలవు దినంగా భావించకుండా ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుని.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థులు, యువత ఓటింగ్‌లో పాల్గొనాలని అన్నారు.
==> భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 22.04 శాతం పోలింగ్ నమోదు
==> కొమురం భీమ్ జిల్లాలో 11 గంటల వరకు 23.06 శాతం ఓటింగ్ నమోదుTelangana Election 2023 Polling Live Updates: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో ఉదయం 11 గంటల వరకు 20.64 శాతం పోలింగ్ నమోదైంది.
Telangana Election 2023 Polling Live Updates: ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో పోలింగ్ బూత్‌లో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఈ ఒక్కసారి చూడండి అంటూ దండం పెడుతూ ఓటర్లను ఆయన కోరగా.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
Telangana Election 2023 Polling Live Updates: ఖమ్మం జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 26 శాతం పోలింగ్ నమోదైంది.
Telangana Election 2023 Polling Live Updates: ఎమ్మెల్యే కాలనీ 159 పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి. అనంతరం మాట్లాడుతూ.. ఓటు మన ఆయుధం అని.. మన జీవితాలను మార్చేది ఓటు మాత్రమేన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు.
Telangana Election 2023 Polling Live Updates: జడ్చర్ల నియోజకవర్గంలో ఉదయం 11 గంటల వరకు పోలింగ్ శాతం 23.11 శాతం నమోదు అయింది.
స్కూటీపై వచ్చి ఓటేసిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్
స్కూటీపై వచ్చి ఓటేసిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్
==> నారాయణపేట జిల్లా 11 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు
==> నారాయణపేట నియోజకవర్గంలో 21.60 శాతం నమోదు
==> మక్తల్ నియోజకవర్గంలో 24.56 శాతం నమోదుTelangana Election 2023 Polling Live Updates: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కొత్తవారిపేటలో గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరించారు.
==> మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్‌కు నిరసన సెగ తగిలింది.
==> ఎన్నికల సమయంలో కంబాలపల్లి గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించడానికి వెళ్ళిన శంకర్ నాయక్‌ను కంబాలపల్లి గ్రామస్తులు నిలదీశారు
==> గత రెండు దఫాలుగా నీకు ఓటు వేసి గెలిపీంచామని.. మాకు ఏం చేశారని ఆగ్రహం
==> గ్రామ అభివృద్ధి పనులపై వస్తే కూడా పట్టించుకోలేదంటూ ఫైర్
==> శంకర్ నాయక్ మౌనం వహిస్తూ దండం పెట్టుకుంట ముందుకు సాగారుTelangana Election 2023 Polling Live Updates: కరీంనగర్ జ్యోతినగర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఓటు వేశారు.
Telangana Election 2023 Polling Live Updates: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 45, గవర్నమెంట్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పోలింగ్ నెంబర్ 151 కేంద్రం వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అక్కినేని నాగార్జున, అక్కినేని అమల, అక్కినేని నాగచైతన్య.
Telangana Election 2023 Polling Live Updates: ఖమ్మం జిల్లా ఎన్కూర్ మండలం రాజులపాలెం గ్రామంలో రహదారులు నిర్మించాలని నిరసన చేపట్టారు. తమ గ్రామంలో తమ సమస్య పరిష్కరించేంత వరకు ఓటు వేయమని ఓటు హక్కును బహిష్కరించారు. తమ గ్రామం ఏర్పడి 20 ఏళ్ల గడుస్తున్న తమ గ్రామానికి రహదారి ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజుల పాలెం గ్రామం నుంచి అద్భుత వెంకటేశ్వర స్వామి నాచారం గ్రామం వరకు రహదారి నిర్మించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించేంత వరకు ఓటు వేయమని నిరసన తెలిపారు. తమ సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
Telangana Election 2023 Polling Live Updates: సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి నేడు రోడ్ నెంబర్ 12 మినిస్టర్ క్వార్టర్ సమీపంలోని జీహెచ్ఎంసీ ట్రయినింగ్ సెంటర్‌లో ఓటు హక్కును తన కూతురుతో కలసి వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా ఇదే పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి వచ్చిన ఒక వృద్ధ మహిళ తన ఓటును వినియోగించుకుని వస్తున్న క్రమంలో తీవ్ర అస్వస్థతతో పడిపోగా.. గమనించిన అశోక్ రెడ్డి వెంటనే ఆ వృద్ధ మహిళలను ప్రత్యేక వాహనంలో చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Telangana Election 2023 Polling Live Updates: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ పోలింగ్ కేంద్రం వద్ద తోపులాట జరిగింది. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సీఐ స్వల్ప లాఠీఛార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన వెంకటేష్, శ్రీకాంత్.. వీడియో ఇదిగో..
Telangana Election 2023 Polling Live Updates: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనా.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని స్థానిక శంకర్ భవన్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన పోలింగ్ స్టేషన్ 148 కేంద్రంలో ఉదయం నుంచే ఈవీఎం ప్యాడ్ మొరాయించింది. ప్రారంభంలో కొన్ని ఓట్లు పోలింగ్ జరిగినప్పటికీ ఆ తరువాత సాంకేతిక లోపంతో ఆ కేంద్రంలోని ఈవీఎం పనిచేలేదు. దీంతో ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు గంటసేపు వరకు వేచి ఉన్నా.. సకాలంలో టెక్నీషియన్లు రాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఓటర్లు.. అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు, పోలీసులు ఎంత సముదాయించినప్పటికీ కూడా ఓటర్లు ఓటు వేయకుండా వెనుదిరిగిపోయారు.
TS Election 2023 LIVE Voting: తెలంగాణ పౌరుడిగా తన బాధ్యతను నెరవేర్చానని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఓటు ఉన్న వారంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. బంజారాహిల్స్‌లో మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నరు. రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేవాళ్లకే తాను ఓటు వేశానని ఆయన చెప్పారు.
==> యాదాద్రి జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 8.35 పోలింగ్ శాతం నమోదు.
==> ఖమ్మం జిల్లా లో 10.68 శాతం పోలింగ్ నమోదు
==> మేడ్చల్-2.4 శాతం
మల్కజ్‌గిరి-5.8 శాతం
కుత్బుల్లాపూర్-8.5 శాతం
కూకట్‌పల్లి-5.32 శాతం
ఉప్పల్-5 శాతం
==> మహబూబాబాద్ జిల్లాలో 10.92 శాతం పోలింగ్ నమోదు==> సూర్యాపేట జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 9.93 పోలింగ్ శాతం నమోదు
==> జనగామ జిల్లాలో 10.84 శాతం నమోదు
==> నల్గొండ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 8.66 పోలింగ్ శాతం నమోదు
==> వరంగల్: ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 6.89 శాతం నమోదు
==> నాగర్ కర్నూల్ జిల్లాలో 9 గంటల వరకు 11.83 శాతం నమోదు
==> భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో 8.33 శాతం నమోదు
==> వైరా నియోజకవర్గ ఐదు మండలాల పరిధిలో ఏడు గంటల నుంచి 9 గంటల వరకు పోలింగ్ శాతం 9.97 శాతం నమోదు
==> సత్తుపల్లి నియోజకవర్గం ఉదయం 9 గంటల వరకు 12 శాతం పోలింగ్ నమోదైంది.Telangana Election 2023 Polling Live Updates: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు ఇంటి ఎదుట ఓటర్ల ఆందోళన చేపట్టారు. తమకు డబ్బులు ఇవ్వకపోవడంతో ఆందోళన చెందిన ఓటర్లు.. వనమ నివాసానికి చేరుకొని ఆందోళన చేశారు.
Telangana Election 2023 Polling Live Updates: తెలంగాణలో ఉదయం 9 గంటల వరకు 8.38 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
Telangana Election 2023 Polling Live Updates: పోలింగ్ వేళ బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. విజయమేరి పోలింగ్ కేంద్రం వద్ద వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి.. లాఠీ ఛార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.
Telangana Election 2023 Polling Live Updates: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలంలోని లక్ష్మీపురం, పాత చింతకుంట, కొత్త చింతకుంట, గండ్ర బంధం, ఆర్లగండి, పగడాయి గూడెం గ్రామాలలో ఎన్నో ఏళ్ల నుంచి భూముల సమస్యలు పరిష్కారం కాకపోవటంతో ఈరోజు జరుగుతున్న ఎన్నికలను బహిష్కరించారు. 92వ పోలింగ్ బూత్‌లో 1003 ఓట్లకు గాను ఇంతవరకు ఒక ఓటు కూడా వేయలేదు. లక్ష్మీదేవిపల్లి ఎమ్మార్వో, ఎస్‌ఐ చర్చలు జరుపుతున్నా.. కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు.
Telangana Election 2023 Polling Live Updates: ఐదు సంవత్సరాల మన తలరాతను, రాష్ట్ర ప్రగతిని నిర్ణయించే ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూచించారు. సూర్యాపేటలోని విద్యానగర్ చైతన్య స్కూల్ బూత్ నెంబర్ 95లో సతీమణి సునీత, కుమారుడు వేమన్ రెడ్డి, కూతురు లహరి, కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనది, బలమైనది శక్తివంతమైనది అన్నారు. మన అధికారాన్ని ఇతరులకు ఇచ్చి పరిపాలించమని ఇచ్చే గొప్పఅవకాశం అయిన ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకొని వేయాలని కోరారు. ఓటు వేయకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న మంత్రి.. ఎన్ని అవాంతరాలు వచ్చినా సమయాన్ని కేటాయించి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Telangana Election 2023 Polling Live Updates: పార్టీ కండువాతో ఓటు వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి
Telangana Election 2023 Polling Live Updates: ఓటు వేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని నటుడు శివాజీ రాజా కోరారు. ఈరోజు సెలవుదినంగా వాడుకోవడం అన్యాయమని అన్నారు. వరుసగా రెండుసార్లు ఓటు వేయనివారి పాస్‌పోర్ట్ దగ్గరి నుంచి ప్రతి ప్రభుత్వ గుర్తింపు కార్డును రద్దు చేయాలని ఆయన కోరారు. ఎన్నో ఇక్కట్లు ఉన్నా.. వికలాంగులు, వృద్ధులు కూడా ఓటు వేయడానికి వస్తున్నారని.. యువత కూడా ముందుకు రావాలని సూచించారు. అన్ని పార్టీల అభ్యర్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు.
Telangana Election 2023 Polling Live Updates: మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 9 గంటల వరకు 27 శాతం పోలింగ్ అయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
Telangana Election 2023 Polling Live Updates: మంచిర్యాల జిల్లాలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల్, సిర్పూర్ నియోజకవర్గం, ఆసిఫాబాద్ నియోజకవర్గాలలో 4 గంటల వరకే పోలింగ్ జరగనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో చాలా పోలింగ్ బూత్‌లలో వాలంటరీలు లేక ఇబ్బంది పడుతున్నారు వికలాంగులు, వృద్ధులు. జిల్లావ్యాప్తంగా ఈవీఎంలు ఒకటి రెండు చోట్ల మొరాయించాయి.
Telangana Election 2023 Polling Live Updates: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యంపేట గ్రామంలో ఓటు వేయకుండా గ్రామస్తులు పోలింగ్‌ను బహిష్కరించారు. తమ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని ఓటును బహిష్కరించారు గిరిజన గ్రామస్తులు.
==> జనగామ జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ పాఠశాల వద్ద స్వల్ప ఉద్రిక్తత
==> పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పర్యవేక్షించిన బీఆర్ఎస్ అభ్యర్థి పళ్ళ రాజేశ్వర్ రెడ్డి
==> పోలింగ్ స్టేషన్ వద్ద ఎక్కువసేపు ఉన్నారని అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్ నాయకులు, సీపీఎం నాయకులు
==> ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ
==> ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
==> పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న ఏసీపీ దేవేందర్ రెడ్డిTelangana Election 2023 Polling Live Updates: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరయించడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టారు.
Telangana Election 2023 Polling Live Updates: కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలం మర్రికల్ గ్రామంలోని బూత్ నెం 12లో ఓటు హక్కును వినియోగించుకున్న స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క (కర్నె శిరీష)
Telangana Election 2023 Polling Live Updates: సూర్యాపేట పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు మంత్రి జగదీశ్ రెడ్డి.
Telangana Election 2023 Polling Live Updates: సిలిండర్‌కు దండం పెట్టి ఓటు వేసిన పొన్నం ప్రభాకర్
Telangana Election 2023 Polling Live Updates: ఖమ్మం నగరంలోని ఆర్వేస్ట్ పాఠశాలలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.
Telangana Election 2023 Polling Live Updates: పోలింగ్ కేంద్రాల్లో కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. సూర్యాపేట బూత్ నంబర్ 89, బాసర 262 బూత్, లక్సెట్టిపేట 83వ బూత్, మెదక్ జిల్లా ఎల్లాపూర్, కరీంనగర్లో 371వ నంబర్ బూత్లో ఈవీఎంలు పని చేయట్లేదు.
==> నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని పోలింగ్ బూత్ నంబర్ 161లో మొరాయిస్తున్న ఈవీఎం మిషన్
==> రామగుండం నియోజకవర్గం బూత్ నెంబర్ 100లో మొరాయిస్తున్న ఈవీఎం
==> కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రగతి నగర్‌లోని నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయంలో బూత్ నెంబర్ 114లో మొరాయిస్తున్న ఈవీఎం
==> కూకట్‌పల్లి నాగార్జున స్కూల్లో మొరాయించిన ఈవీఎంTelangana Election 2023 Polling Live Updates: ఓటేసిన ప్రముఖులు
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా మొదలైంది. ఉదయం నుంచే ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. పలు నియోజకవర్గాల్లో ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎమ్మెల్సీ కవిత జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కూకట్‌పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎల్లంపల్లిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నారాయణపురంలో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఓటు వేశారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో మంత్రి దయాకర్ రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది.
Telangana Election 2023 Polling Live: రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్
==> ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు భద్రత కట్టుదిట్టం చేశాం..
==> ఓటు అనే ఆయుధం ద్వారా మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉంది..
==> తెలంగాణ రాష్ట్రంలో 70 వేల మంది పోలీస్ సిబ్బంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి హోంగార్డ్ సిబ్బంది, కేంద్ర బలగాలతో బందోబస్త్ ఏర్పాటు చేశాం..
==> ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను.
==> నేను నా భార్య ఇద్దరం మా ఓటు హక్కును వినియోగించుకున్నాము..
==> మీరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి.
Telangana Election 2023 Polling Live: బీఎస్ఎన్ఎల్ సెంటర్ పోలింగ్ బూత్ 153లో ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్
Telangana Election 2023 Polling Live: జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓబుల్ రెడ్డి స్కూల్‌లో ఓటు వేశారు.
Telangana Election 2023 Polling Live: ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బ గ్రామంలో బూత్ నెంబర్ 32లో సాంకేతిక సమస్యతో మొరాయించిన ఈవీఓం మిషన్
Telangana Election 2023 Polling Live Updates: మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 283 పోలింగ్ స్టేషన్లకు గాను 12 పోలింగ్ స్టేషన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఒక్కొక్క మండల కేంద్రంలో ఒక మహిళా పోలింగ్ స్టేషన్, ఒక మోడల్ పోలింగ్ స్టేషన్, మహబూబాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఒక పీడబ్ల్యుడీ పోలింగ్ స్టేషన్, ఒక వికలాంగులకు ఒక పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ 12 పోలింగ్ స్టేషన్లను ప్రత్యేకంగా అలంకరించారు. పోలింగ్ స్టేషన్ల ముందు అందంగా ముగ్గులు వేశారు. పోలీస్ స్టేషన్ల లోపట బెలూన్లు, బంతిపూలు మొదలైన వాటితో అలంకరించారు. మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ ప్రారంభమైంది. ప్రత్యేక ఆబ్జర్వర్ హీరా సింగల్ మాక్ పోలింగ్‌ను పరిశీలించారు.
ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు
Telangana Election 2023 Polling Live Updates: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటును ప్రభావితం చేసే క్రమంలో పట్టు బడ్డ భారీ సొమ్ము
==> కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో గల బీఆర్ఎస్ నాయకుడు కనుకుంట్ల శ్రీను ఇంట్లో ఆకస్మిక తనిఖీలు
==> తనిఖీల్లో భాగంగా రూ.11 లక్షల 79 వేలు, ఓటర్ స్లిప్‌లను స్వాధీనం చేసుకున్న ఎన్నికల అధికారులు
==> బీఆర్ఎస్ నాయకుడు కనుకుంట్ల శ్రీనుపై కేసు నమోదు